ఇంట్లోనే హెయిర్ స్పా క్రీమ్ ఇలా రెడీ..!

జుట్టు అందంగా, మెరుస్తూ, నల్లగా, ఒత్తుగా ఉండాలంటే మనం హెయిర్ పై ఉపయోగించే నూనె, షాంపూ, క్రీమ్, డై ల విషయంలో కేర్ తీసుకోవడం చాలా అవసరం. వారానికి రెండుసార్లు జుట్టుకు నూనె అప్లై చేసి, తలస్నానం చేయడం అంతవరకు మాత్రమే తెలుసు. అయితే జుట్టు సంరక్షణ గురించి అవగాహన, శ్రద్ద ఉన్నవారికి హెయిర్ స్పా గురించి కూడా తెలిసే ఉంటుంది. నెలకొకసారి హెయిర్ స్పా చేస్తే, జుట్టు చాలా హెల్తీగా, నేచురల్ గా ఉంటుంది. హెయిర్ స్పా కోసం చాలామంది బ్యూటీ పార్లర్ మీద డిపెండ్ అవుతారు. కానీ ఈ హెయిర్ స్పా క్రీమ్ ను కొంచం ఇంట్రెస్ట్ చూపిస్తే ఇంట్లోనే సిద్దం చేసుకోవచ్చు. ఎలాగంటే..

ముందుగా పెరుగు, తేనె, పచ్చిపాలను తీసుకుని అన్నింటిని బాగా మిక్స్ చేయాలి. మొదట జుట్టును గాఢత తక్కువగల షాంపూతో శుభ్రం చేసుకోవాలి. జుట్టును ఆరబెట్టిన తరువాత తయారు చేసుకున్న పెరుగు మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. ఈ క్రీమ్ ను 30 నుంచి 45 నిమిషాలు ఉంచాలి. ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. దీన్ని ఇలా వీక్లీ రెండుసార్లు అప్లై చేయవచ్చు. ఇది రఫ్ గా మారిన పొడి జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది.

ఈ స్పా క్రీమ్ బెనిఫిట్స్.. తేనెలోని యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, మినరల్స్ కారణంగా ఆరోగ్యానికి అలాగే జుట్టుకు చాలా మేలు చేస్తాయి.
నిజానికి పెరుగులో ప్రోటీన్, కాల్షియం, రిబోఫ్లావిన్, విటమిన్- బి6, బి12 వంటివి ఉంటాయి. ఇవి జుట్టుకు చాలా అవసరం. కావాల్సిన పోషణను అందిస్తాయి.
పచ్చిపాలలో కాల్షియం, ఫాస్పరస్, విటమిన్-బి, డి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇందులో ప్రోటీన్లు కూడా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి, సంరక్షణకు సాయపడతాయి.