నానబెట్టిన ఎండుద్రాక్ష తింటున్నారా..?!

ఇంట్లో జరిగే వేడుక, పండుగ సందర్భాల్లో విధిగా చేసే పాయసం తరహా స్వీట్ రకాల్లో, స్వీట్ పానీయాల్లో ఎండుద్రాక్షను తప్పకుండా వేస్తాం. ఇలా మనకు తెలియకుండానే అప్పుడప్పుడు తినే ఈ ఎండుద్రాక్ష వల్ల కలిగే హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఎండుద్రాక్షను నానబెట్టి తినాలి అంటుంటారు. అసలు నానబెట్టి తినడం వల్ల కలిగే అడిషనల్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • సాధారణంగా వీటిలో ఫైబర్ అధికం. ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి, తిన్న ఆహారాన్ని సక్రమంగా జీర్ణమయ్యేలా చేసి, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది.
  • ఇందులోని గ్లూకోజ్, ఫ్రక్టోజ్ ల వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.
  • అందుకే వ్యాయామాలకి ముందూ లేదా తర్వాత వీటిని తింటే మరింత మేలు జరుగుతుంది.
  • వీటిల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తాయి.
  • దీర్ఘకాలిక వ్యాధులకు కారణమయ్యే ఒత్తిడిని తగ్గిస్తాయి.
  • అంతేకాక ఇందులోని పొటాషియం రక్తపోటును అదుపు చేసి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
  • ఎండుద్రాక్షలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను అదుపు చేస్తుంది.
  • ఎముకల ఆరోగ్యానికవసరమయ్యే కాల్షియం పుష్కలంగా ఉండి, ఆస్టియోపోరోసిస్ ను నియంత్రిస్తుంది.
  • ఎండుద్రాక్ష శరీరాన్ని డీట్యాక్స్ చేయడానికి సాయపడుతుంది.