అంతరిక్షంలో శుభాన్షు శుక్లా..!

Axiom-4 Mission Launch: భారతదేశ అంతరిక్ష చరిత్రలో మరో సువర్ణాధ్యాయం లిఖించబడింది. సుమారు నాలుగు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అంతరిక్షంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ చరిత్రాత్మక ఘట్టం కోసం యావత్ భారతదేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.

శుభాన్షు శుక్లా, మరో ముగ్గురు అంతర్జాతీయ వ్యోమగాములతో కలిసి స్పేస్‌ఎక్స్ వ్యోమనౌకలో ఈరోజు మధ్యాహ్నం 12:01 గంటలకు అంతరిక్షయానం ప్రారంభించనున్నారు. వ్యోమనౌకలో పూర్తి సన్నద్ధతతో ఉన్న శుక్లా, ఇతర సిబ్బంది కనిపిస్తున్నారు. Axiom-4 Mission Launch.

సుదీర్ఘ నీరిక్షణ అనంతరం…తొలిసారిగా భారత వ్యోమగామి శుభాంశు శుక్లా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు బయల్దేరారు. గత 25 ఏళ్లుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు 270 మందికి పైగా ఆస్ట్రోనాట్స్ వెళ్లారు. కానీ వారిలో ఒక్కరు కూడా భారతీయులు లేరు. భారతీయ మూలాలు ఉన్న సునీత విలియమ్స్ ISSకి వెళ్లినా ఆమెఇండియాలో పుట్టి పెరగలేదు. దీంతో ఆ ఘనతను ఫస్ట్ టైమ్ శుభాంశు శుక్లా సాధించబోతున్నారు. ఆక్సియం 4 మిషన్ లో భాగంగా తనతో పాటు శుభాంశు మరో ముగ్గురు వ్యోమగాములను స్పేస్ కు తీసుకెళ్తున్నారు. సరిగ్గా ఇవాళ 12 గంటలకు 28వేల కిలో మీటర్ల వేగంతో..భూమికి 400 కిలో మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తూ ఫాల్కన్‌ 9 రాకెట్‌ …ఐఎస్ఎస్ వైపు దూసుకెళ్తోంది. అయితే ఈ రాకెట్ స్పేస్ స్టేషన్ కు చేరాలంటే దాదాపు 28 గంటల సమయం పడుతుందని తెలుస్తోంది. అసలు స్పేస్ స్టేషన్ కు వెళ్లేందుకు అంత సమయం ఎందుకు పడుతోంది? శుభాంశు శుక్లా స్పేస్ లో ఎన్ని రోజులు ఉండబోతున్నారు? అక్కడ ఏం చేయబోతున్నారు? ఈ మిషన్ తో భారత్‌కు కలిగే ప్రయోజనాలేంటి? లెట్స్ వాచ్ దిస్ వీడియో.

ఆక్సియం 4 మిషన్ లో భాగంగా ఫ్లోరిడాలోని నాసా కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా ప్లస్ తన టీమ్ తో కలిసి స్పేస్ జర్నీని మొదలుపెట్టారు. ఈ మిషన్‌కు శుభాన్షు శుక్లా గ్రూప్ కెప్టెన్‌గా ఉన్నారు. వాస్తవానికి ఈ మిషన్ మే 28న స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోండంతో మూడుసార్లు..రాకెట్ లో ఫ్యుయెల్ ట్యాంక్ లో లీకేజీతో మరోసారి వాయిదా పడుతూ వచ్చింది. అలా వాయిదా పడుతూ వస్తున్న ఈ మిషన్ ఎట్టకేలకు ఇవాళ స్టార్ట్ అయ్యింది. ఫాల్కన్ 9 రాకెట్ విజయవంతంగా అంతరిక్షంలోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం వ్యోమనౌక భూకక్ష్యలోకి ప్రవేశించి అక్కడ ప్రయాణిస్తోంది. ఈ ప్రయోగం కనుక విజయవంతమైతే.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి భారతీయుడిగా శుభాంశు చరిత్రలో నిలిచిపోతారు.

స్పేస్ ఎక్స్ ప్రయోగిస్తున్న ఈ ఫాల్కన్ 9 రాకెట్ చాలా శక్తిమంతమైనది. ఇది గంటకు 28 వేల కిలోమీటర్లకు పైగా వేగంతో ప్రయాణించగలదు. యాక్సియం 4 మిషన్ అంతరిక్షంలో… లో-ఎర్త్ ఆర్బిట్‌లో భూమికి సుమారుగా 370 నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌కు చేరుకోవాలంటే… సరిగ్గా 28 గంటల సమయం పడుతుంది. అంటే ఇవాళ బయల్దేరిన ఈ రాకెట్ జూన్ 26న సాయంత్రం 5 గంటలకు ISS తో అనుసంధానం అవుతుంది.

