
Pigmentation Home Remedies: యువతులను ఎక్కువగా వేధించే సమస్యల్లో పిగ్మెంటేషన్ ఒకటి. చెంపలు, నుదుటిపై ఏర్పడే ఈ నల్లటి మచ్చలు ఫేస్ లో కళ లేకుండా చేస్తాయి. ఇందుకోసం రకరకాల క్రీములు వాడుతుంటారు. అయితే అస్తమానం బ్యూటీ పార్లర్ కి వెళ్ళడం, క్రీములు వాడటం చేయలేం కదా. ఎందుకంటే అవి కెమికల్స్ తో కూడినవి. కాబట్టి ఇంట్లో దొరికే వాటితోనే దీనికి చెక్ పెట్టొచ్చని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అదెలాగంటే..
- ఒక గిన్నెలో రెండు టేబుల్‌స్పూన్ల ఓట్‌మీల్, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, అర టేబుల్‌స్పూన్ టమాటా రసం వేసి.. బాగా కలిపి మిశ్రమంగా తయారు చేయాలి. దీన్ని నల్లని మచ్చలపై రాసి.. 15-20 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. టమాటాలో ఉండే సహజసిద్ధమైన బ్లీచింగ్ గుణాలు.. చర్మాన్ని శుభ్రపరుస్తాయి. ఓట్‌మీల్.. ఎక్సోఫోలియేటింగ్ ఏజెంట్‌గా పనిచేసి, పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది. ఇక పెరుగు.. ముఖాన్ని మృదువుగా చేస్తుంది.
- కలబంద గుజ్జు, తేనెను ఒక్కో టేబుల్‌స్పూన్ చొప్పున తీసుకోవాలి. ఇందులో రెండు టేబుల్‌స్పూన్ల పొప్పడి గుజ్జు వేసి.. ప్యాక్‌లాగా చేసుకోవాలి. దీన్ని పిగ్మెంటేషన్ ఉన్నచోట అప్లై చేసి, అరగంటసేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత కడిగేసుకుంటే చాలు. కలబందలోని సుగుణాలు.. చర్మంలో కొలాజెన్ స్థాయులను పెంచి, ముఖాన్ని మెరిపిస్తాయి. ఇక ముఖంపై మచ్చలను తొలగించడంలో తేనె సమర్థంగా పనిచేస్తుంది. పొప్పడిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్.. చర్మంపైన నల్లని మచ్చలు, మొటిమలను తగ్గిస్తుంది.
- గుప్పెడు పుదీనా ఆకులను మెత్తటి పేస్ట్‌లా చేసుకొని, పిగ్మెంటేషన్ ఉన్న ప్రాంతాల్లో అప్లై చేసి.. 10-15 నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి. చర్మానికి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో పుదీనా సాయపడుతుంది.
- ఆరెంజ్ తొక్కలను ఎండబెట్టి.. పొడిగా చేసుకోవడం ఒక పద్ధతి. అందులో కొద్దిగా పచ్చిపాలు కలిపి మెత్తని పేస్ట్‌లా చేసి, ముఖానికి అప్లై చేసి ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఆరెంజ్‌లో ఉండే విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు కాస్త చర్మాన్ని బ్రైట్ గా మారుస్తాయి. Pigmentation Home Remedies.