షుగర్ కి ఉందో రెగ్యులర్ డైట్..!

Regular Essential Diet For Sugar: ఈరోజుల్లో తినే ఆహారం, జీవన విధానం.. మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తున్నాయి. జంక్ ఫుడ్, ప్రొసెస్డ్ ఆహార పదార్థాల వల్ల ఈజీగా ట్రిగ్గర్ అయ్యే అనారోగ్యాల్లో ఒబేసిటీ ఒకటైతే.. మధుమేహం ఒకటి.. బీపీ.. రక్తపోటు.. పీసీఓడీ.. లాంటి రకరకాల హెల్త్ ఇష్యూస్ ఎటాక్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో షుగర్ ను కంట్రోల్ చేసేందుకు రెగ్యులర్ గా ఫాలో అయ్యే ఈ డైట్ నిజంగా మ్యాజిక్ లా పని చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో రోజు వేసుకునే మాత్రలను సైతం క్రమంగా తగ్గించొచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

  • మనం తినే ఆహారం ఏదైనా కావొచ్చు.. అది ఇన్సులిన్ ను ఉత్పత్తి చేసేది అయి ఉండాలి. అలానే ఇన్సులిన్ ను తక్కువ ఖర్చు చేసేలా ఉండాలి.
  • ఉదయం నిద్రలేవగానే 1.25 లీటర్ల నీళ్లు తాగాలి.
  • వ్యాయామం తప్పనిసరిగా, విధిగా చేయాలి.
  • వెజ్ జ్యూస్ ను ప్రిపేర్ చేసుకొని తాగాలి. ఇందులో పొట్లకాయ, బీరకాయ, సొరకాయల్లో ఏవేని తీసుకోవచ్చు. వీటికి నిమ్మరసంతో పాటు క్యారెట్ చిన్న ముక్కలు, తేనే రెండు చెంచాలతో జ్యూస్ తయారుచేసుకొని తాగాలి. ఇది మీ మొదటి ఆహారం అవుతుంది.
  • పిండి పదార్థాలు/ కార్బోహైడ్రేట్స్ అనేవి ఇన్సులిన్ ను ఎక్కువ ఖర్చు చేస్తాయి. కాబట్టి రోజూ తీసుకునే ఆహారంలో వాటి మోతాదును తగ్గించాలి.
  • మొలకలు లేదంటే సీజనల్ ఫ్రూట్స్ ను బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు. ఇందులో ఖర్జూరం అవాయిడ్ చేయడం మంచిది. బ్రేక్ ఫాస్ట్ చేసిన 2 గంటల విరామం తరువాతనే నీరు తాగాలి.
  • లంచ్ లోకి పుల్కాలకు కాంబినేషన్ గా ఉప్పు, నూనె లేని ఆహారమైన కర్రీని అంటే తక్కువగా వేసుకొని ప్రిపేర్ చేసుకొని తినాలి. మళ్ళీ అదనంగా అన్నం తీసుకోవద్దు. -ఒకవేళ అన్నం తినాలనిపిస్తే పెరుగన్నం కొంచం తినాలి. మళ్ళీ 2 గంటల తర్వాతనే నీళ్లు తీసుకోండి.
  • షుగర్ ఉన్నవాళ్ళు ఉపవాసం లాంటివి చేయవద్దు.
  • ఇకపోతే డిన్నర్ 7 గంటలలోపు అది కూడా పుల్కాతో పచ్చి కూరగాయల సలాడ్ లేదా పండ్లు తీసుకోవాలి.
  • ఈ నియమాలు పాటించినవారు వారానికోసారి షుగర్ టెస్ట్ చేయించుకోవడం తప్పనిసరి.
  • డాక్టర్ సలహా ప్రకారం మాత్రలను తగ్గించుకుంటూపోవచ్చు.
  • అలానే అరటి, సపోట, మామిడి పండ్లను తినకూడదు.Regular Essential Diet For Sugar

Also Read: https://www.mega9tv.com/life-style/coconut-flowers-and-date-palm-uses-and-it-is-a-good-remedy-for-controlling-bp/