స్ట్రెస్ నివారిణి.. రివర్స్ వాకింగ్..!

ఆరోగ్యంగా ఉండటానికి వ్యాయామం ఎంతో ముఖ్యం. వ్యాయామం చేయడం వల్ల ఫిజికల్ ఫిట్ నెస్ తో పాటు మెంటల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. చాలామంది వాకింగ్, జాగింగ్, యోగా, జిమ్‌లో వర్కౌట్లు వంటివి చేస్తుంటారు. అయితే చాలామంది సులువుగా చేయగలిగే వ్యాయామం ఏదైనా ఉందంటే అది వాకింగే.
నడక వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. రెగ్యులర్‌గా వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గడంతో పాటు గుండె హెల్తీగా ఉంటుంది. స్ట్రెస్ తగ్గి, మెంటల్ పీస్ దక్కుతుంది.

మనలో చాలామంది ప్రతి రోజూ వాకింగ్ చేస్తుంటారు. అయితే, ఎప్పుడైనా రివర్స్ వాకింగ్ ను ట్రై చేశారా?, మీరు విన్నది నిజమే వెనక్కి నడవడం. ఈ రివర్స్ వాకింగ్ వల్ల ఎన్నో లాభాలున్నాయని యోగా ఎక్సపర్ట్స్ చెబుతున్నారు.

రివర్స్ వాకింగ్ పద్ధతిని రెట్రో వాకింగ్ అని పిలుస్తారు. వాకింగ్ చేసేటప్పుడు ముందుకు నడుస్తుంటాం. అదే రివర్స్ వాకింగ్‌లో వెనుకకు నడుస్తుంటాం. అంటే వెనుకకి నడవడాన్నే రెట్రో వాకింగ్ అంటారు. ఇది కండరాలు, మనసు, శరీర అనుసంధానికి చాలా మంచి ఆప్షన్. ఇందులో మీరు నిటారుగా నిలబడి వెనుకకు నడవాలి. రెగ్యులర్‌గా కొన్ని నిమిషాల పాటు రివర్స్ వాకింగ్ చేయడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి.

  • వయసు పెరిగేకొద్దీ కీళ్ల ఆరోగ్యం అనేది బలహీనపడుతుంది. దీనినే ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఈ వ్యాధి ఉన్నవారిలో కీళ్ల లోపల దృఢత్వం, వాపు ఉంటుంది. నడుస్తున్నప్పుడు, లేచినప్పుడు లేదా కూర్చున్నప్పుడు నొప్పి బాగా వస్తుంది. అలాంటప్పుడు రివర్స్ వాకింగ్ చేయడం వల్ల కీళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. దీంతో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
  • వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గడం చాలా ఆలస్యమవుతుంది. అదే వాకింగ్‌కి బదులు వెనుకకు నడిస్తే ఎక్కువ మొత్తంలో బరువు తగ్గేందుకు ఆస్కారం ఉంటుంది. దీనికి ఎక్కువ శ్రమ అవసరం. బరువు తగ్గడానికి నార్మల్ వాకింగ్ కన్నా ఇది మంచిది. బరువు తగ్గే ఫలితాల్ని త్వరగా చూపుతుంది. అందుకే బరువు తగ్గడానికి రివర్స్ వాకింగ్ ట్రై చేయడం అనేది ఉత్తమం!
  • ఒత్తిడి లేదా ఆందోళనతో బాధపడుతుంటే కచ్చితంగా దీన్ని ట్రై చేయండి. రివర్స్ వాకింగ్ చేయడం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇలా వెనుకకి నడవడం వల్ల శరీర అవగాహన పెరుగుతుంది. స్లీప్ సైకిల్ ఇంప్రూవ్ అవుతుంది. ఆలోచించే, నేర్చుకునే, గుర్తుంచుకోగల సామర్థ్యం పెరుగుతుంది.

మనం ప్రతిరోజూ నడుస్తాం. దాదాపు అందరూ ముందుకు నడుస్తుంటారు. కాళ్ళు, కండరాలు, మెదడు దానికి అలవాటుపడ్డాయి. ఇలా చేస్తున్నప్పుడు మన మెదడు పూర్తిగా పనిచేయదు మరీ.. కానీ మనకు చిన్న ఇండికేషన్ లాగా వెంటనే కండరాల జ్ఞాపకశక్తి పనిచేయడం ప్రారంభిస్తుంది. దీని కారణంగా మనసుకు, శరీరానికి మధ్య ఉన్న సంబంధం సడలి, అలవాటు లేని తప్పు దిశలో నడిచినప్పుడు, మెదడు కండరాలకు సరైన సంకేతాలను ఇవ్వాలి. దీంతో శరీరానికి, మెదడుకి అనుసంధానం పెరగడం వల్ల మీకు చాలా కాన్స్‌ట్రేషన్ పెరుగుతుంది. రెట్రో వాకింగ్ కండరాలన్నింటినీ బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. రెగ్యులర్‌గా రివర్స్ వాకింగ్