పసుపుకొమ్ము ఆరోగ్యానికి పట్టుకొమ్మ..!

Raw Turmeric Roots Health Benefits: పసుపులోని ఔషద గుణాలు మరేదేనిలోనూ లేవని మన పెద్దలతో పాటు యునాని వైద్యులు చెబుతున్నారు. పసుపులోనే కాదు పసుపుచెట్టు ఆకులలోనూ అద్భుతమైన ఔషద గుణాలున్నాయి. పసుపు ఒట్టి కూరలలోనే కాక సంప్రదాయంగా పూజా కార్యక్రమాలలో వాడటం.. మరి ముఖ్యంగా వివాహాది శుభ కార్యక్రమాల్లోనూ పసుపును వాడటం మనకు తెలుసు.. ఒక్క పసుపు పొడితోనే కాక పసుపు కొమ్ము, ఆకుల రసం ఎన్నో అనారోగ్యాలకు నివారిణిగా.. ఉపశమనకారిణిగా ఉపయోగపడుతుందని మీకు తెలుసా!

ఎప్పుడైనా ఏదైనా చిన్న గాయం అయినప్పుడు వెంటనే మనం చేసే ఫస్ట్ ఎయిడ్ కన్నా మెరుగ్గా పనిచేసే చిట్కా.. పసుపు పెట్టడం. దీనిలో *ఆంటీబయోటిక్ గుణాలు రక్తాన్ని అరికట్టి, గాయాన్ని త్వరగా మానేలా చేయడంలో సాయపడుతుంది. Raw Turmeric Roots Health Benefits.

  • అటువంటి పసుపుమొక్క నుంచి తీసిన పసుపుకొమ్మును అరగదీసి రాసుకుంటే దద్దుర్లు, వాపులు తగ్గుముఖం పడతాయి. అలానే పసుపు ఆకుతో స్నానం చేస్తే దద్దుర్ల నుంచి త్వరితగతిన ఉపశమనం లభిస్తుంది.
  • వేడి వేడి పాలలో చిటికెడు పసుపు వేసి తీసుకుంటే, జలుబు, దగ్గు తగ్గుముఖం పడతాయి.
  • పసుపు ఆకుల రసాన్ని డికాషన్ రూపంలో తీసుకుంటే శరీరంలో ఎన్నాళ్ళుగా వేధిస్తున్న ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
  • పసుపు ముఖానికి రాయడం వల్ల గ్లో పెరుగుతుంది. తేనె, పసుపు ఆకు రసం కలిపిన లేపనాన్ని కలిపి ఒక ప్రత్యేకమైన మిశ్రమాన్ని ముఖానికి రాస్తే మనకు తెలియకుండానే మరింత కాంతివంతంగా, మెరుస్తూ ఉంటామని యునాని వైద్యంలో తెలిసింది.
  • పసుపు ఆకు ఇమ్యునిటీ బూస్టర్ గా పని చేస్తుంది. కాబట్టి పసుపు ఆకును డికాక్షన్ రూపంలో రెగ్యులర్ గా తీసుకోవడం మేలు చేస్తుంది.
  • క్యాన్సర్ వచ్చిన రోగులకు వారానికోసారి ఇస్తే నీరసం తగ్గి, త్వరగా కోలుకునే అవకాశం ఉంది.
  • కాళ్ల పగుళ్ళున్న వారు పసుపు రాసుకుంటే పగుళ్ళు క్రమంగా తగ్గుతాయి.

Also Read: https://www.mega9tv.com/life-style/causes-of-heart-attack-and-walking-is-a-mantra-for-heart-attack/