బరువు తగ్గించే మంత్ర.. స్కిప్పింగ్!

వ్యాయామాలు అనేవి ఒక్కొక్కరు తమ ఫోకస్ నీ బట్టి రకరకాలుగా చేస్తూంటారు. కొందరు తమ శరీర సౌష్టవాన్ని సంరక్షించుకోవడం కోసమైతే.. ఇంకొందరు శరీరాన్ని ఫిట్ గా ఉంచుకునేందుకు వ్యాయామం చేస్తుంటారు. ఫిట్నెస్ కోసమైనా.. హెల్తీగా ఉండటం కోసమైనా.. వ్యాయామం అనేది సరైన విధంగా, క్రమం తప్పకుండా చేసినప్పుడే మంచి ఫలితం ఉంటుంది. అలా చేసే వ్యాయామాల్లో బెస్ట్ ఫిట్నెస్ మంత్ర స్కిప్పింగ్ అంటున్నారు. శరీరం మొత్తానికి ఓకేసారి వ్యాయామం, స్కిప్పింగ్ తో హెల్తీగా ఉండటం సాధ్యమవుతుందని ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్‌లు సూచిస్తున్నారు.

  • శరీరంలోని అవయవాల కదిలికను వేగవంతం చేయడంతో పాటు వాటి మధ్య సమన్వయానికి స్కిప్పింగ్ తోడ్పడుతుంది.
  • రోజు స్కిప్పింగ్ అలవాటుగా చేయడం వల్ల శరీరం ధృడత్వాన్ని సంతరించుకోవటంతోపాటు పూర్తిస్థాయిలో ఫిట్‌గా తయారవుతుంది. ఎముకలు గట్టిపడటం జరుగుతుంది. చర్మంపై ఏర్పడ్డ ముడతలు సైతం తొలగిపోతాయి.
  • స్కిప్పింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. పాదాలకు రక్షణ లేకుండా స్కిప్పింగ్ చేయకూడదు. దీనివల్ల పాదాలకు నొప్పి కలుగుతుంది. ఒక్కోసారి పగుళ్లు ఏర్పడతాయి.
  • ముఖ్యంగా కాంక్రీట్ నేలపై స్కిప్పింగ్ చేసే సందర్భంలో బూట్లు లాంటివి వేసుకోవటం ఉత్తమం.
  • వెయిట్ లాస్ కోసం చూసేవారు, బరువు తగ్గాలి అనుకునేవారు స్కిప్పింగ్ చేయడం గొప్ప ప్రక్రియ.
  • స్కిప్పింగ్ ప్రారంభించేముందు ఐదు నిమిషాల పాటు వార్మ్ అప్ చేయాలి. దీనివల్ల శరీరం ఉల్లాసంగా ఉంటుంది. ఈసారి వ్యాయామం చేసేముందు ఈ ట్రిక్స్ ఫాలో అయి, ఫిట్ గా ఉండండి.