
జిడ్డు చర్మం, మొటిమలు, అధిక వేడి వల్ల చర్మం పొడిబారడం.. ఎన్నో సమస్యలు ఈ వేసవిలో ఇబ్బంది పెడుతుంటాయి. వీటన్నింటికి చెక్ పెట్టేలా కొన్ని టిప్స్ మీకోసం…
చర్మ సౌందర్యాన్ని దెబ్బతీసే వాటిలో మృతకణాలు ఒకటి. వీటివల్ల చర్మం డల్, కాంతి హీనంగా కనిపిస్తుంది. ఇవి చర్మానికి పోషకాలు అందకుండా చేసి, చెమట గ్రంథుల్ని మూసుకుపోయేలా చేస్తాయి. దీంతో మొటిమలు, మచ్చలు కారణమవుతాయి. ఇందుకోసం స్నానం చేయడానికి ముందే ఏదైనా ఎసెన్షియల్ నూనెతో చర్మాన్ని మసాజ్ చేసుకోవాలి. ఆపై స్నానం చేసి.. మీ స్కిన్ టోన్ కి సరిపోయే స్క్రబ్ సహాయంతో మృతకణాలను తొలగించుకోవాలి. చర్మానికి ఎలాంటి హానీ కలగకుండా వాటిని సులభంగా వదిలించుకోవచ్చు.
ఏ కాలమైనా బయటికి వెళ్లే ముందు సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవడం మాత్రం మరవద్దు.
ఎందుకంటే ఇది ఎండ నుంచి మన చర్మాన్ని కాపాడుతుంది. అయితే దీని అవసరం వేసవి కాలంలో మరింత ఎక్కువ అని గుర్తుంచుకోండి. మీరు బయటకు వెళ్లాలనుకునే 20 నిమిషాల ముందే ఈ సన్ స్క్రీన్ రాసుకోవాలట. ఇంటికి చేరుకున్న తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం లేదా స్నానం చేస్తే చాలు. అలాగే చర్మాన్ని తేమగా ఉంచుకోవడానికి మాయిశ్చరైజర్ రాసుకోవడమూ మర్చిపోవద్దు. అది కూడా చర్మతత్వాన్ని బట్టి ఎంచుకోవాలి సుమా.