
Reducing Salt is Good For Health: రోజువారీ ఆహారంలో భాగంగా 280 మిల్లీ గ్రాముల ఉప్పు అనేది మన శరీరానికి సరిపోతుంది. అంటే అది ఒక గ్రాము కంటే చాలా తక్కువ. కాబట్టి పై పెచ్చు ఉప్పు తగ్గిందని తినేముందు వేయవలసిన పనిలేదు. అలాగనీ ఉప్పు ఎక్కువగా ఉండే చిప్స్, ప్రోసెసెడ్, స్పైసీ వంటకాలను అదే పనిగా తీసుకోవడం మంచిది కాదు.
పూర్వపు రోజుల్లో గంజి అన్నం, రాగి సంగటి, జొన్న సంగటి, మజ్జిగ అన్నం రోజువారీ ఆహారంలో భాగం చేసుకొని తినేవారు. హెల్తీగా ఉండేవారు. నిజానికి వీటిలో ఉప్పు చాలా తక్కువ శాతంలో ఉంటుంది. కాబట్టి అప్పటి కాలంలో సోడియం స్థాయులు తగ్గి కొన్ని అనారోగ్య సమస్యలు, ఇబ్బందులు వచ్చేవి. ఇందుకు వీటిని అధిగమించేందుకు రుషులు ఉప్పుని ఆహారంలో భాగంగా వాడాలని చెప్పారు. అంతేతప్ప ఎలా పడితే, ఎంత పడితే అంత ఉప్పును వాడి ముప్పు తెచ్చుకోమని కాదు.
22 వేల రకాల జబ్బులకు ఉప్పు కారణం అవుతుందంటే మీరు నమ్ముతారా..?! Reducing Salt is Good For Health.. Stay Healthy and Stay Fit.!
- వాస్తవానికి ఉప్పు మన శరీరానికి చాలా అవసరం. ఆది సరైన రీతిలో అందకపోతే ఎంతో నష్టం వాటిల్లుతుంది. ఒక వర్షపునీరులో తప్ప సృష్టిలో ఉన్న అన్ని ఆహార పదార్థాల్లో ఉప్పు ఉంటుంది.
- గింజలు, పండ్లు, కూరగాయలు లాంటి అన్నింటిలో సహజంగా ఉప్పు ఉంటుంది. నిజానికి అలా సహజంగా లభించే ఉప్పు తినేందుకు సరిపోతుంది. కానీ వంటల్లో టేస్ట్ కోసమో.. పై పెచ్చు ఉప్పు వేస్తుంటాం. అలా వేయలసినవసరం లేదని గ్రహించి.. ఉప్పు ముప్పు కాకముందే తగ్గించి వాడితే మేలు.
- ఉప్పును సాధారణంగా శని ప్రభావంగా భావిస్తారు. ఎందుచేత అంటే మన శరీరం కోటానుకోట్ల కణాల సముదాయం కదా.. ఒక కణంలో ఉండే సోడియం, పొటాషియం నిష్పత్తి 1:8గా ఉండాలి. అలా కాకుండా ఎక్కువ ఉప్పు తింటే లేదా తీసుకుంటే ఈ నిష్పత్తి అనేది మారుతుంది. అలానే ఒక ఉప్పు కణం 3రెట్లు నీటిని అబ్జర్వ్ చేసి ఉంచుతుంది. కాబట్టి లావు అవుతారనే విషయం గుర్తుంచుకోండి.
- గాలి, నీరు, ఆహార పదార్థాలు ప్రతి కణానికి కావాలి, వాటి రాకపోకలు సాఫీగా ఉండాలి.
మన శరీరంలో సోడియం (ఉప్పు)ను చెమట లేదా మూత్రం రూపంలో బయటికి ఎలిమినేట్ చేసేందుకు, తగ్గిన పొటాషియను పెంచేందుకు మన శక్తి 50 నుంచి 60% ఖర్చవుతుంది. అదే మనం ఉప్పును అధికంగా తీసుకోవడం మానేస్తే, ఈ అదనంగా ఖర్చు అయ్యే శక్తి వల్ల మన శక్తి స్థాయులు పెరిగి, ఆరోగ్యంగా ఉంటాం. అందువల్లే మన పెద్దలు, ఆరోగ్య నిపుణులు ఈ సాల్ట్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండమని చెబుతారు.
Also Read: https://www.mega9tv.com/life-style/a-regular-essential-diet-for-sugar-and-its-precautions/