
నేటి కాలంలో వెన్నునొప్పి సమస్య అన్ని వయసుల వారిలోనూ కామన్ అయిపోయింది. కొందరికి బరువైన వస్తువులను ఎత్తడం వల్ల, మరికొందరికి సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల, మరికొందరికి ఏమో ఆఫీసులో ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వల్ల ఈ వెన్నునొప్పి సమస్య వస్తుంది. అయతే, మన దేశంలో లోయర్ బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఆందోళన కలిగిస్తుంది. ఎందుకంటే భారతదేశంలో దాదాపు 60% మంది ప్రజలు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో నడుము నొప్పితో బాధపడుతున్నారు. ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు లేదా ఏదైనా శారీరక శ్రమ చేస్తున్నప్పుడు వెనుక భాగంలో దెబ్బ తగిలి ఉండవచ్చు. లేదా ఆర్థరైటిస్, యాంకైలోజింగ్ స్పాండిలైటిస్ వంటి ఏదైనా దీర్ఘకాలిక పరిస్థితి కారణంగా కూడా వెన్నునొప్పి ఉండొచ్చు. కొన్నిసార్లు ఈ నొప్పి భరించలేనిదిగా మారుతుంది. దీర్ఘకాలిక వెన్నునొప్పి బాధిస్తుంటే మాత్రం డాక్టర్‌ని సంప్రదించడం మంచిది. అయితే ఈ కొన్ని టిప్స్ పాటించి రిలీఫ్ పొందండీలా..
- వెన్నునొప్పి ఉన్నవారు రోజూ కనీసం 30 నిమిషాలు నడవాలి.
- సరైన వ్యాయామం కండరాలను బలోపేతం చేయడంలో సాయపడుతుంది.
- సరైన భంగిమ లోయర్ బ్యాక్ పై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందుకోసం టేప్, పట్టీలు లేదా స్ట్రెచి బ్యాండ్‌లను ఉపయోగించవచ్చు ఇలా చేయడం వల్ల లోయర్ బ్యాక్ మీద ఎక్కువ లోడ్ పడకుండా ఉంటుంది.
- మీరు కంప్యూటర్ల ముందు పని చేస్తే, మీ చేతులను టేబుల్ లేదా డెస్క్‌పై ఫ్లాట్‌గా ఉంచండి. మీ కళ్ళను స్క్రీన్ పైభాగంలో ఉంచండి. మీ తలను వంచకుండా ఉండాలి.
- ఎవరైనా హెవీ వెయిట్ ను కలిగి ఉంటే, అప్పుడు వారికి వెనుక నొప్పి ఉంటుంది. వెన్నునొప్పిని నివాదించేందుకు బరువు తగ్గేందుకు ప్రయత్నించండి.
- ధూమపానం చేస్తే ఇతర వెన్నెముక సమస్యలు వచ్చే అవకాశం 4 రెట్లు ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులలో నికోటిన్ మీ వెన్నెముకలోని ఎముకలను బలహీనపరుస్తుంది.
- వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందడానికి ఐస్ కంప్రెసెస్ చాలా మంచి మార్గం. మీ వెన్ను నొప్పి లేదా వాపుతో బాధపడుతుంటే ఐస్ సాధారణంగా చాలా ఉపశమనాన్ని అందిస్తుంది. 20 నిమిషాలు ఐస్ పెట్టడం ఉత్తమ పరిష్కారంగా ఉంటుంది.