రోజుకి 11 నిమిషాలు.. వాకింగ్ చేస్తే చాలు..!

వాకింగ్‌.. వ్యాయామంలో గొప్ప కసరత్తు. ఆరోగ్యానికి, ఎక్కువ లైఫ్ స్పాన్ కి నడకను మించింది మరోటి లేదని పలు పరిశోధనల్లో తేలింది. అయితే.. దీని ప్రయోజనాలను పొందడానికి మైళ్లకు మైళ్లు నడవాల్సినవసరం లేదు. నడక కోసం రోజులో మనం 11 నిమిషాలు కేటాయిస్తే చాలు.. ఆరోగ్యానికి భరోసా దక్కుతుంది.

రోజుకి 11 నిమిషాలు, వారానికి 75 నిమిషాలు చురుకైన నడకతో వ్యాయామం చేసేవారిలో ముందస్తు మరణాలు 23 శాతం తక్కువగా ఉన్నట్టు తేలింది. వీరిలో హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం 17%, క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం ఏడు% వరకు తగ్గుతుందట.

వారానికి 75 నిమిషాలు అంటే.. రోజుకు కేవలం 11 నిమిషాలు ఒక స్థిరమైన వేగంతో నడవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయితే, 11 నిమిషాలు దాటిన తర్వాత నడవడం మానేయాలనే అర్థం కాదు.. రోజుకు కనీసం 5,000 అడుగుల కంటే ఎక్కువ నడిస్తేనే సరైన ప్రయోజనం కలుగుతుంది. ఫిట్‌నెస్‌ కోసం ఏవేవో స్టంట్ లు చేసే యూత్.. డైలీ లైఫ్ లో నడక ఇంపార్టెన్స్ తెలుసుకొని.. విధిగా అలవాటు చేసుకోవాలి
అలాగే రోజుకు 5,000లకు పైగా అడుగులు వేయడం లక్ష్యంగా పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.