మన ప్రాచీన యోగా పద్ధతులు.. వాటి పరమార్థం!

◆ జ్ఞాన యోగ.. జ్ఞానం ద్వారా గమ్యాన్ని చేరటాన్ని జ్ఞాన యోగ అంటారు. విజ్ఞానంతో నిన్ను నీవు తెలుసుకోవటం. ఆపై సృష్టి రహస్యాన్ని తెలుసుకొని దాని మూలకేంద్రాన్ని చేరుకోవటమే ఈ జ్ఞాన యోగ సారం.

◆ భక్తి యోగ.. భక్తి ద్వారా గమ్యాన్ని చేరటం. అందులో భాగంగా తమని తాము అర్పించుకోవటం వల్ల ముక్తి లభించడమే భక్తి యోగసారం.

◆ కర్మయోగ.. ప్రతిఫలాన్ని ఆశించకుండా తమ పని తాను చేసుకుపోవడమే కర్మయోగ సారం.

◆ మంత్రయోగ.. మీకు ఇష్టమైన మంత్రం (రామ/ కృష్ణ) లేదా శబ్దం (ఓం) ద్వారా చేరవలసిన గమ్యాన్ని చేరటమే మంత్ర యోగ సారం.

◆ యంత్ర యోగ… ఇష్టమైన దేవుని ప్రతిరూపాన్ని ప్రతిష్టించుకోవడం, ఆపై ఇష్టారాధన చేస్తూ, అందులోనే లీనమైపోవడం యంత్ర యోగ సారం.

◆ లయ యోగ…ఇష్టమైన దానిలో ఇమిడిపోవడం, కలిసిపోవడం. అదే లోకంగా జీవించడం లయ యోగ సారం.

◆ తంత్ర యోగ…మంత్రతంత్రముల ద్వారా అనుకున్నది సాధించడం.

◆ కుండలిని యోగ.. శరీరంలో దాగివున్న శక్తిని బయటకు తీసి, దాని ద్వారా గమ్యాన్ని చేరడం.

ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం, ముద్ర.. వీటినే మన దైనందిన జీవితంలో ప్రత్యామ్నాయ చికిత్సలో భాగంగా చేరుస్తున్నాయి. యోగా థెరపీని పూర్తి విశ్వాసంతో అమలు చేస్తున్నాయి. ఆధునిక జీవనశైలిలో ఎదురయ్యే ప్రతి రుగ్మతకూ యోగాలో పరిష్కారం తప్పక దొరుకుతుంది.