
Causes of heart attack: ఈరోజుల్లో వయసు తేడా లేకుండా గుండెపోటు ప్రతి ఒక్కర్ని ట్రిగ్గర్ చేస్తుంది. ముఖ్యంగా యూత్ బాగా ఎఫెక్ట్ అవుతున్నారు. అసలు గుండెపోటుకు ప్రధాన కారణాలేంటో, నివారణ మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
గుండెపోటుకు కారణాలు: (Causes of heart attack)
- సరైన శారీరక వ్యాయామం లేకపోవటం,
- మానసిక ఒత్తిడి,
- పొగ తాగడం,
- అధిక బరువు,
- అధిక రక్తపోటు,
- మధుమేహం,
- అధిక కొలెస్ట్రాల్,
- వంశ పారపర్యం,
- వయసు అనేవి కారణాలు.
ఈ యాంత్రిక యుగంలో రోజువారీ నడక తగ్గింది. నడకతో కలిగే ప్రయోజనాల్లో ఒకటైన గుండె జబ్బుల నివారణ తెలిసినప్పటికీ రోజు విధిగా వాకింగ్ చేయకపోవడం వల్ల హెల్తీ లైఫ్ స్టైల్ అనుసరించకపోవడం వల్ల గుండెపోటు అత్యంత ప్రమాదకరంగా మారింది.
గుండెపోటు వచ్చిన వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. లేకపోతే ప్రాణానికే ముప్పు ఏర్పడుతుంది. గుండెపోటు రాకుండా ఉండాలంటే నిత్యం నడక తప్పనిసరి. యోగా, ధ్యానం రెగ్యులర్ గా చేయడం అలవాటు చేసుకోవాలి. గుండెపోటుకి నడకకు చాలా దగ్గర సంబంధం ఉంది. అందువల్లే నడక చేయడం మేలు.
హార్ట్ ఎటాక్ వచ్చి తగ్గిన తరువాత కూడా మళ్ళీ రాకుండా ఉండాలంటే విశ్రాంతి ఎంత ముఖ్యమో.. రోజు నడవడం అంతే ముఖ్యం. గుండె ఆపరేషన్ అయిన తరువాత కూడా రోజు నడవాలనే వైదులు సజెస్ట్ చేస్తారు.
Also Read: https://www.mega9tv.com/life-style/how-to-reduce-fatigue-and-lethargy-do-these-things/