యూట్యూబ్ లో కాపీరైట్ స్ట్రైక్ వేయించాడని.. లైవ్ స్ట్రీమ్ లో చంపేశాడు..!

అమెరికాలోని లాస్ వెగాస్ లో జరిగిన ఓ ఘటన సంచలనం రేపింది. యూట్యూబ్ లో కాపీరైట్ గొడవ, ట్రోలింగ్ మర్డర్ వరకు వెళ్లింది. ఓ ప్రముఖ యూట్యూబర్ ను.. యూట్యూబ్ లైవ్ లోనే కాల్చి చంపేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ హత్యకు కారణమేంటి..? కాపిరైట్స్ గొడవ మర్డర్ వరకు ఎలా వెళ్లింది..? అసలు చనిపోయిన యూట్యూబర్ ఎలా ఫేమస్..? దీనిపై ఆన్ లైన్ లో యూజర్లు ఎలా స్పందిస్తున్నారు..? యూట్యూబర్ల మధ్య గొడవలకు కారణాలేంటి..? ఒకరిపై ఒకరు విమర్శలు ఎందుకు చేసుకుంటున్నారు..?

అమెరికాలోని లాస్ వెగాస్ లో ఓ షాకింగ్ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. అమెరికన్ కు చెందిన ఫిన్నీ డా లెజెండ్ అనే యూట్యూబర్, అతని వైఫ్ బబ్లీతో కలిసి లైవ్‌స్ట్రీమ్ చేస్తుండగా, ఒక వ్యక్తి గన్ తీసి కాల్పులు జరిపాడు. వీరిద్దరు స్పాట్‌లోనే చనిపోయారు. లైవ్‌స్ట్రీమ్‌లో కాల్పులు, అరుపులు, జనం పరిగెత్తడం కెమెరాలో రికార్డ్ అయ్యాయి. యూట్యూబ్ ఈ వీడియోని తీసేసింది. కానీ క్లిప్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లైవ్‌స్ట్రీమ్ చివర్లో ఒక పోలీస్ ఆఫీసర్ కెమెరాని ఆఫ్ చేసిన సీన్ కనిపిస్తుంది. ఈ ఘటన ఆన్‌లైన్‌లో సోషల్ మీడియాలో సంచలనం రేపింది.

యూట్యూబర్ ఫిన్నీని ఎవరు చంపారు?
కాల్పులు జరిగిపింది మాన్యుయెల్ రూయిజ్ అనే మరో యూట్యూబర్ గా గుర్తించారు. కాల్పుల తర్వాత అతడు పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. ఈ ఘటన ఆన్‌లైన్ రైవలరీ .. నిజ జీవితంలో దాడుల వరకు వెళ్తుందనడానికి ఒక ఉహదారణ. ఫిన్నీ డా లెజెండ్, రియల్ నేమ్ రాడనీ ఫిన్లీ, లాస్ వెగాస్ కు చెందిన యూట్యూబర్. కేవలం 3,400 సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నా మంచి వీడియోలు అప్ లోడ్ చేసేవాడు. వెగాస్ స్ట్రిప్, ఫ్రీమాంట్ స్ట్రీట్, కాసినోల లైవ్‌స్ట్రీమ్స్‌తో పాపులర్ అయ్యాడు. అతని కంటెంట్ కాజువల్, ఫన్ వైబ్‌తో, వీవర్స్‌తో ఇంటరాక్టివ్ గా ఉంటాయి.

కాల్పులకు కారణం ఏంటి?
కాల్పుల వెనక ఫిన్నీ, రూయిజ్ మధ్య ఆన్‌లైన్ కంటెట్ విషయంలో గొడవ ప్రధాన కారణం. 2023లో రూయిజ్ ఫిన్నీ భార్య బబ్లీపై పెప్పర్ స్ప్రే యూజ్ చేసిన ఇన్సిడెంట్‌తో ఈ గొడవ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత ఇద్దరూ యూట్యూబ్‌లో కాపీరైట్ స్ట్రైక్స్, ట్రోలింగ్, పర్సనల్ అటాక్స్‌తో గొడవపడుతూనే ఉన్నారు. గత ఏడాది మార్చిలో ఫిన్నీ పోస్ట్ చేసిన ఓ వీడియోకు.. రూయిజ్ కాపీరైట్ క్లెయిమ్ చేయడంతో గొడవ పెద్దదైంది. , సిన ఫిన్నీని టార్గెట్ చేస్తూ రూయిజ్ వీడియోస్ పోస్ట్ చేశాడు. దీనికి ఫిన్నీ స్ట్రైక్ పడేలా చేశాడు. ఈ ఆన్‌లైన్ గొడవ రియల్-వరల్డ్ హత్య వరకు వెళ్లింది.

ఈ ఘటనపై ఫాలోవర్స్ ఎలా స్పందిస్తున్నారు.?
ఈ ఘటన ఒక్క ఫిన్నీ ఫ్యాన్స్ నే కాదు యావత్తు సోషల్ మీడియా పోలోవర్స్ ను షాక్ గురి చేసింది. ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని వ్యాక్యానిస్తున్నారు. అయితే యూట్యూబర్ల మధ్య గొడవలు ఒక్క అమెరికాలోనే కాదు.. ప్రపంచం మంతా ఉన్నాయి. ముఖ్యంగా భారత్ లో యూట్యూబర్ల గొడవలు తక్కువేం కాదు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. వీడియోలు పెట్టడం ఈ మధ్య కామన్ గా మారింది. వీరికి తోడు ఫాలో వర్స్ కూడా ట్రోలింగ్స్ తో చెలరేగిపోతున్నారు. ఒక విషయం నిజమో కాదు తెలుసుకోకుండా.. వీడియోలకు వెంటనే రియాక్ట్ అయ్యి.. తిడుతూ కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా ట్రావెల్ యూట్యూబర్లలో రైవలరీ ఎక్కువగా నడుస్తోంది. ఒకరు ప్రదేశానికి మరొకరు వెళ్లడంతో.. పోటీ పెరుగుతోంది.. వ్యూస్ తగ్గిపోవడంతో కొంత మంది ప్రస్టేట్ అవ్వి.. పోటీ యూట్యూబర్లను టార్గెట్ చేస్తున్నారు. అయితే ఈ గొడవలు ఆన్ లైన్ వరకు పరిమితమైతే సరిపోతుంది. కాని ఇవి కేసుల వరకు వెళ్తున్నాయి. అమెరికాలో జరిగిన ఘటన కూడా ఇలాంటిదే.. అయితే ఇది కేసుల నుంచి మర్డర్ల వరకు వెళ్లింది. అందుకే ఆన్ లైన్ తగదాలను .. ఆఫ్ లైన్ లోకి తీసుకు రాకూడదని నిపుణులు చెబుతున్నారు. నెగిటివ్ కామెంట్లను, ట్రోల్స్ ను తట్టుకోలేని వారు.. సోషల్ మీడియాకు దూరంగా ఉండటం మేలని అంటున్నారు.