
ఫోన్, ట్యాబ్, కంప్యూటర్ లాంటివి ఎక్కువగా ఉపయోగించేవారిని ‘టెక్ట్స్ నెక్’ అనే వ్యాధి ఈ మధ్యకాలంలో ఎక్కువగా వేధిస్తుంది. గంటలకొద్దీ తలను కిందికి వంచి ఫోన్ చూడటం.. కంప్యూటర్ స్క్రీన్‌కే కళ్లను అప్పగించేయడం వల్ల ఈ సమస్యతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది.
ప్రస్తుత జనాభాలో 18- 44 ఏళ్ల వయసువారిలో 79% మంది రోజంతా ఫోన్‌ను తమతోనే ఉంచుకుంటున్నారట. స్లీపింగ్ టైమ్ ను మినహాయిస్తే.. కేవలం రెండు గంటలు మాత్రమే ఫోన్‌కు దూరంగా ఉంటున్నారని అనేక సర్వేలు చెబుతున్నాయి.
ఈ సమస్య ఉన్నవారిలో భుజాల మీదుగా బిగుతుగా అనిపించడం, మెడలో నొప్పితోపాటు దీర్ఘకాలిక తలనొప్పి కూడా వేధిస్తుంది.
సమస్య ఇలాగే కొనసాగితే.. నరాలలో వాపు, వెన్నెముక వంగిపోవడం, ఆర్థరైటిక్ సమస్యలూ చుట్టుముడతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
- ఫోన్, కంప్యూటర్ స్క్రీన్‌ను కంటిస్థాయికి తీసుకురావాలి.
- ప్రతి 15-20 నిమిషాలకు ఒక్కసారైనా మీ మొబైల్ ఫోన్ నుంచి చిన్న బ్రేక్ తీసుకోవాలి.
- మెడను తిప్పుతూ, పైకి, కిందికి చూస్తూ చిన్నపాటి వ్యాయామాలు చేయాలి.
- మెడ, భుజాల కండరాలు బలపడే విధంగా చిన్న చిన్న వ్యాయామాలను చేస్తూ ఉండాలి.
- ఫోన్, కంప్యూటర్ స్క్రీన్ చూసేటప్పుడు తల, మెడను సరైన భంగిమలో ఉంచాలి.
- మెడ, వెన్నుపూస ఆరోగ్యానికి సంబంధించిన యోగాసనాలు చేయడం వల్ల కూడా సమస్య కొలికి వస్తుంది.
- సమస్య ఎక్కువైతే పర్టిక్యులర్ టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం.