వైట్ బ్రెడ్ వద్దే వద్దు..!

white bread is not optimal for health: వైట్ బ్రెడ్.. మిల్క్ బ్రెడ్ పేరు ఏదైతేనేం.. ఆరోగ్యం బాలేకున్నా.. క్విక్ బ్రేక్ ఫాస్ట్ గా.. అందరీ ఫేవరేట్ అండ్ రొటీన్ డైట్ లో భాగంగా మారిన ఈ
బ్రెడ్‌లో డైట్‌ ఫైబర్‌ చాలా తక్కువగా ఉంటుంది. చూడటానికి తెల్లగా, సాప్ట్ గా కనిపించే ఈ బ్రెడ్ లో ఫైబర్‌ తక్కువగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ సరిగా పని చేయదు. అందులోనూ రెఫైన్‌డ్‌ ఫ్లోర్‌ (మైదా) ఎక్కువగా ఉండటం వల్ల అది బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ను త్వరగా పెరిగేలా చేస్తుంది. దీనివల్ల ఒబేసిటీ, డయాబెటిస్‌ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే దీర్ఘకాలం దీన్ని తినడం వల్ల మలబద్దకం, ఎసిడిటీ, గ్యాస్‌ వంటి సమస్యలు కలగవచ్చని హెల్త్ నిపుణులు చెబుతున్నారు.

క్యాన్సర్‌ అనే విషయంలో వైట్ బ్రెడ్‌ను నేరుగా కారణమని చెప్పలేం. కానీ దీన్ని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ (జ్వరం లాంటిది) పెరగవచ్చని పరిశోధనల్లో తేలింది. అదే ఇన్ఫ్లమేషన్‌ లాంగ్ రన్ లో కొనసాగితే కొన్ని క్యాన్సర్‌ రకాల‌కు వెల్కమ్ చెప్పినట్లే అని కొందరు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. white bread is not optimal for health..!

దీనికి బదులు బ్రౌన్ బ్రెడ్‌ ను ప్రిఫర్ చేయడం ఉత్తమం. ఇందులో పూర్తిగా ధాన్యాలతో తయారై ఉంటాయి కాబట్టి ఇలాంటి రకపు బ్రెడ్‌లలో ఫైబర్‌, మినరల్స్‌ ఎక్కువగా లభిస్తాయి. ఇవి జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. అలాగే బ్లడ్ షుగర్‌ను నియంత్రించడంలో కూడా సాయపడతాయి. అందుకే రోజూ బ్రెడ్ తినే అలవాటు ఉంటే వైట్ బ్రెడ్ కన్నా బ్రౌన్ బ్రెడ్‌ను ఎంచుకోవడం మేలు. అలానే ఏదైనా ఆహారం మితంగా తీసుకుంటేనే ఆరోగ్యమని మరవద్దు.

Also Read: https://www.mega9tv.com/life-style/pigmentation-disappears-with-these-home-remedies-check-out-what-they-are/