ట్రంప్‌ను చం*పేందుకు ఇరాన్ కుట్ర..!

ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు అణుయుద్ధానికి దాడి తీసే అవకాశం ఉందా? ఇరాన్‌పై ఇజ్రాయిల్ అణుబాంబు వేస్తే, పాకిస్తాన్ ఇజ్రాయిల్‌పై అణుదాడి చేస్తుందని ఎవరు హెచ్చరించారు? అసలు ఇరాన్- ఇజ్రాయెల్ మధ్యలో పాకిస్థాన్ కు సంబంధం ఏంటి ? ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఎక్కడ దాక్కున్నారు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను చంపేందుకు ఇరాన్ కుట్ర పన్నిందా? ఇరాన్‌లో ఉన్న భారతీయ విద్యార్థుల పరిస్థితి ఏంటి.?

ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరాయి. ఇజ్రాయిల్ సైన్యం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 200 యుద్ధ విమానాలతో ఇరాన్‌లో 100కి పైగా లక్ష్యాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో పలు న్యూక్లియర్ కేంద్రాలు, సైనిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో చాలా మంది పౌరులు, కీలక సైనిక అధికారులు, ఆరుగురు న్యూక్లియర్ శాస్త్రవేత్తలు చనిపోయారు. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హొస్సేన్ సలామీ కూడా మృతి చెందాడు. ఈ దాడులు ఇరాన్ నుంచి న్యూక్లియర్ దాడిని అడ్డుకోవడానికి చేశామని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ చెప్పారు. అటు ఇరాన్ ఈ దాడులను పెద్ద తప్పుగా ఖండించింది.

ఇరాన్ చమురు క్షేత్రాలను కూడా లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ దాడి దేసింది. ఈ దాడుల్లో తెహ్రాన్‌లోని ఆయిల్ డిపో ధ్వంసమైంది, దీంతో చమురు ధరలు 10% పెరిగాయి. చమురు రవాణాకు అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్ ఆర్థిక వ్యవస్థలో చమురు ఎగుమతులు కీలకం కాబట్టి, ఈ దాడులు దేశాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఈ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ టెల్ అవీవ్, జెరూసలెం మీద 200 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడుల్లో 14 మంది ఇజ్రాయిలీలు చనిపోయారు. ఈ దాడులు రెండు దేశాల మధ్య యుద్ధ భయాలను మరింత పెంచాయి.

ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఈ దాడుల సమయంలో ఎక్కడ ఉన్నారనే దానిపై స్పష్టత లేదు. అయితే ఆయన కుటుంబంతో కలిసి బంకర్ లో దాక్కున్నారని సమాచారం. ఖమేనీని లక్ష్యంగా దాడులకు ఇజ్రయెల్ ప్రణాళిక ఆలోచించినట్టు, కానీ ట్రంప్ దాన్ని తిరస్కరించారని వార్తలు వచ్చాయి. ఈ పరిస్థితి ఇరాన్ పాలక వర్గంలో భయాందోళనలను పెంచింది.

అటు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయాలని ఇరాన్ కుట్రలు పన్నిందని, ఇరాన్ ట్రంప్‌ను ప్రధాన శత్రువు గా భావిస్తోందని ఆయన ఆరోపించారు. 2024లో ట్రంప్‌పై జరిగిన రెండు హత్యాయత్నాల వెనుక ఇరాన్ ఉందని నెతన్యాహూ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇరాన్‌కు ట్రంపే నంబర్‌వన్‌ శత్రువు అని… అమెరికా అధ్యక్షుడు సమస్యను పరిష్కరించగల సమర్థ నాయకుడి అన్నారు. బలహీనమైన రీతిలో బేరసారాలు చేయడానికి ఆయన ఎప్పుడూ ఇష్టపడరని… ప్రత్యర్థికి లొంగిపోరని… గతంలోనూ ఆయన ఓ నకిలీ ఒప్పందాన్ని పక్కనబెట్టి.. ఖాసిమ్‌ సులేమానీని మట్టుబెట్టారని గుర్తు చేశారు.. ఇరాన్‌ దగ్గర అణ్వాయుధం ఉండకూడదూ అంటే వారు యురేనియంను శుద్ధి చేయకూడదని.. . అందుకోసం ట్రంప్‌ కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని నెతన్యాహూ తెలిపారు. దీంతో ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ప్రధాన శత్రువుగా మారారరని.. అందుకే ట్రంప్ ను చంపాలని ఇరాన్ చూస్తోందని నెతన్యాహు ఆరోపించారు.

అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్ అమెరికాపై దాడి చేస్తే, యుఎస్ సైన్యం ఇప్పటివరకూ చూడని స్థాయిలో స్పందిస్తుంది అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫారమ్‌లో పేర్కొన్నారు. అయితే, ట్రంప్ ఇరాన్‌తో న్యూక్లియర్ ఒప్పందం కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. జూన్ 15న ఒమన్‌లో జరగాల్సిన చర్చలు ఇజ్రాయిల్ దాడుల కారణంగా రద్దయ్యాయి. భారత్-పాకిస్తాన్ మధ్య జరిగినట్టు .. ఇరాన్, ఇజ్రాయిల్ ఒప్పందం చేసుకోవాలని ట్రంప్ తెలిపారు. ఇరాన్ పై ఇజ్రాయిల్ దాడులకు అమెరికా మద్దతు ఇవ్వలేదని స్పష్టం చేశారు.

మరోవైపు ఇజ్రాయిల్ ఇరాన్‌పై అణుబాంబు ప్రయోగిస్తే, పాకిస్తాన్ ఇజ్రాయిల్‌పై అణుదాడి చేస్తుందని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ జనరల్ మొహ్సెన్ రెజాయీ హెచ్చరించారు. దీనికి పాకిస్థాన్ నుంచి తమకు తమకు హామీ వచ్చిందని అని రెజాయీ చెప్పారు. అయితే, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఈ వాదనను తోసిపుచ్చారు, అలాంటి హామీ ఇవ్వలేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఇజ్రాయిల్‌ను గుర్తించని దేశం, ఇరాన్‌తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉంది.

అటు ఇరాన్‌లో ఉన్న భారతీయ విద్యార్థుల భద్రత కోసం భారత్ చురుగ్గా చర్యలు తీసుకుంటోంది. జూన్ 15న, ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక హెచ్చరిక జారీ చేసింది. భారతీయ విద్యార్థులు, వ్యాపారవేత్తలు, ఇతరులతో సంప్రదింపులు జరుపుతున్నామని… వారి భద్రతకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని పేర్కొంది. ఇరాన్‌లో సుమారు 2,000 మంది భారతీయ విద్యార్థులు ఉన్నట్టు అంచనా వేశారు. వీరిని భారత విదేశాంగ శాఖ సురక్షితంగా తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో విమానాల ద్వారా తరలింపు జరిగే అవకాశం ఉంది.

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో శాంతిని దెబ్బతీశాయి. ఇజ్రాయిల్ దాడులు ఇరాన్ న్యూక్లియర్ కార్యక్రమాన్ని నాశనం చేయడంతో పాటు, సైనిక సామర్థ్యాన్ని దెబ్బతీశాయి. అటు ఇరాన్ ప్రతీకార దాడులు ఇజ్రాయిల్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. ఇరాన్ ట్రంప్‌ను చంపాలని ప్రయత్నించిందని.. ఇది ఇరాన్‌పై ఇజ్రాయిల్ దాడులకు మరో కారణమని నెతన్యాహు అంటున్నారు. ఇజ్రాయిల్ దాడులకు అమెరికా దూరంగా ఉన్నప్పటికీ, ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలు కొనసాగించాలని చూస్తోంది.