
Daily use of Glycerine: ఈ మధ్య కాలంలో యూత్ చర్మం నిగనిగలాడుతూ మెరిసిపోవడానికి చాలా రకాల కాస్మొటిక్స్ వాడుతున్నారు. ముఖ్యంగా చలి, వర్షాకాలాల్లో చర్మం పొడిబారకుండా, పగుళ్లు రాకుండా ఉండేందుకు చర్మానికి తేమను అందించే ప్రొడక్ట్స్ ను వాడతారు. ఎక్కువగా కెమికలైజ్డ్ కాస్మోటిక్స్ ని వాడటం వల్ల చర్మం త్వరగా డ్యామేజ్ అవుతుంది. అలా కాకుండా చర్మసంరక్షణలో గ్లిజరిన్ ను చేర్చుకుంటే మంచి రిజల్ట్ ఉంటుంది. సినిమాల్లో యాక్టర్స్ కన్నుల వెంట నీళ్లు తెప్పించే గ్లిజరిన్‌ను మనం రెగ్యులర్ గా వాడే సోప్స్, మాయిశ్చరైజర్లలోనూ ఉపయోగిస్తున్నారు. Daily use of Glycerine.
ముందుగా జిడ్డు చర్మతత్వం ఉన్నవాళ్ల గురుంచి మాట్లాడుకుంటే.. వీరికి గ్లిజరిన్‌తో తడిపిన దూదితో రోజూ ఫేస్ క్లీన్ చేసుకోవడం వల్ల మొటిమలు తగ్గుతాయి. యాక్నెలాంటి సమస్యలు సైతం దూరమవుతాయి.
ముల్తానీ మట్టిలో చెంచా గ్లిజరిన్, కొన్ని వాటర్ కలిపి మెత్తటి పేస్ట్ లా చేసుకోవాలి. దాన్ని ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాలపాటు ఉంచి, ఆరనివ్వాలి. తరవాత చన్నీళ్లతో కడిగేసుకుంటే ముఖంపై పేరుకున్న మురికి పోయి, తాజాగా మారుతుంది.
స్నానం చేసే నీళ్లలో లేదా చర్మ సంరక్షణకు వాడే క్రీములూ, క్లెన్సర్లలో కొంచెం గ్లిజరిన్‌ని కలిపి రోజూ వాడుకోవచ్చు. దీనివల్ల చర్మం పొడిబారదు. అలానే నిగారింపు కోల్పోదు. సాప్ట్ అండ్ క్లీన్ లుక్ కనిపిస్తుంది.
ఇకపోతే చర్మం పొడిబారే సమస్య ఉన్నవారు రాత్రి పూట కప్పు నీళ్లలో చెంచా గ్లిజరిన్ ను కలిపి ముఖానికి రాసుకుని ఉదయాన్నే కడిగేసుకుంటే సరి, చర్మం స్మూత్ గా మారుతుంది.
ఇలా ప్రతిరోజు గ్లిజరిన్‌ను వినియోగిస్తే చర్మం మృదువుగా, కాంతివంతంగా ఉంటుంది. ముఖంపై ఉన్న నల్లటి మచ్చలు, డార్క్ స్పాట్స్‌ను తొలగిస్తుంది. శరీరంపై గ్లిజరిన్ తో మసాజ్ చేస్తే మంచి పోషణను అందించి ఆరోగ్యకరమైన చర్మాన్నిస్తుంది. ఇది సహజంగా తేమను బంధి చేస్తుంది. గ్లిజరిన్ చర్మ రంధ్రాలను మూసుకుపోనీయకుండా చేసి, జిడ్డుతో వచ్చే మొటిమలను రాకుండా అడ్డుకుంటుంది. తరచూ గ్లిజరిన్ ను చర్మంపై అప్లై చేస్తే, ముడతలు కూడా రాకుండా చేస్తుంది.
గ్లిజరిన్ ను నీరు లేదా సరైన ద్రవంతో ముందుగా డైల్యూట్ చేయాలి. పొడిగా ఉండే ప్రాంతాలైన ముఖం, చేతులకు అప్లై చేయాలి. తర్వాత సున్నితంగా మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం, చేతులు కాంతివంతంగా, మృదువుగా మారతాయి. స్కిన్ ఇష్యూస్ ఉన్నవారు ఉపయోగించే ముందు నిపుణుల సలహా తీసుకొని ఉపయోగించడం మంచిది.
Also Read: https://www.mega9tv.com/life-style/causes-and-prevention-of-iron-deficiency-in-women/