
Trump Nominated for Nobel Peace: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి పాకిస్థాన్ నామినేట్ చేసిన మరుసటి రోజే, ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. ఈ సంఘటనతో ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి అర్హుడా అనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ఒబామా 2009లో నోబెల్ గెలిచినప్పుడు కూడా వివాదాలు చెలరేగాయి. ట్రంప్ కూడా అదే దారిలో ఉన్నారా? ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతికి అర్హుడా..? ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు అమెరికా ఏ దేశాలపై దాడులు చేసింది? ఏ దేశాలపై దాడులకు సహకరించింది? నోబెల్ శాంతి బహుమతి ఇవ్వడానికి అసలు అర్హతలు ఏమిటి?
ఆపరేషన్ సిందూర్ తర్వాత ట్రంప్ ను మాట్లాడితే ఆకాశానికి ఎత్తేస్తోంది అమెరికా. ట్రంప్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది కూడా. భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన దాడులను అడ్డుకున్నందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ట్రంప్‌ను నిజమైన శాంతి స్థాపకుడు అని, వ్యూహాత్మక దూరదృష్టి, నాయకత్వం కలిగిన వ్యక్తిగా పొగడ్తలు కురిపించింది. కానీ, భారత్ ఈ వాదనను తోసిపుచ్చింది. ఈ ఆపరేషన్ సిందూర్ తర్వాత జరిగిన చర్చలు నేరుగా భారత్-పాక్ సైనిక అధికారుల మధ్య జరిగాయి, అమెరికా మధ్యవర్తిత్వం చేయలేదు అని భారత్ స్పష్టం చేశారు. అయితే పాకిస్థాన్ ట్రంప్ ను నోబెల్ కు నామినేట్ చేసిన మరుసటి రోజే అమెరికా ఇరాన్‌లోని ఫోర్డో, నాటాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై B-2 స్టెల్త్ బాంబర్లు, టామ్‌హాక్ మిసైళ్లతో దాడులు చేసింది. ఈ దాడులు అద్భుతమైన విజయం అని ట్రంప్ కూడా ప్రకటించారు.
ట్రంప్ నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నిస్తున్నారా? ట్రంప్ గతంలో బహిరంగంగానే తాను నోబెల్ గెలవాలి అని చెప్పారు. ఆయన మొదటి టర్మ్‌లో ఇజ్రాయిల్-యూఏఈ, బహ్రెయిన్‌ల మధ్య శాంతి ఒప్పందం , ఉత్తర కొరియాతో చర్చలు, ఆఫ్ఘనిస్తాన్‌లో ఐసిస్ నాయకుడి హత్యకు సహకరించినందుకు నోబెల్ రావాలని చెప్పారు. భారత్-పాక్, రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయిల్-ఇరాన్ సంఘర్షణలను అడ్డుకున్నా తనకు నోబెల్ రాదు అని ట్రంప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఒబామా 2009లో నోబెల్ గెలిచినప్పుడు ఎనిమిది నెలల్లోనే ఒబామాకు ఎలా ఇచ్చారు? అని ట్రంప్ విమర్శించారు. కానీ, ఇరాన్‌పై దాడుల తర్వాత ట్రంప్ నామినేషన్‌పై విమర్శలు వస్తున్నాయి. గాజాలో జెనోసైడ్‌కు, ఇరాన్‌పై దాడులకు సపోర్ట్ చేసే ట్రంప్ నోబెల్‌కు అర్హుడు కాదని కొంతమంది విమర్శిస్తున్నారు. Trump Nominated for Nobel Peace.
