
ఈరోజుల్లో.. మనం తీసుకునే ఆహారం, జీవన విధానం వల్ల షుగర్, బీపీ లాంటివి ఈజీగా వచ్చేస్తున్నాయి. ఇందుకు డైట్ లో చేంజెస్, డైలీ డోస్ మెడిసిన్ కంపల్సరీ అవుతున్నాయి. ఎంత వాకింగ్ చేస్తున్నా.. ఫుడ్ హ్యాబిట్స్ మార్చినా ఇవి తగ్గుముఖం పట్టినట్లే ఉన్నా.. లాంగ్ టర్మ్ లో ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి మనం వాటి కంట్రోల్ లోకి వెళ్ళిపోకుండా, మన కంట్రోల్ లోకి తెచ్చేసుకుందాం..
- బీపీని తగ్గించేందుకు కొబ్బరి పూలు, ఈత పూలు బెటర్ గా పనిచేస్తాయని మీకు తెలుసా..
- అవునండీ.. నిజం, కొబ్బరిపూలు కానీ, ఈతపూలను కానీ ఎండ బెట్టి పొడి చేసుకొని ఒక సీసాలో భద్రపర్చుకోండి.
- వైట్ డిశ్చార్జ్ తో బాధపడేవారు ఈ పొడిని పాలలోగానీ తేనెలోగానీ కలిపి తీసుకుంటే మంచిది.
- అకారణంగా వేడి చేయడం వల్ల వచ్చే వైట్ డిశ్చార్జ్ తగ్గుతుంది.
- శరీరంలో ఏ భాగంనుంచి అయిన రక్తస్రావం అవుతుంటే, గాయాలైనప్పుడు ఈ పూలపొడిని వేస్తే చాలు, రక్తస్రావాన్ని నివారిస్తుంది.
- షుగర్ బీపీ వల్ల వచ్చే కాళ్ళు, చేతుల మంటలు, తిమ్మిర్లు తగ్గుతాయి.
- బీపీ ఎంతకి కంట్రోల్ అవ్వనివారు ఈ పొడిని తీసుకుంటే త్వరగా నార్మల్ అవుతారు.
- మెనోపాజ్ దశలో ఉన్న స్త్రీలు ఈ పొడిని వాడుకుంటూ ఉంటే ఆ టైంలో కలిగే ఇబ్బందులు తగ్గుతాయి.
- తల తిరుగుడు, పైత్యం పెరిగి ఒళ్లు తూలడం లాంటి సమస్యలకు కూడా ఈ పొడి అద్భుతంగా పని చేస్తుంది.
- ధనియాలు జీలకర్రను సమపాళ్ళలో తీసుకొని, విడివిడిగా వేయించి పొడి చేసుకోవాలి. అందులో ఈ పొడి కాస్తంత వేసి, తగినంత ఉప్పు లేదా సైంధవ లవణం కలిపి అన్నం లోనూ, టిఫిన్స్ లేదంటే మజ్జిగలో కలుపుకొని తాగితే పేగులు శుభ్రపడి రోగాలకు దూరంగా ఉంటారు.