రుచి కోసం మాత్రమే మసాలాలు.. ఆరోగ్యం కోసం కాదు..?!

Spices only for taste not for health: మనం నిత్యం వంటల్లో వాడే కొన్ని రకాల మసాలాలు మన శరీరానికి ఏమాత్రం అవసరం లేదు. కేవలం రుచి కోసం మాత్రమే వీటిని వాడుతున్నాం. వీటివల్ల మనకు మేలు జరగడం కన్నా హాని ఎక్కువ అని తెలుసా..

ఉప్పు, నూనె, కారం, మసాలాల వంటి రుచులు మన ఆరోగ్యనికి ఎలాంటి మేలు చేయవు. ఒక్కో రుచి ఒక్కో రోగాన్ని కలిగిస్తుందట. నేటి వంటల తీరు ఎందుకు మారాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం:

  • కారం పండుమిర్చి, ఎర్ర రంగులో ఉండే కారం అసలు మంచిది కాదు. ఇది కడుపులో మంటకు కారణమై, అల్సర్లు వస్తాయి.
  • బదులుగా సహజంగా పండే పచ్చిమిర్చి మంచిది. ఎంతైనా వాడవచ్చు.
  • చింతపండు రోజు వాడటం వల్ల పేగుల్లో కదలిక తగ్గి, మలబద్ధకం పెరుగుతుంది.
  • బదులుగా చింతకాయ, చింతచిగురు వాడవచ్చు. ఉసిరి, నిమ్మకాయ, మామిడి కాయలను ఎండ బెట్టి పౌడర్ గా చేసి వంటల్లో వాడవచ్చు. టమాటాను ఎంత వాడిన దోషం ఉండదు. కానీ పులుపు ద్వారా ఎసిడిటీ వస్తుంది.
  • చక్కెర ద్వారా షుగర్ వస్తుంది. బరువు పెరుగుతారు. లాంగ్ రన్ లో పళ్ళు సైతం చెడిపోతాయి. కాబట్టి చక్కెర, బెల్లంకు బదులు ఖర్జూరం, తేనె వాడటం ఉత్తమం.
  • నెయ్యిలో కొలెస్టరాల్ మాత్రమే ఉంటుంది. కొవ్వు ఉండదు. దీనికి బదులు చిక్కటి పాలు లేదా పెరుగును వాడాలి. కొలస్ట్రాల్ ద్వారా గుండె జబ్బులు వస్తాయి.
  • పూర్వం పెద్దలు మసాలాలను వైద్యం కోసం మాత్రమే వాడేవారు.

దగ్గుకు మిరియాలు,
కడుపులో పురుగులు ఉంటే పసుపు,
ఆకలి పుట్టించడం కోసం జీలకర్ర, శొంఠి,
ఇక ధనియాలు, వెల్లుల్లి, అల్లం అనేవి యాంటి కొలెస్ట్రాల్ గా వాడేవారు.
ఎక్కువగా మసాలాలు వాడితే నరాల వీక్ నెస్ వచ్చే ప్రమాదముందని చెబుతున్నారు.
వేయించిన పెసర, మినపపప్పులు, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి తాలింపు కోసం నిర్మొహమాటంగా వాడొచ్చు. Spices only for taste not for health

Also Read: https://www.mega9tv.com/life-style/reducing-salt-is-good-for-health-and-its-side-effects-of-salt/