నీరసం తగ్గాలంటే.. ఇవి చేయండి!

How To reduce fatigue and lethargy: ఒకప్పుడు మన పూర్వీకులు కావొచ్చు, పెద్దలు కావొచ్చు ప్రతి పనికి, ప్రతి చోటుకి మైళ్ళ కొద్ది నడిచేవారు. అప్పటి తిండి, జీవన విధానం వేరు.. అందుకే ఎల్లప్పుడూ యాక్టివ్ గా ఉండేవారు. వారి లైఫ్ స్పాన్ కూడా 70కి పైనే ఉండేది. మరిప్పుడో ఇంటి నుంచి బస్టాప్ కి లేదంటే ఒక ఫ్లోర్ మెట్లు ఎక్కేసరికి ఎక్కడలేని ఆయాసం, నీరసం, నిస్సత్తువ ఆవహిస్తుంది. దీనికి కారణం బలమైన ఆహారం తినకపోవడమే.. రుచిగా ఉండే ఆహారానికి అలవాటు పడి బలహీనంగా తయారవుతున్నారు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే..

  • అన్నిటికన్నా ఎక్కువ బలమైన ఆహారంలో ఒకటి కొబ్బరి. రోజుకో పచ్చి కొబ్బరికాయను పూర్తిగా టిఫిన్ లాగా తీసుకుంటే చాలు. మొలకెత్తిన కొబ్బరికాయ అయితే మరింత మేలు. అజీర్తి, గ్యాస్ ఇబ్బంది ఉన్నవారు మోతాదుగా తీసుకోవాలి.
  • ఖర్జూరం పండులో చాలా ఎక్కువ శక్తి దాగి ఉంటుంది. ఇది ఇన్స్టాంట్ శక్తిని అందిస్తుంది. రోజుకి కొన్ని ఖర్జూరాలను పండ్లతో గాని, కొబ్బరితోగాని తింటే ప్రయోజనం ఎక్కువ.
  • ముడి బియ్యాన్ని అన్నంగా వండుకొని రెండు పూటలా తింటే చాలు. ఇలా రెండు వారాలు చేస్తే చాలు ఎనర్జిటిక్ గా మారిపోతారు.
  • ఎప్పుడైనా ఉన్నట్టుండి నీరసం వచ్చి, కళ్ళు తిరిగినట్లు అనిపిస్తే తేనెను 3 లేదా 4 స్పూన్ల చొప్పున తీసుకుంటే 10 నిమిషాల్లో ఓపిక తిరిగి వచ్చేస్తుంది. How To reduce fatigue and lethargy Just Do These Things..!

Also Read: https://www.mega9tv.com/life-style/reasons-why-white-bread-is-not-optimal-for-health/