
Side effects of skipping breakfast: ఉదయం లేచిన వెంటనే ఆకలి వేస్తుంది. ఇడ్లీ, వడ, ఓట్స్ సలాడ్, దోస, పూరీ లాంటివి టిఫిన్ లో ప్రిఫర్ చేస్తుంటాం. అయితే కొందరు మాత్రం టిఫిన్ చేయకుండా అశ్రద్ధ వహిస్తారు. దీనివల్ల లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. అల్పాహారం అనేది శరీరానికి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇది రాత్రంతా విశ్రాంతి తీసుకున్న శరీరాన్ని రీచార్జ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది కేవలం కడుపు నిడేందుకు మాత్రమే ఉపయోగపడదు. శరీరంలోని మెటబాలిజంకు సపోర్ట్ నిస్తుంది. దీంతోపాటుగా ఉదయం టిఫిన్ తినకపోతే కొందరికి తలనొప్పి, జీర్ణ సంబంధమైన సమస్యలు, గ్యాస్ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. అందువల్లే బ్రేక్ ఫాస్ట్ ను తప్పక తినాలి. అసలు టిఫిన్ ను ప్రతీరోజు దాటవేయడం వల్ల కలిగే మేజర్ ఇష్యూస్ ఏంటో ఇప్పుడు చూద్దాం: Side effects of skipping breakfast.
- మెటబాలిజం అంటే ఆహారాన్ని శరీరానికి కావలసిన శక్తిగా మార్చే ప్రక్రియ. డైలీ టిఫిన్ తినకుంటే మెటబాలిజం నెమ్మదిస్తుంది. శరీరానికి ప్రతీరోజు ఉదయం శక్తి అవసరం. కాబట్టి డైలీ రొటీన్ పనులు చేసుకునేందుకు కావాల్సిన ఎనర్జీ బిల్డ్ అప్ అవ్వడం కోసమైనా టిఫిన్ తప్పక తినాలి.
- ఉదయం టిఫిన్ ను తిననివాళ్లకు మధ్యాహ్నం అయ్యేసరికి ఆకలి విపరీతంగా వేస్తుంది. దీనివల్ల మీరు లంచ్ లో ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటారు. దీంతో హై షుగర్, హై ఫ్యాట్.. మీ శరీరంలోకి చేరుతుంది. ఇది అరోగ్యానికి అంత మంచిది కాదు. బరువు కూడా పెరిగే అవకాశం ఉంది.
- బ్రేక్ ఫాస్ట్ చేయడం వల్ల శరీరంలో గ్లూకోజ్ తయారవుతుంది. ఇది మొదడు పనితీరుతో పాటు ఫిజికల్ యాక్టివిటీస్ కు కూడా బలాన్నిస్తుంది. బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది. అంటే, అలసటగా అనిపించడం, చురుకుగా లేకపోవడం, ఏదైనా పనిమీద ఎక్కువసేపు దృష్టి నిలపలేకపోవడం జరుగుతుంది.
- ఉదయం బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తే చాలా చిరాకుగా ఉంటుంది. ఏ పనిమీద కూడా ఇంట్రెస్ట్ ఉండదు. షుగర్ లెవల్స్ తక్కువవుతాయి. దీంతో ఇన్సులిన్ ను చికాకు పెట్టవచ్చు. అనారోగ్యానికి కారణం కావచ్చు. కాబట్టి ప్రతీరోజు ఉదయం తప్పకుండా టిఫిన్ చేయండి. టీ, కాఫీలకు దూరంగా ఉండండి.