నిన్ను నువ్వు మిస్ అవ్వకు..

నీ జీవితం మొత్తంలో నీవు చేసే ప్రతి పనిలోనే నీకు సంతోషం కలుగుతుంది. అలా నువ్వు నచ్చిన దానిని చేరుకోవాలంటే, దాని లోతు నీకు ముందుగా తెలియాలి. అప్పుడే అది చేరుకునే క్రమంలో అందులో పూర్తిగా మునిగిపోకుండా పైకి తేలుతావ్. అందుకు నిర్దేశించుకున్న టార్గెటే ముఖ్యం. టార్గెట్ ఉన్నప్పుడేగా నువ్వు నీ జీవితం మీద ఇంకొంత ఆశ పెంచుకుంటావ్. అలా చిన్న చిన్న లక్ష్యాలను సాధిస్తూ… వాటిని నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్లు. అంతేతప్ప ఒకేసారి పెద్ద బిజినెస్ మెన్ అవ్వాలనుకోకు. అప్పుడు అసలుకే మోసం వస్తుంది. మరి ఇందుకు లక్ష్యాలను ఎలా నిర్దేశించుకోవాలి అంటావా… నీకు ఏం కావాలో కచ్చితంగా నిర్ణయించుకో. ఇంత అని చెప్పు..

ఒకవేళ అది డబ్బు కావాలి అనుకుంటే, చాలా డబ్బులు కావాలని మాత్రం రాయకు. కచ్చితంగా ఇంత మొత్తం కావాలని రాయి. నా శరీరాకృతి బాగుండాలని అనుకుంటే, అందంగా బాగుండాలని రాయకు. ఎంత బరువు తగ్గాలో రాసుకో. అప్పుడే నీవు అనుకున్న శరీరాకృతికి చేరుకుంటావ్. ఏదైనా నీకు ఎప్పుడు కావాలో.. ఎలా కావాలో నీకు నువ్వు క్లియర్ గా చెప్పుకో. దానికి ఒక నిర్దిష్ట సమయం పెట్టుకో.. నీ లక్ష్యాన్ని నువ్వు చేరడానికి మార్గాలను ఒకదాని తర్వాత ఒకటిగా రాసి పెట్టుకో. దాన్నే ఫాలో అవ్వను. సక్సెస్ అనేది నిన్ను ఫాలో అవుతుంది.

అరెరే… నేను ఒంటరినయిపోయా అనే భావన కలిగినప్పుడు ఎవరైనా కంపనీ కోసం వెతుకుంటాం. తోడుగా ఉంటే బావుండే అని.. అలా నీ ఫ్రెండ్స్, రిలేషన్స్.. ఇలా వీరి కోసం తపన పడకుండా ఉండు. ఎందుకంటే చీకట్లో ఉండి వెలుగు కోసం వెతికినట్లుగా… బాధలో మగ్గుతున్నపుడు నీలోని సంతోషాన్ని నీకు నువ్వుగా బయటకు తీయి. ఆ ఆనందమే నీలోని బాధను దూరంగా పోగొడుతుంది. నిన్ను నువ్వు మిస్ కాకుండా చేస్తుంది. అంతే తప్ప ఎవరికోసం ఎదురు చూడకు.