ఈ ఏడాది వరుస ఎన్ కౌంటర్లు..!

A series of encounters: భారత్ లో మావోయిస్టులకు ఇదే చివరి ఏడాదా..? ఒక వచ్చే సంవత్సరం నుంచి మన దేశంలో మావోయిస్టులు అనే పేరే వినపడదా..? ఇప్పటికే ఆపరేషన్ కగార్ తో మావోయిస్టులకు పెద్ద దెబ్బ తగిలింది.. కీలక నేతలు ఎన్ కౌంటర్ లో చనిపోయారు. ఇప్పుడు వర్షాకాలంలో కూడా బ్రేక్ పడకుండా ఆపరేషన్ కగార్ కొనసాగిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తేల్చి చెప్పేశారు. దీంతో మావోయిస్టుల పరిస్థితి ఏంటి..? లొంగిపోవడమా..? లేక ప్రాణాలు వదులుకోవడమా..? మరోవైపు మావోయిస్టుల దాడులపై అమెరికా ఎలాంటి హెచ్చరికలు జారీ చేసింది..?

2025 మావోయిస్టులకు ఒక బేడ్ ఇయర్ అనే చెప్పాలి.. వరుస ఎన్ కౌంటర్లతో మావోయిస్టు కీలక నేతలు చనిపోయారు. ఈ ఎన్ కౌంటర్లు ఇలానే కొనసాగే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అటు ఛత్తీస్‌గఢ్‌లోని నవ రాయ్‌పూర్‌లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా మావోయిస్టుల ఏరివేతపై కీలక ప్రకటన చేశారు. ఇప్పటిదాకా వర్షాకాలంలో మావోయిస్టులు రెస్ట్ తీసుకునేవాళ్లు, కానీ ఈసారి వాళ్లకు నిద్ర లేకుండా చేస్తాం. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టులను పూర్తిగా అంతం చేస్తాం, అని గట్టిగా చెప్పారు. వర్షాకాలంలో దట్టమైన అడవులు, నదులు మావోయిస్టులకు రక్షణగా ఉండేవి. కానీ, ఇప్పుడు సెక్యూరిటీ ఫోర్సెస్ ఆ గ్యాప్‌ను క్లోజ్ చేస్తున్నాయి. షా మావోయిస్టులతో ఎలాంటి చర్చలూ ఉండవని, ఆయుధాలు వదిలి సరెండర్ కావాలని చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో సరెండర్ అయిన వాళ్లకు రిహాబిలిటేషన్ పాలసీ కింద ఉద్యోగాలు, ఇళ్లు, భూమి ఇస్తున్నారు. ఈ స్టేట్‌మెంట్ ద్వారా షా భద్రతా దళాలకుకు బూస్ట్ ఇచ్చారు, మావోయిస్టులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

2025 ఏడాది మావోయిస్టులకు బిగ్ షాక్ ఇచ్చిన సంవత్సరం. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, బీజాపూర్, నారాయణపూర్ ప్రాంతాల్లో సెక్యూరిటీ ఫోర్సెస్ దాడులు తీవ్రమయ్యాయి. మే 21న బస్తర్‌లో జరిగిన ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్‌లో మావోయిస్టు కీలక నేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతో పాటు 27 మంది మావోయిస్టులు ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. బసవరాజు రూ.1.5 కోట్ల రివార్డ్ ఉన్న కీలక నాయకుడు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు ఛత్తీస్‌గఢ్‌లో 400 మందికి పైగా మావోయిస్టులు ఎన్‌కౌంటర్లలో చనిపోయారు, 1000 మంది అరెస్ట్ అయ్యారు, 837 మంది సరెండర్ అయ్యారు. ఫిబ్రవరి 9న బీజాపూర్‌లో 31 మంది, మార్చ్ 20న 30 మంది, ఏప్రిల్ 2న 13 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ దాడుల్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో BJP ప్రభుత్వం వచ్చాక, భద్రతా బలగాలు, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్, బస్తర్ ఫైటర్స్ కలిసి ఆపరేషన్స్ వేగవంతం చేశారు. మావోయిస్టుల ఫైనాన్స్ నెట్‌వర్క్‌ను NIA, ED కలిసి బ్లాక్ చేశాయి. ఈ దెబ్బలతో మావోయిస్టుల బలం, నాయకత్వం బాగా డౌన్ అయింది. A series of encounters.

