
Green Tea Uses: గ్రీన్ టీ తాగడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు, ఫ్లేవనాయిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది శరీరాన్ని డీటాక్స్ చేయడంలో, మెటబాలిజంను పెంచడంలో, ఒత్తిడిని తగ్గించడంలో సాయపడుతుంది. అసలు గ్రీన్ టీ తాగడం వల్ల కలిగే లాభాలేంటి? అలాగే ఎలాంటి గ్రీన్ టీ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Green Tea Uses..
- గ్రీన్ టీలో ఉండే క్యాటెచిన్ అనే యాంటీఆక్సిడెంట్లు, ముఖ్యంగా EGCG (Epigallocatechin gallate) కేన్సర్ కారక కణాల వృద్ధిని అడ్డుకుంటుంది.
- రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల బాడీ మెటబాలిజం పెరిగి, కొవ్వు కణాల ప్రక్రియ వేగవంతమవుతుంది. ఇది బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది.
- ముఖ్యంగా పొట్ట భాగంలో ఉన్న కొవ్వును కరిగించడంలో గ్రీన్ టీ బాగా ఉపయోగపడుతుంది.
- వ్యాయామంతో పాటు గ్రీన్ టీ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
- గ్రీన్ టీలో ఉండే పొటాషియం, ఫ్లేవనాయిడ్లు రక్తపోటును నియంత్రిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ (LDL) తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
- గ్రీన్ టీలో ఉండే చిన్న మొత్తంలో కేఫిన్, L-theanine అనేవి మానసిక ఉత్తేజికారిగా పనిచేస్తాయి. ఇది మెమరీని పెంచి ఫోకస్ పెరగడానికి దోహదం చేస్తుంది.
- గ్రీన్ టీ శరీరంలో ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది.
- షుగర్ లెవల్స్ ను నియంత్రించడంలో సాయపడుతుంది.
- గ్రీన్ టీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు వయసు ప్రభావాన్ని తగ్గిస్తాయి. ఇది చర్మాన్ని మెరుగుపరచడంతో పాటు ముఖంపై వచ్చే పింపుల్స్ బెడదను తగ్గిస్తుంది.
- గ్రీన్ టీ శరీరాన్ని టాక్సిన్స్ నుంచి శుభ్రం చేయడంలో హెల్ప్ చేస్తుంది.
ఎలాంటి గ్రీన్ టీ తీసుకోవాలంటే..
- ఆర్గానిక్ గ్రీన్ టీ.. కెమికల్స్ లేని ఆర్గానిక్ వేరియంట్లు ఉన్న రకం టీని తీసుకోవడం ఉత్తమం.
- లూజ్ లీఫ్ గ్రీన్ టీ, టీ బ్యాగ్స్.. వీటిల్లో
- ఎక్కువగా యాక్టివ్ పదార్థాలు ఉంటాయి. టీ బ్యాగ్స్ కొన్నిటిలో నానోప్లాస్టిక్ పదార్ధాలు ఉంటాయి. అందుకే చూసి ఎంచుకోవాలి.
- ఫ్లేవర్ కలిపిన గ్రీన్ టీతో జాగ్రత్తపడాలి.
- జింజర్, లెమన్, తులసి, మింట్ వంటి సహజమైన ఫ్లేవర్స్ ఉన్న గ్రీన్ టీ తీసుకోవడం బెటర్ ఛాయిస్ అవుతుంది.
ఏ సమయాల్లో తీసుకోవాలి..
- ఉదయం ఖాళీ కడుపుతో అసలు తాగకూడదు. ఎందుకంటే ఇది ఎసిడిటీని కలిగించవచ్చు.
- భోజనం తరువాత 30 నిమిషాల లోపల లేదా సాయంత్రం తక్కువ ఆకలిగా ఉన్నప్పుడు గ్రీన్ టీ తీసుకోవడం మంచిది.
- రోజుకు 2–3 కప్పులు గ్రీన్ టీ సరిపోతుంది. అంతకుమించితే నిద్రలేమి, ఓవర్ ఎసిడిటీ సమస్యలు వస్తాయి.
- గర్భిణీలు, 60 ఏళ్లు పైబడినవారు గ్రీన్ టీ తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం అవసరం.
- షుగర్ లేదా తీపి పదార్థాలు కలిపి తాగకూడదు. అడిషనల్ గా షుగర్ వేసుకుని గ్రీన్ టీ తాగడం వల్ల లభించాల్సిన అసలు ప్రయోజనం తగ్గిపోతుంది.
Also Read: https://www.mega9tv.com/life-style/raw-turmeric-roots-health-benefits-and-its-uses/