
చాలామంది ఫ్యాషన్ పేరుతో తలకు నూనె ఏవేవో స్ప్రేలు చల్లుతూ, కలర్స్ వేస్తూ.. జుట్టు కుదుళ్లను బలపరిచే ఆయిల్ ను అప్లై చేయరు. దానివల్ల తలలో చర్మం పొడిబారి చుండ్రు, హెయిర్ ఎక్కువగా రాలే సమస్యలు వస్తాయి. అందుకే వారానికి రెండు సార్లయినా నూనె అప్లై చేయాలి. కోడిగుడ్డులోని పచ్చ సొనతో జుట్టును అందంగా మార్చుకోవచ్చు. కొన్నిసార్లు జుట్టు మధ్యలో చిట్లిపోవడం, ఎక్కువ మొత్తంలో ఊడిపోవడం జరుగుతుంది. వీటి కారణంగా కురుల పెరుగుదల ఆగిపోతుంది. పచ్చసొనలో ఉన్న లుటిన్ జుట్టును బలపరచి, ఆపై ఊడిపోకుండా కాపాడుతుంది.
జుట్టు బలహీనపడేందుకు కారణాలు…
జీన్స్ వల్ల, ఆహారంలో పోషక లోపం, మానసిక ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, వాతావరణంలో మార్పు, హెయిర్ మీద రకరకాల ప్రొడక్ట్స్ ను ప్రయోగించడం.. తీరొక్క హెయిర్ స్టైల్స్ ను చేయించుకోవడం… ఇవన్నీ జుట్టును బలహీనపరిచే అంశాలే.
చేయకూడనివి..
నల్లని, ఒత్తైన కురులకోసం మంచి ఆహారం తీసుకుంటే మాత్రమే సరిపోదు. మీరు మీ జుట్టు ఆరోగ్యం గురించి నిజంగా శ్రద్ధ వహిస్తే, మీరు మీ లైఫ్ స్టైల్ లో కూడా ఈ మార్పులు చేయాలి.
మద్యం సేవించవద్దు, అతి తీపి పదార్థాలను తినకూడదు. సోడా పానీయాలు తాగొద్దు.
ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తీసుకోకూడదు.
తక్కువ గాఢత కలిగిన షాంపూలతో తలస్నానం చేశాక, పూర్తిగా ఆరనివ్వాలి.
అధిక గాఢత కలిగిన షాంపూతో తలస్నానం చేయడం వల్ల జుట్టు పొడిబారి, జీవం లేకుండా అవుతుందనీ గుర్తుంచుకోవాలి.