ఎమర్జెన్సీ.. నేటికీ 50 ఏళ్లు పూర్తి!

50 Years for emergency: 1975 జూన్‌ 25..
దేశంలో నాటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ విధించిన 21 నెలల అత్యయిత పరిస్థితి ప్రారంభమైన రోజు. సరిగ్గా నేటికి 50 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆ చీకటి అధ్యాయం నేటికీ స్వతంత్ర భారతాన్ని వెంటాడుతూనే ఉంది. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌ ఇందిరాగాంధీ హయాంలో ఓ 21 నెలల పాటు అంధయుగాన్ని చవిచూసింది. ప్రసార మాధ్యమాల గొంతు నొక్కడంతోపాటు రాజకీయ ప్రత్యర్థులను, పాత్రికేయులను జైళ్లలో వేసిన ఉదంతమది.

తమ హక్కులకు భంగం వాటిల్లితే న్యాయస్థానాలను ఆశ్రయించే స్వేచ్ఛ పౌరులకు లేకుండా హరించివేసిన చీకటి రోజులవి. ఇందిర తనయుడు సంజయ్‌ గాంధీ దుందుడుకు చర్యలతో పెట్రేగిపోయి అమలు చేసిన నిర్బంధ కుటుంబ నియంత్రణ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. పేద కుటుంబాల వారిని ఇళ్లలోంచి బయటకు లాగి మరీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. అవి వికటించి కొందరు అసువులుబాశారు. ఎమర్జెన్సీ కాలంలో ఇందిర నిరంకుశ పాలన దేశ ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టించింది.

దేశంలో రాష్ట్రపతి ఎమర్జెన్సీ విధించిన సమయంలో భయపడాల్సిన పని లేదని ఇందిరా గాంధీ అదే రోజున ఆల్‌ ఇండియా రేడియోలో చెప్పింది. ఆమె మాటలు భారత ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేశాయి. అదే సమయంలో భారతదేశ ప్రజాస్వామిక చరిత్రలో చెరిగిపోని చేదు జ్ఞాపకాలకు కూడా అప్పుడే అంకురార్పణ జరిగింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ సూచన మేరకు ఆనాటి రాష్ట్రపతి ఫఖ్రుద్దీన్‌ అలీ అహ్మద్‌ రాజ్యాంగంలోని 352 అధికరణ కింద దేశవ్యాప్తంగా అత్యయిక స్థితిని విధించారు. ఆ స్థితి 1977 మార్చి 21 వరకు 21 నెలలపాటు కొనసాగింది. ఎమర్జెన్సీ కాలంలో జరిగిన ఘోరాలు, రాజ్యాంగ ఉల్లంఘనలు, ప్రజాస్వామిక విలువల పాతరను పురస్కరించుకుని జూన్‌ 25వ తేదీని రాజ్యాంగ హత్య దినం(సంవిధాన్‌ హత్య దివస్‌)గా పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వం నిర్ణయించింది. దేశ పౌరులు తమ హక్కులు కోల్పోయారు. రాజకీయ నాయకులు, నిరసనకారులు జైలు పాలయ్యారు. పత్రికా స్వేచ్ఛ కనుమరుగైంది. ఒకే వ్యక్తి చేతిలో అధికారం బందీ అయింది. ఆ వ్యక్తే ఇందిరాగాంధీ. ఆమె ఇష్టానుసారం నిబంధనలు మారిపోయాయి. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. జయప్రకాశ్‌ నారాయణ్‌, మొరార్జీ దేశాయ్‌, అటల్‌ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ, మధు దండావతె, జార్జి ఫెర్నాండేజ్‌ వంటి రాజకీయ ప్రముఖులు సైతం జైలు పాలయ్యారు. 50 Years for emergency.

