థైరాయిడ్ నియంత్రణకు.. కాస్త సెలీనియం!

శరీరానికి సెలీనియం అనేది చాలా ముఖ్యం. ఇది థైరాయిడ్ ను నియత్రించేందుకు, రోగనిరోధక శక్తిని పెంచేందుకు, సెల్ రిపేరింగ్ లో సాయపడుతుంది. అటువంటి ఈ సూక్ష్మ పోషకం వల్ల కలిగే ప్రయోజనాలు వింటే ఆశ్చర్యపోతారు. థైరాయిడ్ గ్రంథి మెటబాలిజం, శక్తి స్థాయిలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.


ఈ ట్రేస్ మినరల్ మన శరీరంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూనే కణాలను దెబ్బతీసే ఫ్రీరాడికల్స్ నుంచి ఎఫెక్ట్ అవ్వకుండా రక్షిస్తుంది. థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచడంలో దోహదపడుతుంది.

  • సెలీనియం గ్లూటాథియోన్ పెరాక్సిడేస్ వంటి ఎంజైమ్‌ల ఉత్పత్తికి సహాయపడుతుంది. ఇవి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు. ఇవి ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గిస్తాయి. గుండె జబ్బులు, క్యాన్సర్, అల్జీమర్స్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
  • థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి, వాటి మార్పిడికి ఉపయోగపడుతుంది.
  • సెలీనియం రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది శరీరాన్ని ఇన్ఫెక్షన్లు, వ్యాధుల బారినపడకుండా రక్షిస్తుంది. తెల్లరక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.
  • పురుషులలో స్పెర్మ్ క్వాలిటీ, క్వాంటీటికి సెలీనియం ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఇక మహిళల్లో ఆరోగ్యకరమైన గర్భధారణకు కూడా ఇది అవసరం.

ఎందులో ఉంటాయంటే..

  • ఒకే ఒక్క బ్రెజిల్ నట్, వారానికి 2-3 బ్రెజిల్ నట్స్ తీసుకుంటే చాలు.
  • ట్యూనా చేపలో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. సాల్మన్ , కాడ్ , హెరింగ్, మాకెరల్ వంటి చేపలు కూడా సెలీనియంకు మంచి వనరులు.
  • వైట్ రైస్ లో కంటే బ్రౌన్ రైస్‌లో సెలీనియం ఎక్కువ.
  • ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో తీసుకునే ఓట్స్, పప్పుధాన్యాల్లో కూడా సెలీనియం లభిస్తుంది.