
విభిన్న జీవనశైలి, ఆహార మార్పులు మహిళల రూపురేఖలనూ బాగా ప్రభావితం చేస్తున్నాయి. దీనికి తోడు సరైన వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి, నిద్రలేమి ఎఫెక్ట్ ‘బెల్లీ’ బారిన పడేలా చేస్తుంది. ఎక్కువ కేలరీలు, చక్కెర్లతో కూడిన ఆహారం, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ బెల్లీ ఫ్యాట్ కి కారణమవుతుంది. దేశంలో నాలుగన్నర కోట్ల మంది మహిళలు ప్రధాన సమస్య అయిన థైరాయిడ్‌తో బాధపడుతున్నారు. వీరిలో అధికశాతం మందికి పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోతుంది. అసలు ఏ హెల్త్ ఇష్యూ బెల్లీకి కారణమవుతుంది.. ఏం చేస్తే తగ్గుతుందో తెలుసుకుందాం:
- పొట్ట దగ్గర కొవ్వు సాధారణంగా పేరుకుపోతుంది. ఇందుకోసం ధనియాలతో చేసిన టీ తీసుకోవడం వల్ల పొట్ట అనేది క్రమంగా తగ్గుతుంది. ఇందులో పుష్కలంగా లభించే యాంటి ఆక్సిడెంట్లు ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తాయి.
- ప్రస్తుతం మహిళల్లో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య.. పీసీఓఎస్. ఈ సమస్య ఉన్నవారిలో ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా హార్మోన్లలో మార్పులు.. పొట్ట పెరుగుతుంది. ఇలా వచ్చే బెల్లీని తగ్గించుకోవాలంటే.. రోజూ దాల్చిన చెక్కతో చేసిన టీని తాగాలి. ఇది హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలనూ కంట్రోల్‌లో ఉంచుతుంది.
- మరో సమస్య మెనోపాజ్.. ఈ సమయంలో మహిళల్లో ఈస్ట్రోజెన్ లెవెల్స్ తగ్గిపోతాయి. అందువల్ల శరీరంలో అనేక మార్పులు వస్తాయి. అదే సమయంలో ఇన్సులిన్ ఉత్పత్తితోపాటు బెల్లీ ఫ్యాట్ కూడా పెరుగుతుంది. ఇటువంటప్పుడూ పుదీనాతో చేసే పిప్పర్మెంట్ టీ తాగితే బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉండే యాంటి ఆక్సిడెంట్లు కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరిచి, పొట్ట దగ్గర కొవ్వు పెరగకుండా రక్షణ కల్పిస్తాయి.