1971లో రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభకు పోటీచేసిన ఇందిరాగాంధీ ఆ ఎన్నికల్లో అవినీతికి పాల్పడ్డారన్న కారణంతో 1975లో అలహాబాద్‌ హైకోర్టు ఆమెను ప్రధాని పదవికి అనర్హురాలిగా తేల్చింది. ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆరేళ్లపాటు నిషేధం విధించింది. ప్రధాని పీఠాన్ని విడిచిపెట్టడం ఇష్టంలేని ఇందిర.. అంతకుముందు ఎప్పుడూ ఉపయోగించని ‘అత్యయిక స్థితి’ని విధించారు. దీంతో పౌరుల అన్ని ప్రాథమిక హక్కులు, పత్రికాస్వేచ్ఛ ఎమర్జెన్సీలో ఆకృత్యాలు, బలవంతపు కుటుంబ నియంత్రణ చికిత్సలు, మురికివాడల్లో ఇళ్ల తొలగింపు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలను అణిచివేయడం, నాయకుల అక్రమ అరెస్టులు, లాఠీచార్జీలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేయాలని సర్కారు ఉద్యోగులకు టార్గెట్లు.. లేకపోతే తొలగింపు, వేతనం కోత లాంటివి చోటు చేసుకున్నాయి.

ప్రధాన కారణాలు..

  • 1973లో ఫీజుల పెంపు కారణంగా గుజరాత్‌వ్యాప్తంగా విద్యార్థుల నిరసనలకు పాల్పడ్డారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చిమన్‌భాయ్‌ పటేల్‌పై చిమన్‌ చోర్‌ అనే ముద్ర పడింది. దీంతో 1974 ఫిబ్రవరిలో గుజరాత్‌ ప్రభుత్వాన్ని రద్దు చేసిన ఇందిరాగాంధీ రాష్ట్రపతి పాలన విధించింది.
  • బీహార్‌ సీఎం అబ్దుల్‌ గఫూర్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న విద్యార్థి ఉద్యమంలో గాంధేయవాది జయప్రకాశ్‌ నారాయణ్‌ (జేపీ) చేరారు. ఈ ఉద్యమం లాలూ ప్రసాద్‌ యాదవ్‌, నితీష్‌ కుమార్‌ వంటి భావి నాయకులను సృష్టించిందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సంపూర్ణ క్రాంతి (సంపూర్ణ విప్లవం), ఇందిరాగాంధీ తొలగింపునకు జేపీ పిలుపునిచ్చారు.
  • కార్మిక నాయకుడిగా పేరుగాంచిన జార్జి ఫెర్నాండేజ్‌ సారథ్యంలో 1974లో పెద్దఎత్తున రైల్వే సమ్మె జరిగింది. దేశవ్యాప్తంగా ఎక్కడి రైళ్లు అక్కడే ఆగిపోయాయి. అదే సమయంలో ఆనాటి రైల్వే మంత్రి, బీహార్‌ ఎంపీ ఎల్‌ఎన్‌ మిశ్రా బాంబు దాడిలో మరణించడంతో తీవ్ర స్థాయిలో ఉద్రిక్తతలు చెలరేగాయి.
  • ఎన్నికల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సోషలిస్టు నాయకుడు రాజ్‌ నారాయణ్‌ 1971లో ఇందిరాగాంధీ గెలుపును అలహాబాద్‌ హైకోర్టులో సవాలు చేశారు. 1975 జూన్‌ 12న ఇందిరని దోషిగా తేల్చిన జస్టిస్‌ జగ్‌ మోహన్‌లాల్‌ సిన్హా ఆమె ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చారు. అదే సమయంలో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమి పాలైంది. జూన్‌ 24న ఇందిర ఎన్నికపై అలహాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై షరతులతో కూడిన స్టే మంజూరు చేసిన సుప్రీంకోర్టు ఓటింగ్‌ హక్కులు లేకుండా ఆమె ప్రధానిగా కొనసాగడానికి అనుమతినిచ్చింది.
  • 1975 జూన్‌ 25న జేపీ నారాయణ్‌, మొరార్జీ దేశాయ్‌ తో పాటు ఇతర నాయకులు ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ర్యాలీ నిర్వహించి రాజ్యాంగ వ్యతిరేక ఉత్తర్వులను ధిక్కరించాలని పోలీసులు, సైన్యానికి పిలుపునిచ్చారు. అదేరోజు రాత్రి తన కుమారుడు సంజయ్‌ గాంధీతో కలసి దేశంలో ఎమర్జెన్సీ విధించాలని ఇందిరాగాంధీ నిర్ణయించారు. మరుసటి రోజు ఉదయం నుంచి 21 నెలలు అమల్లో ఉంది.

