జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్ తో.. బోలెడు ప్రయోజనాలు!

Japanese interval walking: వాకింగ్ తెలుసు.. ఈ ఇంటర్వెల్ వాకింగ్.. గురుంచి ఎప్పుడైనా విన్నారా.. ఇది జపనీయులు ఎక్కువగా ఫాలో అయ్యే ప్రత్యేకమైన వాకింగ్ పద్ధతి. దీనినే జపనీస్ వాకింగ్ టెక్నిక్ అని కూడా అంటారు. దీనిలో కొన్నిరకాల టెక్నిక్స్ ఉంటాయి. సాధారణంగా పదివేల అడుగుల నడక ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ.. జపనీస్ వాకింగ్ టెక్నిక్ తో మరిన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేమిటంటే..

ఈ 30 నిమిషాల జపనీస్ వాకింగ్ టెక్నిక్ మీకు బెటర్ హెల్త్ బెనిఫిట్స్ ను అందిస్తుంది. ఇందుకు సరైన షూ ధరించి, శరీరం అలసిపోయినట్లు అనిపిస్తే వేగం తగ్గించి, క్రమబద్ధంగా వాకింగ్‌ చేయడాన్ని ప్రయత్నించడం ద్వారా మీరు ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉండవచ్చు. Japanese interval walking.

  • మొదట వేగంగా లేదంటే నెమ్మదిగా నడవడం వల్ల గుండె వేగంగా కొట్టుకొని, తిరిగి నార్మలైజ్ అవుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి అద్భుతమైన వ్యాయామంగా చెప్పవచ్చు. అంతేకాదు ఏరోబిక్ సామర్థ్యం 29 రెట్లు పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
  • వేగవంతమైన నడక శరీరంలోని కండరాలను, ముఖ్యంగా తొడ కండరాలను బలంగా తయారుచేయడంలో దోహదం చేస్తుంది. ఇది సాధారణ నడక కంటే 10 రెట్లు ఎక్కువగా కండర బలాన్ని పెంచుతుంది.
  • ఈ ఇంటర్వెల్ వాకింగ్ బ్లడ్ ప్రెషర్ ను సమర్థవంతంగా అదుపులో ఉంచుతుంది. ఇది సాధారణ నడక కంటే 3 రెట్లు మెరుగైన రిజల్ట్ ను ఇస్తుంది.
  • రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది. ఫలితంగా మధుమేహులు, మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరమని చెప్పాలి.
  • రోజుకు గంటల తరబడి నడవలేని వారికి, వ్యాయామం చేయడానికి సమయం లేనివారికి ఇది అద్భుతమైన ప్రత్యామ్నాయం. పైగా ఇది కీళ్లపై తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి, అన్ని వయసుల వారికి, వృద్ధులకు కూడా సురక్షితమైంది.

అయితే ఏదైనా కొత్త వ్యాయామం ప్రారంభించే ముందు వైద్య నిపుణులను ముందుగా సంప్రదించడం ఉత్తమమని మరవద్దు.

Also Read: https://www.mega9tv.com/life-style/sweets-mentioned-by-sushruta-can-control-sugar-checkout-what-they-are/