సబ్జా గింజలతో.. సహజంగా మెరిసిపోండిలా..!

Basil Seeds Benefits: సహజంగానే అందాన్ని పెంపొందించుకోవాలంటే సబ్జా గింజలను ఆహారంలో భాగం చేసుకోవాలంటున్నారు నిపుణులు. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగానే కాదు, సౌందర్యపరంగా ఎన్నో ప్రయోజనాలున్నాయని అంటున్నారు.

  • బయటకు వెళ్లినప్పుడు ఎయిర్ పొల్యూషన్ వల్ల చర్మం కాంతిని కోల్పోయి మొటిమలు ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల చర్మాన్ని లోపలి నుంచి శుభ్రం చేయాలంటే సబ్జా గింజలు సరైన ఎంపిక అవుతుంది. ఈ గింజల్లో ఉండే సహజ డీటాక్స్ గుణాలు చర్మం లోపలి పొరల్లో చేరిన టాక్సిన్లను బయటకు పంపిస్తాయి. ఫలితంగా స్కిన్ గ్లోయింగ్ గా మారుతుంది.
  • కొంతమందిలో చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లు వచ్చాయంటే సాధ్యమైనంతవరకు అవి పోవు. అలాంటివారు రెగ్యులర్ గా సబ్జా గింజలను ఆహారంగా తీసుకోవడం మంచిది. ఇందులోని యాంటీబయోటిక్, యాంటీఫంగల్, యాంటీమైక్రోబియల్ లక్షణాలు చర్మ ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించడంలో సాయపడతాయి.
  • సబ్జా గింజల్లో విటమిన్ -ఇ సమృద్ధిగా లభిస్తుంది. ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చేందుకు హెల్ప్ చేస్తుంది. పైగా ఈ గింజల్లో విటమిన్ ఎ, సి, పొటాషియం, మెగ్నీషియం, కాపర్ లాంటి పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల చర్మానికి తగినంత పోషణ అంది ఆరోగ్యంగా, మృదువుగా మారుతుంది.
  • మహిళలు మూడు పదుల వయసుకు రాగానే ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి చర్మం ముడతలు పడడం. దీనివల్ల చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి. దీని నివారణకు బయట దొరికే కెమికల్ తో తయారైన యాంటీ ఏజింగ్ క్రీమ్​లను వాడుతుంటారు. అలా కాకుండా ఈ గింజలతో తయారుచేసిన ఫేస్​ఫ్యాక్ వేసుకుంటే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. చెంచా కొబ్బరి నూనెలో సరిపడినంత సబ్జా గింజల పొడిని కలుపుకొని ముఖానికి రాసుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకుంటే చాలు. These are the Basil Seeds Benefits.

Also Read: https://www.mega9tv.com/life-style/green-tea-can-detox-the-body-and-green-tea-uses-and-benefits/