బెల్లీ ఫ్యాట్ ను కరిగించే 5 మ్యాజిక్ డ్రింక్స్..!

5 Drinks to Melt Belly Fat: శరీరంలో పెరుగుతున్న బెల్లీ ఫ్యాట్ మన అందాన్ని తగ్గించడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ప్రమాదకరంగా మారుతుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గించడం అంత ఈజీ కాదు. పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు సమతుల ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, సరైన జీవనశైలి తదితరాల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. రాత్రి పడుకునే ముందు కొన్ని రకాల డ్రింక్స్ తాగడం వల్ల ఈ మొండి కొవ్వు తగ్గుతుందని మీకు తెలుసా? ఈ డ్రింక్స్ మీ జీవక్రియను కూడా వేగవంతం చేసి,
శరీరాన్ని డీటాక్స్ చేస్తాయి. కొవ్వును కరిగించే ప్రక్రియను మెరుగుపరుస్తాయి. మరి ఎలాంటి డ్రింక్ బరువు తగ్గడానికి ఉపయోగపడతాయో ఇప్పుడు చూద్దాం:

గోరువెచ్చని నిమ్మకాయ నీరు:
పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో సగం నిమ్మకాయను పిండి తాగితే చాలా మంచిది. ఇదొక డీటాక్స్ డ్రింక్ అవుతుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శరీరంలోని కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేస్తాయి. గోరువెచ్చని నీరు శరీరానికి విశ్రాంతినిస్తుంది. అంతేకాకుండా మంచి నిద్ర వస్తుంది.

దాల్చిన చెక్క టీ:
దాల్చిన చెక్కలో థర్మోజెనిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి శరీరంలోని వేడిని పెంచడం ద్వారా జీవక్రియను బెటర్ చేస్తాయి. ఒక కప్పు నీటిలో అర టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని మరిగించి, పడుకునే ముందు తాగాలి. ఈ టీ చక్కెరను నియంత్రించడమే కాకుండా రాత్రిపూట బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో కూడా సాయపడుతుంది.

మెంతి నీరు:
మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, వేడి చేసిన తర్వాత ఆ నీటిని తాగాలి. ఇందులో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో సాయపడతాయి. జీర్ణక్రియ నెమ్మదిగా ఉండేవారికి ఈ డ్రింక్ చాలా ఎఫెక్టివ్ గా పని చేస్తుంది.

వాము నీరు:
వామును నీటిలో మరిగించి తయారుచేసిన టీ వల్ల గ్యాస్, అజీర్ణం, ఉబ్బరం వంటి సమస్యలను నివారిస్తుంది. ఇది బెల్లీ ఫ్యాట్ తగ్గించడంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది. నిద్రపోయే ముందు ఒక కప్పు వాము నీరు శరీరాన్ని తేలికగా ఉంచుతుంది. ఉదయం పూట కడుపును శుభ్రంగా ఉంచడంలోనూ హెల్ప్ చేస్తుంది.

పసుపు పాలు:
పసుపులో ఉండే కర్కుమిన్ అనే మూలకం యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. రాత్రిపూట గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్ ఈజీగా కరిగిపోతుంది. ఈ డ్రింక్ బరువును తగ్గించడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది.

Also Read: https://www.mega9tv.com/life-style/black-currant-is-type-of-a-currant-and-it-is-healthy-for-eyes/