క్లుప్తంగా..
ప్రజాస్వామ్యంలో ప్రజలు, న్యాయస్థానాలు తన అధికారాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు.. ప్రతికూల నిర్ణయాలు వెలువడుతున్నప్పుడు ఇందిరాగాంధీ ప్రయోగించిన చివరి అస్త్రమే ఎమర్జెన్సీ.
1966-77ల మధ్యకాలంలో రెండు కీలక పరిణామాలు జరిగాయి.
అందులో మొదటిది, పాకిస్థాన్ పై భారత్ యుద్ధంలో గెలవడం. ఆ యుద్ధంలో పాకిస్థాన్ పై భారత్ గెలిచింది. బంగ్లాదేశ్ ఏర్పడటంలో ఇందిరాగాంధీ ప్రముఖ పాత్ర పోషించింది.
1977లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇందిరా గాంధీ గెలిచింది. కానీ ఓటర్లకు డబ్బులిచ్చి ఓటు వేయించుకున్నారనే ఆరోపణతో రాజ్ నారాయణ్, ఇందిరాగాంధీ పైన హైకోర్టులో కేసు వేశాడు.
1975లో దీనిపై తీర్పు వచ్చింది. 6 సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆ తీర్పు సారాంశం. అప్పుడు ఇందిరాగాంధీ తీర్పును సుప్రీంకోర్టులో ఆప్పియల్ వేసింది.
అనంతరం ఇందిరాగాంధీని పీఎంగా కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు చెప్పింది.
1975లో ఎమర్జెన్సీని స్పష్టం చేసింది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ అపోజిషన్ పార్టీ తరఫువాళ్లు బంద్ లు పాటించారు. ఇలా చేయడంవల్ల ప్రభుత్వానికి ఆదాయం లేదు. అందుకనీ ఎమర్జెన్సీని ప్రకటించింది. అంటే దేశమంతా పీఎం చేతిలోకి వచ్చింది.
ఇదిలా ఉండగా, పంజాబ్ లో సిక్కు మతానికి చెందిన బృందన్వలె అనే వ్యక్తి హిందూవులను చంపుతూ పోతున్నాడు. కారణం సిక్కులకు కాళిస్తాన్ అనే పేరుతో ప్రత్యేక దేశం కావాలని ప్రభుత్వాన్ని కోరాడు. అది సాధ్యం కాకపోవడంతో 1984లో సిక్కులు చాలామంది హిందూవులను చంపారు. అరెస్టు చేయడానికి వీలు లేకుండా వెళ్లి గోల్డెన్ టెంపుల్ లో దాక్కున్నాడు. ఆ టెంపుల్ లో ఉంటూ, పాకిస్థాన్ నుంచి ఆయుధాలను తెప్పించుకునేవారు.
అప్పుడు ఇందిరాగాంధీ ఇండియన్ మిలటరీని గోల్డెన్ టెంపుల్ కి పంపించింది. అప్పుడు మిలటరీ వాళ్లతో ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసింది. దాని పేరే ఆపరేషన్ బ్లూస్టార్.
జూన్ 5న గోల్డెన్ టెంపుల్ ను చుట్టుముట్టి బాంబులు, హెవీ గన్ లతో దాడి చేశారు. ఈ ఆపరేషన్ 1984 జూన్10న ముగిసింది.
ఇందులో 83 మంది సైనికులు, 493 మంది మిలిటెన్స్ చనిపోయారు. అందుకనీ దానికి ప్రతిగా కక్ష గట్టి, ఇందిరాగాంధీని ఆ ఇద్దరూ సిక్కు బాడీగార్డులే కాల్చి చంపేశారని తర్వాత చోటు చేసుకున్న పరిణామాల వల్ల అవగతమవుతుంది.

1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోరమైన ఓటమిని చవిచూసింది. మోరార్జీ దేశాయ్‌ నేతృత్వంలోని జనతా పార్టీ విజయం సాధించింది. కేంద్రంలో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం, తొలి కాంగ్రెసేతర ప్రధాని కొలువుదీరారు.

Also Read: https://www.mega9tv.com/national/the-strait-of-hormuz-concerns-around-the-world-amid-iran-israel-war-tensions/