రాత్రిపూట మొబైల్‌ను తల దగ్గర పెట్టుకుని నిద్రపోతున్నారా..?!

చాలామందికి రాత్రుల్లో నిద్రించే ముందు మొబైల్‌ను దిండు దగ్గర పెట్టుకునే అలవాటు ఉంటుంది. రాత్రుల్లో కూడా మొబైల్‌ను వాడుతూ నిద్రించే సమయంలో ఆ మొబైల్‌ను దిండు కింద పెట్టుకుంటారు. ఇలా చేయడం మంచిదేనా? అంటే ఎంతకూ మంచిది కాదు. ఇదే కొనసాగితే మెదడు దెబ్బతింటుంది. అది విడుదల చేసే రేడియేషన్ వల్ల ఒక్కోసారి మరణం కూడా సంభవించవచ్చు.

వాస్తవానికి మొబైల్ ఫోన్ రేడియేషన్ మెదడుకు ప్రత్యక్షంగా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని WHO, ఇతర ప్రధాన సంస్థలు ప్రమాదమేనని నిపుణులు అంటున్నారు. ఈ అలవాటు ఆరోగ్యానికి పూర్తిగా ప్రమాదకరం. మొబైల్ ఫోన్ల నుండి వచ్చే రేడియేషన్ మన మెదడు, నిద్ర నాణ్యతను కంప్లీట్ గా ఎఫెక్ట్ చేస్తుంది.

  • నిరంతర నోటిఫికేషన్లు, వైబ్రేషన్, లైట్ కారణంగా మెదడు నిరంతరం చురుకుగా ఉండటం వల్ల సరైన నిద్ర పట్టదు.
  • మొబైల్ ఫోన్‌ల లైట్‘నీలినుంచి వెలువడే విద్యుదయస్కాంత వికిరణం మెదడుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ప్రత్యేకించి ఎక్కువసేపు సమీపంలో ఉంచినట్లయితే కాబట్టి గుర్తుంచుకోవాలి.
  • పడుకునే ముందు మొబైల్ స్క్రీన్ చూడటం వల్ల బ్లూ కాంతి వస్తుంది. ఇది కళ్ళకు అలసటను కలిగిస్తుంది నార్మల్ స్లీప్ సైకిల్ కి అంతరాయం కలిగిస్తుంది.
  • నిద్ర అనేది లేకపోవడం వల్ల చిరాకు, నిరాశ, ఆందోళన వంటి మానసిక రుగ్మతలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
  • కొన్ని సంఘటనలలో మొబైల్ ఫోన్లు వేడెక్కడం, పేలడం వంటివి చూస్తూనే ఉన్నాం. అందువల్ల మొబైల్ ఫోన్‌ను దిండు పక్కన ఛార్జ్‌లో ఉంచుకోవడం ప్రమాదకరం.
  • వీలైతే మీరు రాత్రి నిద్రపోయేటప్పుడు మీ మొబైల్ ఫోన్‌ను మీ నుంచి కొంచెం దూరంగా ఉంచండి. ఉదాహరణకు సైడ్ టేబుల్‌పై లేదంటే ఛార్జింగ్ చేస్తున్నప్పుడు దానిని దిండు కింద లేదా ఏదైనా గుడ్డ కింద ఉంచవద్దు. పడుకునే ముందు కాసేపు మొబైల్ ఫోన్ చూడకపోవడం వల్ల స్ట్రెస్ మీ దగ్గరికి రానే రాదు.