మావోయిస్టుల ప్రభావం ఒకప్పుడు దేశంలోని 10 రాష్ట్రాల్లో, 106 జిల్లాల్లో ఉండేది. కానీ, 2014 నుంచి మోదీ ప్రభుత్వం వచ్చాక ఈ సంఖ్య బాగా తగ్గింది. 2024 నాటికి మావోయిస్టు ప్రభావిత జిల్లాలు 38కి, 2025 ఏప్రిల్ నాటికి కేవలం 18కి తగ్గాయి. ఇందులో అత్యంత ప్రభావిత జిల్లాలు 12 నుంచి 6కి దిగొచ్చాయి. ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పుడు కేవలం రెండు జిల్లాలు మాత్రమే మావోయిస్టు ప్రభావంలో ఉన్నాయి. బిహార్, జార్ఖండ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో మావోయిస్టు ప్రభావం దాదాపు అంతమైంది. 2010లో 1,936 మావోయిస్టు ఘటనలు నమోదైతే, 2024లో అవి 374కి పడిపోయాయి, అంటే 81% తగ్గాయి. సెక్యూరిటీ ఫోర్సెస్, సివిలియన్స్ మరణాలు 2010లో 1,005 ఉంటే, 2024లో 131కి తగ్గాయి. 2019 నుంచి 277 కొత్త సెక్యూరిటీ క్యాంపులు ఏర్పాటు చేశారు, ఇవి మావోయిస్టుల బలగాలను కట్టడి చేశాయి. గత ఏడాది 149 మావోయిస్టులు చనిపోయారు, 569 మంది అరెస్ట్ అయ్యారు, 540 మంది సరెండర్ చేశారు. ఈ సంఖ్యలు చూస్తే, మావోయిస్టుల పట్టు బాగా సన్నగిల్లినట్టు కనిపిస్తోంది.

2026 మార్చి నాటికి మావోయిస్టులు పూర్తిగా అంతమవుతారా? 98% పోలీస్ స్టేషన్లలో ఏడాది పొడవునా ఒక్క మావోయిస్టు ఘటన కూడా లేకపోతే, ఆ ప్రాంతాన్ని మావోయిస్ట్ ఫ్రీ జోన్‌గా ప్రకటిస్తాం అని అమిత్ షా తెలిపారు. ఈ టార్గెట్‌కు భద్రతా దళాలు దగ్గరగా వెళ్తున్నాయి. మావోయిస్టుల నాయకత్వం దెబ్బతినడం, ఫైనాన్స్ నెట్‌వర్క్ కుప్పకూలడం, సరెండర్ల సంఖ్య పెరగడం వల్ల వాళ్ల బలం బాగా తగ్గింది. అయితే, మావోయిస్టు ఉద్యమం పేదరికం, ఆదివాసీల సమస్యలు, అసమానతల నుంచి పుట్టింది. ఈ సమస్యలు పూర్తిగా పరిష్కారం కాకపోతే, భవిష్యత్తులో మళ్లీ ఉద్యమం లేచే అవకాశం ఉంది. ప్రభుత్వం దీన్ని అర్థం చేసుకుని, ఆపరేషన్స్ తో పాటు ఆదివాసీ ప్రాంతాల్లో స్కూళ్లు, ఆస్పత్రులు, రోడ్లు, ఉద్యోగాలు ఇచ్చే పథకాలపై ఫోకస్ చేస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో బస్తరియా బెటాలియన్‌లో 1,143 మంది ఆదివాసీ యూత్‌ను రిక్రూట్ చేశారు, 6,500 పోలీస్ ఉద్యోగాల భర్తీ ప్రాసెస్ జరుగుతోంది. 2026 నాటికి మావోయిస్టు ఉనికి దాదాపు అంతమయ్యే అవకాశం ఉంది, కానీ దీర్ఘకాలంలో ఈ సమస్య మళ్లీ రాకుండా డెవలప్‌మెంట్, సెక్యూరిటీ కలిసి పనిచేయాలి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఆపరేషన్ కగార్ ఉదృతంగా కొనసాగుతున్న తరుణంలో భారత్ లోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని అమెరికా హెచ్చరించింది. ముఖ్యంగా నగరాలను దాటి ఏజెన్సీ లేదా ఇతర పట్టాణాలకు వెళ్తే తప్పనిసరిగా సమాచారం అందించాలని తెలిపింది. అటు కొన్ని ప్రాంతాల్లో మావోయిస్టులు దాడులు చేసే అవకాశం కూడా ఉందని హెచ్చరించింది అమెరికా.

Also Read: https://www.mega9tv.com/national/indias-focus-on-indigenous-weapons-and-india-is-building-its-own-military-power/