అజీర్తికి కారణాలివే..?!

Causes of indigestion: అతిగా తినడం, గ్యాస్, పొట్ట ఉబ్బరం, సరైన పోషకాహారం లేకపోవడం, ఫుడ్ పాయిజన్ తదితర కారణాల వల్ల అజీర్తి వస్తుంది. ఇది ఛాతీలో మంటను కలిగిస్తుంది. అజీర్తికి ఇవే కారణాలు కాకుండా అది ఏర్పడటానికి కారణయ్యే కారకాలు చాలానే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం:

  • దాహం లేకున్నా అతిగా నీరు తాగడం
  • అతిగా ఆహారం తీసుకోవడం
  • ఆకలేసిన్నప్పుడు తినకుండా ఉండటం,
  • ఒకదానికొకటి విరుద్ధ ఆహార పదార్థాల్ని అంటే స్వీట్ తిని కూల్ డ్రింక్, నాన్ వెజ్ తిని పాలు తాగడం లాంటివి కలిపి తినడం
  • యూరినేషన్, మోషన్ కి వెళ్లకుండా తరచూ ఆపుకోవడం
  • సకాలంలో నిద్రపోకపోవడం
  • నిద్రపోకూడని సమయాల్లో(పగలు) నిద్రపోవడం
  • పైన చెప్పిన కారణాల వల్ల జీర్ణశక్తి మెల్లిమెల్లిగా మందగిస్తుంది. అందువల్ల తేలికపాటి సాధారణ ఆహారాన్ని తీసుకున్నా కూడా శరీరానికి ఒంట బట్టదు. ఫలితంగా అజీర్తిని కలిగిస్తుంది.

అజీర్తిని ప్రేరేపించే కొన్ని మానసిక విషయాలు..
అసూయ, భయం, అమితమైన కోపం వల్ల అజీర్తి ఏర్పడుతుంది. లోభి(పిసినారి)కి నిద్రపట్టదు, ఆకలి వేయదు.
ఏదొక వ్యాధితో బాధపడేవారికి ఆకలి క్రమంగా మందగిస్తుంది. ఆర్థిక పరిస్థితి సైతం జీర్ణశక్తిని చంపేస్తుంది.
ద్వేషం. ఇతరుల అభిప్రాయాల పట్ల అసహనం, అకారణ ద్వేషం సైతం మనకు తెలియకుండానే అజీర్తిని కలిస్తాయి. ఇలాంటి మానసిక స్థితి ఉన్నవారు టైంకి తిన్నా.. జీర్ణంకాదు. కాబట్టి వీటిని గమనించుకొని జాగ్రత్త పడటం మేలు. Causes of indigestion.

Also Read: https://www.mega9tv.com/life-style/do-you-often-catch-colds-check-your-lifestyle-with-this-cold-side-effects-information/