ట్రంప్ నోబెల్ శాంతి బహుమతికి అనర్హుడా? ట్రంప్ మొదటి టర్మ్‌లో అబ్రహం ఒప్పందాలు, ఉత్తర కొరియాతో డిప్లొమసీ వంటి శాంతి కృషిని చూపించారు. కానీ, ఇరాన్‌పై తాజా దాడులు, గాజాలో ఇజ్రాయిల్ యుద్ధానికి మద్దతు వంటివి ఆయన నామినేషన్‌ను వివాదాస్పదం చేశాయి. ట్రంప్ మొదటి టర్మ్ లో, అమెరికా సిరియాపై 2017, 2018లో రసాయన ఆయుధాల వాడకం ఆరోపణలతో వైమానిక దాడులు చేసింది. 2020లో ఇరాక్‌లో ఇరాన్ జనరల్ ఖాసిం సులైమానీని డ్రోన్ దాడిలో హతమార్చింది. ఆఫ్ఘనిస్తాన్‌లో ఐసిస్‌పై దాడులు, 2019లో ఐసిస్ నాయకుడు అబూ బకర్ అల్-బాగ్దాదీ హత్యకు సహకరించింది. రెండో టర్మ్‌లో ఇప్పుడు ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసింద. గాజా, ఇరాన్‌పై దాడులకు ఇజ్రాయిల్‌కు ట్రంప్ ప్రభుత్వం మిసైల్ డిఫెన్స్ సిస్టమ్‌లు, ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఇచ్చింది. ఈ దాడులు ఇరాన్ అణు ఆయుధాలు తయారు చేయకుండా అడ్డుకోవడానికి అని అమెరికా చెబుతోంది. ఓ పక్క దేశాలపై దాడులు చేస్తూ.. శాంతి కోసం తన ప్రయత్నమని ట్రంప్ చెప్పుకోవడం విడ్డూరంగా ఉందనే మాట వినిపిస్తోంది. పైగా భారత్ , పాకిస్థాన్ మధ్య శాంతి తన వల్లే వచ్చిందని ట్రంప్ చెప్పుకోవడం వెనుక .. ఈ నోబెల్ శాంతి బహుమతి ఆశ ఉందనే మాట కూడా వినిపిస్తోంది. అందుకే భారత్ .. శాంతి చర్చల్లో అమెరికా పాత్ర లేదని చెప్పినా ట్రంప్ పదేపదే తనదే క్రెడిట్ అంతా అని చెప్పుకోవడం వెనుక ఈ ఆశే ఉందని డైట్ వ్యక్తమవుతోంది.
నోబెల్ శాంతి బహుమతి అర్హతలు ఏమిటి? నోబెల్ కమిటీ ప్రకారం, ఆయుధ నియంత్రణ, శాంతి చర్చలు, ప్రజాస్వామ్యం, మానవ హక్కులు, ప్రపంచ శాంతికి కృషి చేసిన వారు అర్హులు. జాతీయ ప్రభుత్వాలు, రాష్ట్రాధినేతలు, గత విజేతలు, కొన్ని అంతర్జాతీయ సంస్థల సభ్యులు నామినేట్ ఎవరినైనా నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయొచ్చు. ట్రంప్‌ను పాకిస్తాన్ నామినేట్ చేసినా, ఇరాన్‌పై దాడులు, గాజాలో ఇజ్రాయిల్ యుద్ధానికి మద్దతు వంటివి ఆయన అర్హతను సందేహాస్పదం చేస్తున్నాయి. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ఈ దాడులు మిడిల్ ఈస్ట్‌లో శాంతిని దెబ్బతీస్తాయి అని హెచ్చరించారు. పాకిస్తాన్ నామినేషన్‌ను కొందరు రాజకీయ ఎత్తుగడ గా, కాశ్మీర్ విషయంలో అమెరికా మద్దతు కోసమని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా ఈ నామినేషన్ అంశం తర్వాత పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ మునీర్ ను ట్రంప్ వైట్ హౌస్ లో విందుకు పిలిచారు. అయితే నోబెల్ శాంతి బహుమతి ప్రతిపాదన తీసుకురావడం వల్లే పాకిస్థాన్ ను ట్రంప్ చేరదీస్తున్నారని భారత్ తో కొందరు విమర్శిస్తున్నాయి. ఒక పక్క దాడులు చేస్తూ.. మరో పక్క దాడులు చేస్తూ యుద్ధాలకు కారణమవుతున్న ట్రంప్ కు నోబెల్ శాంతి బహుమతి ఇస్తే ఆ అవార్డుకే అవమానమనే మాట వినిపిస్తోంది.