ఫ్రిజ్ నీరు తాగడం మంచిదేనా..?!

వేసవికాలం.. ఎన్ని నీళ్ళు తాగినా.. దప్పిక వేస్తూనే ఉంటుంది. చాలామంది ఇళ్లల్లో ఫ్రిజ్ లో వాటర్ బాటిల్స్ నింపి పెట్టేస్తారు. ఇంట్లో ఉన్నప్పుడే కాదు.. బయటి నుంచి రాగానే చల్లని నీరు తాగేస్తుంటారు. అయితే ఇలా చాలామంది ఫ్రిజ్ నుంచి నేరుగా తీసుకొని నీరు తాగుతుంటారు. ఇలా తాగడం వల్ల ఆరోగ్యం పాడవుతుందా? వేసవి కాలంలో సాధారణ నీరు ఎంత తాగినా దాహం తీరినట్టు అనిపించదు. అలాంటప్పుడు ఫ్రిజ్ నీరు తాగడమే బెటర్ అనుకుంటారు చాలామంది. మరి ఫ్రిజ్ లో చల్లని నీరు చేసే చేటు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం:

ఫ్రిజ్ నుంచి చల్లని నీరు తాగితే ఈ వేసవి వేడికి దాహం తీరినట్టనిపిస్తుంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. ఈ చల్లని నీరు తాగడం వల్ల జీవక్రియ మందగిస్తుంది. ఇది జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.

గోరు వెచ్చని నీరు, సాధారణ నీరు, ఫ్రిజ్ లోని చల్లని నీరు.. ఈ మూడింటిని పరిశీలిస్తే.. గోరు వెచ్చని నీరు చాలా తొందరగా జీర్ణం అవుతుంది. అదే సాధారణ నీరు జీర్ణం కావడానికి సగటు సమయం పడుతుంది. కానీ ఫ్రిజ్ లోని చల్లని నీరు తాగితే మాత్రం అవి జీర్ణం కావడానికి చాలా ఆలస్యం అవుతుంది.
ఫ్రిజ్ నీళ్ళు తాగేవారిలో జీవక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఈ కారణంగా బరువు తగ్గడం కష్టమవుతుంది. బరువు తగ్గాలని అనుకునేవారు ఫ్రిజ్ లో నీరు తాగడం వల్ల బరువు తగ్గే ప్రక్రియ కూడా నెమ్మదిస్తుంది. దీనివల్ల మలబద్దకం రావచ్చు.

ఫ్రిజ్ లో చల్లని నీరు అదే పనిగా అలవాటుగా తాగడం వల్ల మైగ్రైన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇది తలనొప్పి సమస్యను పెంచుతుంది. ఇప్పటికే మైగ్రేషన్ సమస్యతో ఇబ్బందిపడేవారు చల్లని నీరుకు ముఖ్యంగా ఫ్రిజ్ నీటికి దూరంగా ఉండాలి. ఒకవేళ ఈ వేసవిలో చల్లని నీరు తాగాలనిపిస్తే ఫ్రిజ్ లో నీటికి బదులుగా కుండలోనీ నీటిని తాగవచ్చు. అప్పట్లో మన పూర్వీకులు, పెద్దలు కుండల్లో నీటిని తాగేవారు. అందుకే ఆరోగ్యానికి ఆరోగ్యం కావాలి అంటే కుండలో నీరు ఉత్తమం!