మహిళల్లో ఐరన్ డెఫిషియన్సీకి కారణాలు, నివారణ!

iron deficiency in women: ఐరన్ డెఫిషియన్సీ.. చాలామందిలో తరచుగా వినిపించే సమస్య ఇది. మరీ ముఖ్యంగా పురుషుల కంటే స్త్రీలలో ఐరన్ లోపం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుందో, ఐరన్ లోపాన్ని ఎలా ఓవర్ కమ్ చేయొచ్చొ ఇప్పుడు తెలుసుకుందాం..

ఐరన్ శరీరానికి అవసరమైన ఖనిజం.
ఇది హిమోగ్లోబిన్ తయారీలో కీ రోల్ పోషిస్తుంది. హిమోగ్లోబిన్ రక్తంలో ఆక్సిజన్‌ను శరీరంలోని అన్ని భాగాలకు రవాణా చేయడానికి పని చేస్తుంది కదా. అందువల్ల, శరీరంలో సరైన మొత్తంలో ఐరన్ ఉండటమనేది చాలా ముఖ్యం. పురుషుల కంటే మహిళల్లో ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుంది ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఐరన్ లోపం వల్ల తల తిప్పడం, అలసట, చర్మం పసుపు రంగులోకి మారడం వంటి సమస్యలు వస్తాయి. సమతుల ఆహారం, ఐరన్ సప్లిమెంట్ ల సాయంతో ప్రైమరీగా ఐరన్ లోపాన్ని అధిగమించవచ్చు. ప్రధాన కారణాలు, నివారణ ఇప్పుడు చూద్దాం: iron deficiency in women.

  • స్త్రీలలో ఐరన్ లోపానికి ప్రధాన కారణం పీరియడ్స్. ప్రతి నెలా వచ్చే పీరియడ్స్ టైంలో మహిళలు కొంత మొత్తంలో రక్తాన్ని కోల్పోతారు. రక్తస్రావం అధికంగా ఉంటే మెనోరేజియా ఏర్పడుతుంది. దీంతో ఐరన్ లోపం మరింత తీవ్రంగా మారుతుంది. ఈ సమయంలో ఐరన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోకపోతే మాత్రం శరీరం నుంచి రక్తలోపాన్ని భర్తీ చేయలేని విధంగా పరిస్థితి మారుతుంది.
  • రెండోది గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో ఐరన్ డిమాండ్ గణనీయంగా పెరుగుతుంది. ఈ సమయంలో శిశువు అభివృద్ధికి, జరాయువు ఏర్పడటానికి శరీరానికి అడిషనల్ గా ఐరన్ అవసరం అనేది ఉంటుంది. అలాగే ప్రసవ సమయంలో రక్తస్రావం కూడా ఐరన్ లోపానికి కారణమవుతుంది. అంతేకాక తల్లిపాలు ఇచ్చే సమయంలో కూడా మహిళలకు ఐరన్ అవసరం.
  • మహిళలు తీసుకునే ఆహారంలో ఐరన్ లోపం కూడా ఈ సమస్యకు ప్రధాన కారణం. ఈ సమస్య శాఖాహారం తీసుకునే మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకంటే మొక్కల ఆధారిత ఆహారంలో కనిపించే ఐరన్ (నాన్-హీమ్ ఐరన్)ను తక్కువగా గ్రహిస్తుంది. మాంసం, చేపలు, గుడ్లలో లభించే హీమ్ ఐరన్ ను శరీరం ఈజీగా గ్రహిస్తుంది. కాబట్టి వెజిటేరియన్ డైట్ ఫాలో అయ్యే మహిళల్లో ఐరన్ సమస్య వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
  • కొంతమంది మహిళలకు సెలియాక్ వ్యాధి, క్రోన్’స్ వ్యాధి లేదా అల్సర్లు వంటి జీర్ణ సమస్యలు ఉండవచ్చు. ఇవి ఐరన్ అబ్సర్ప్షన్ ప్రభావితం చేస్తాయి. దీంతోపాటు యాంటాసిడ్లను అధికంగా వాడటం కూడా ఐరన్ శోషణను తగ్గిస్తుంది.
  • గర్భధారణ, పిసిఓడి లేదా థైరాయిడ్ సమస్యలు మహిళల శరీరంలో హార్మోన్ల మార్పులు ఐరన్ స్థాయిలను ప్రభావితం చేస్తాయి. హార్మోన్ల అసమతుల్యత శరీరంలో ఐరన్ శోషణను తగ్గిస్తుంది.

నివారణ:
సమతుల ఆహారం లేదా రోజువారీ ఆహారంలో బీట్ రూట్, పాలకూర, శనగలు, బీన్స్, గుడ్లు, రెడ్ మీట్, గుమ్మడి గింజలు, విటమిన్ సి లభించే పండ్లు, కూరగాయలు తీసుకుంటూ కాఫీ, టీలకు దూరంగా ఉంటే మంచిది.

Also Read: https://www.mega9tv.com/life-style/japanese-interval-walking-has-many-benefits-and-uses/