
సీజన్ ఏదైనా ముఖం జిడ్డుగా మారుతుందంటే మాత్రం మొటిమలు, బ్లాక్ హెడ్స్, చూడ్డటానికి గ్లో లెస్ గా కనిపిస్తుంది. ఇందుకోసం మనందరికీ తెలిసిన ముల్తానీ మట్టి వల్ల మంచి గ్లొయింగ్ స్కిన్ ను పొందొచ్చు. ఇది ముందుగా చర్మ రంధ్రాలను అడ్డుకుని, మొటిమలను తగ్గిస్తుంది. చర్మ కాంతిని పెంచుతుంది. ఆయిలీ ఫేస్ ను బెటర్ గా మార్చడంలో హెల్ప్ చేస్తుంది. ముల్తానీ మట్టిలోని సుగుణాలు చర్మాన్ని నిత్యం ఆరోగ్యంగా ఉంచుతుంది. కాబట్టి మెరిసే లుక్ కోసం ఈ ప్యాక్ లను ట్రై చేయండి.
- వేపతో క్లెన్సర్ ట్రై చేయొచ్చు. వేపాకు, వేప సహజంగానే శక్తివంతమైన యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది జిడ్డు చర్మాన్ని తగ్గించి, చర్మానికి మెరుపునిస్తుంది. దీంతోపాటు ముల్తానీ మట్టి కలిపి ముఖానికి వేసుకుంటే మంచిది. ఇందుకోసం వేపపేస్ట్ ను ముల్తానీ మట్టితో కలిపి పేస్ట్ లా తయారు చేసుకుని ముఖానికి పట్టించాలి. 10 నుంచి 15 నిమిషాలు ఆరనిచ్చి, గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. వారానికి రెండుసార్లు వేస్తే బెస్ట్ రిజల్ట్ ఉంటుంది.
- చందనంతో ముల్తానీ మట్టి కలిపి వేసుకునే ప్యాక్ చర్మాన్ని వేడి నుంచి చల్లబరుస్తుంది. స్కిన్ టోన్ పెరిగేందుకు హెల్ప్ చేస్తుంది. ఇందుకోసం గంధం పౌడర్ లో రోజ్ వాటర్, ముల్తానీ మట్టి కలిపి ఆ పేస్ట్ ను ముఖానికి వేయాలి. ఇది 20 నిమిషాల పాటు ఆరనిచ్చి, చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల చర్మం నిగారింపుగా ఉంటుంది.
- అలోవేరా జెల్ ప్లస్ ముల్తానీ మట్టి. ఈ రెండిటినీ కలిపి వేసే ప్యాక్ ముఖానికి నిగారింపు, గ్లో ను ఇస్తుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మాన్ని బ్రైట్ గా మారుస్తుంది. హైడ్రేట్‌గా ఉండేందుకు వాటర్ పుష్కలంగా తాగండి.