నల్ల ఎండు ద్రాక్ష.. కంటి ఆరోగ్యానికి రక్ష!

Black Currant healthy for eyes: నల్ల ఎండుద్రాక్ష (నల్ల కిస్ మిస్). ఎండుద్రాక్షలో ఇదొక రకం.. గ్రీన్ ద్రాక్ష, కాకుండా నల్ల ద్రాక్ష మనం ఎక్కువగా చూసి ఉంటాం. తింటూ ఉంటాం. అయితే ఈ రెండిటిలో నల్ల ఎండు ద్రాక్ష అనేది చాలా ప్రయోజనకారి. ముఖ్యంగా కంటిచూపుకు చాలా ఉపయోగకరం!
ఈరోజుల్లో పొద్దున లేచినప్పటి నుంచీ, రాత్రి పడుకునేవరకు మొబైల్ ను ఎక్కువ గంటలు ఉపయోగిస్తుంటాం. అలాంటప్పుడు ఆ ప్రభావం ఎక్కువగా కళ్లపై పడి, కంటిచూపును మందగిస్తుంది. అలాంటపుడు నల్ల ఎండు ద్రాక్షను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఇది దృష్టిని మెరుగుపరుస్తుంది.

నల్ల కిస్ మిస్ లోని పోషకాలు..
నల్ల కిస్ మిస్ ను డ్రై ఫ్రూట్ గా పిలుస్తారు. ఇందులో పోషకాలు అధికం. విటమిన్ ఎ పుష్కలంగా ఉండటం వల్ల ఇది కళ్ళ రెటీనాను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతోపాటు కేలరీలు, ప్రోటీన్, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, చక్కెర, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ వంటివి లభిస్తాయి. Black Currant healthy for eyes.

  • నల్ల ఎండుద్రాక్షను నేరుగా కాకుండా నానబెట్టి తినడం చాలా ఉత్తమం. ప్రతీరోజు ఓ 5 నుంచి 10 ఎండుద్రాక్షలను రాత్రిపూట నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తినాలి.
  • పిల్లలకు మాత్రం పాలలో కలుపుకుని ఇస్తే బాగుంటుంది. ఇది వారికి కావల్సిన పోషకాలను అందిస్తుంది.
  • జీర్ణక్రియకు తోడ్పడుతుంది.
  • అధిక రక్తపోటును నివారిస్తుంది.
  • చెడు కొలెస్ట్రాల్, రక్తపోటు స్థాయిని తగ్గిస్తుంది. పొటాషియం వంటి పోషకాల కారణంగా, ఇది అధిక బిపి స్థాయిని తగ్గించడంలో సాయపడుతుంది.
  • మూడు లేదా నాలుగు వారాల పాటు ఎండుద్రాక్షను క్రమం తప్పకుండా తింటే, కంటి అలసట, చికాకు, పొడిబారడం వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు.

Also Read: https://www.mega9tv.com/life-style/side-effects-of-skipping-breakfast-in-the-morning-checkout-the-information/