మనం హైట్ ఎలా పెరుగుతాం..?!

అందరికీ తెలిసి హైట్ కి తల్లిదండ్రుల జీన్స్(జెనెటిక్స్) కారణం.. అంటే పిల్లల ఎత్తు, వారి తల్లిదండ్రుల నుంచి వస్తుంది. దాదాపు 60 – 70% మేర ఆధారపడి ఉంటుంది.
మనం ఎత్తు పెరగటానికి మజిల్స్ మూలకారణమవుతాయి. సైన్స్ పరంగా చెప్పాలంటే, ఎముకలో ఉండే గ్రోత్ ప్లేట్స్ పెరుగుదలకు ఉపయోగపడతాయి. వీటినే ఎఫిఫైసిన్ అని అంటారు. ఇవి ఎముక చివర ఉండే మృదులాస్తి ప్రాంతంలో ఉంటాయి. మన ఎముకలలో ప్రధానంగా 3 భాగాలున్నాయి. అవి ఎఫిఫైసిస్, మేటాఫైసిస్, డయాఫైసిస్.
గ్రోత్ ప్లేట్స్ అనేవి తెరుచుకొని, చురుకుగా ఉన్నంతవరకు హైట్ అనేది సాధ్యపడుతుంది.
మన శరీరంలో వచ్చే మార్పుల వల్ల అయితేనేం, హార్మోన్ల ప్రభావం వల్ల అయితేనేం… కొన్నిసార్లు ఆ గ్రోత్ ప్లేట్స్ మూసుకుపోతాయి. దాంతో పెరుగుదల ఆగిపోవచ్చు.

ఏ వయసు వరకు హైట్ పెరుగుతామంటే…
అమ్మాయిల్లో అయితే 10 నుంచి 15 సంవత్సరాలవరకు హైట్ లో చేంజెస్ ఉంటాయి.
ఎందుకంటే వారికి ఆ టైంలో రుతుస్రావం ప్రధాన కారణమవుతుంది.
అబ్బాయిల్లో అయితే 12 నుంచి 15 సంవత్సరాల వయసులో మార్పులు వస్తాయి. అంటే వారి గొంతు మారిపోవడం, గడ్డం ఏర్పడటం లాంటివి. మొత్తంగా శరీరంలో మార్పులు రావడం చూస్తుంటాం.
అదే టీనేజ్ దాటాక.. మగవారిలో 18- 20 సంవత్సరాల మధ్యలో జరుగుతుంది.
అయితే అమ్మాయిల్లో.. 16 సంవత్సరాలలోపే జరుగుతుంది. ఈ వయసు దాటాక కూడా హైట్ అనేది పెరగొచ్చు. ఎందుకంటే వారిలో గ్రోత్ ప్లేట్స్ అనేవి తెరుచుకొని, చురుకుగా ఉండటంతో పాటు, మంచి పోషకాహారాన్ని తీసుకోవడంతో పాటు, ఆరోగ్యంగా ఉండగలిగితేనే వీలవుతుంది.

హైట్ పెరిగే దశలో …
మిగతావారితో పొలిస్తే, పొగతాగేవారు సుమారు 2.5 మీటర్లు తక్కువ హైట్ లో ఉంటారట.. అంటే వారు పెరిగే అవకాశమున్నా, అక్కడితోనే ఆగిపోతారు.
దీంతోపాటు సరైన పోషకాలు నిండిన ఆహారం తినకపోవడం వల్ల కూడా హైట్ పెరగకపోవచ్చు.
బోన్ లెన్త్ ట్రీట్మెంట్ చికిత్సల జోలికి అస్సలు పోకూడదు. ఇది చాలా ఖర్చుతో కూడుకుంది అలానే చాలా ప్రమాదకరమైంది.
ఆర్టీఫిషియల్ ప్రొడక్ట్స్ ను వాడకూడదు. అవి వాడటం వల్ల అనుకున్నది జరగకపోగా, దుష్ప్రభావాలు వస్తాయి కాబట్టి గుర్తుంచుకోండి.