అయితే గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రాకెట్ 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటర్నేషనల్ స్పేష్ స్టేషన్ కు వెళ్లేందుకు ఎందుకు 28 గంటల సమయం పడుతుంది అంటే..నార్మల్ గా మనకు తెలిసిన మ్యాథ్స్ ప్రకారం ఒక కారు గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే…అది 400 కిలోమీటర్ల దూరాన్ని చేరుకోవడానికి నాలుగు గంటల సమయం పడుతుంది.అయితే ఈ లెక్కలు అంతరిక్ష ప్రయాణాలకు వర్కౌట్ కావు. ఎందుకంటే నేల మీద ఒక చోటు నుంచి మరొక చోటుకు వెళ్లాలంటే రెండు ప్రదేశాలు స్థిరంగానే ఉంటాయి. అందుకే వాటి మధ్య దూరం మారదు. కానీ అంతరిక్షంలో అలా కాదు. యూనివర్స్ లో ఏ ఖగోళ పదార్థం కూడా స్టేబుల్ గా ఉండదు. అది ఒక నిర్ణీత ఆర్బిట్ లో రొటేట్ అవుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సూర్యుడి చుట్టూ గ్రహాలు..గ్రహాల చుట్టూ ఉపగ్రహాలు.. వాటి చుట్టూ ఆస్టరాయిడ్లు ఇలా నిత్యం ఒకదాని చుట్టు ఒకటి తిరుగుతూనే ఉంటాయి. ఇలా జరక్కపోతే ఆ గ్రహాలు గురుత్వాకర్షణకు లోనై మరొకదానిని ఢీకొంటాయి. ఇదే ప్రిన్సిపల్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి కూడా వర్తిస్తుంది. ISS కూడా స్పేస్ లో లో-ఎర్త్ ఆర్బిట్‌లో భూమి చుట్టూ గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో రొటేట్ అవుతూ ఉంటుంది. అంత వేగంతో ఇది రొటేట్ కాకపోతే..ఎర్త్ గ్రావిటీకి లోనై భూమి మీద పడిపోతుంది. అందుకే ISS ను భూమి చుట్టూ స్థిర వేగంతో తిరిగే కక్ష్యలో ఉండేలా ప్రవేశపెట్టారు.

ఫాల్కన్ 9 రాకెట్ ఎస్కేప్ వెలాసిటీ వేగంతో ప్రయాణిస్తూ భూ వాతావరణం నుంచి స్పేస్ లోనికి వెళ్తుంది. అయితే ఈ మార్గం పారాబోలా ఆకారంలో ఉంటుంది. రాకెట్ ఎర్త్ గ్రావిటీ పరిధి దాటి వెళ్లిన తర్వాత. ..సెకెండ్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. రాకెట్ లాంచ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఇది జరుగిపోతుంది. అయితే ఎర్త్ గ్రావిటీ పరిధి దాటి వెళ్లడానికి మాత్రం భారీగా ఇంధనం ఖర్చవుతుంది. వన్స్ స్పేస్ లో ఎంటరయ్యాక శూన్యంలో చాలా తక్కువ ఇంధనంతో , వేగంగా రాకెట్ ప్రయాణిస్తుంది. ఇక రెండో దశలో మొదటి దశతో పోలిస్తే రాకెట్ పరిమాణం చిన్నగా ఉంటంది. సెకెండ్ స్టేజ్ లోనే ఆర్బిటల్ ఇన్సర్షన్ చెయ్యాలి. రాకెట్ ISS దగ్గరగా వెళ్లేందుకు అవసరమైన స్పీడ్ ను హైట్ ను అడ్జస్ట్ చేసుకుని అది రొటేట్ అయ్యే కక్షలోకి ప్రవేశించాలి. ఇలా ఒకసారి ఆర్బిటల్ ఇన్సర్షన్ జరిగిన తర్వాత ఆ స్పేస్ క్రాఫ్ట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కక్ష్యలోకి ప్రవేశించేందుకు వీలుగా భూమి చుట్టూ తిరుగుతూనే తన వేగాన్ని, దిశను, కక్ష్యా మార్గాన్ని మార్చుకుంటూ వెళ్తుంది. ఇదంతా రాకెట్ లోని ఆన్ బోర్డ్ నేవిగేషన్ సిస్టమ్ చూసుకుంటుంది. రాకెట్ సరైన డైరెక్షన్ లో వెళ్లేలా మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్, మిషన్ పైలట్ శుభాన్షు శుక్లా తమ ముందున్న మానిటర్లలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటారు.ఇలా నిమిషాల వ్యవధిలో ఫస్ట్ స్టేజ్ పూర్తయినా.. సెకండ్ స్టేజ్ కంప్లీట్ కావడానికి మాత్రం 23 నుంచి 25 గంటల సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇప్పటి వరకు నాసా రిలీజ్ చేసిన వీడియోల్లో స్పేస్ లో ISS చాలా నెమ్మదిగా కదులుతున్నట్లు కనిపిస్తుంది. కానీ వాస్తవానికి అది గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతుందట . అంటే ఇప్పుడు ఫాల్కన్ 9 రాకెట్ కూడా తనలోని క్యాప్సూల్… ISSతో డాకింగ్ కావాలంటే అంతే వేగంతో అదే మార్గంలో కదులుతూ వెళ్లాలి. అప్పుడే అవి రెండూ ఒకదాని వెనుక ఒకటి ప్రయాణిస్తాయి.. స్టేబుల్ గా ఉన్నట్లు కనిపిస్తాయి. కానీ అవి రెండూ గంటకు 28 వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంటాయి. అందుకే స్పేస్ ఎక్స్ క్యాప్సూల్ ISS కక్ష్యలోకి ప్రవేశించిన తర్వాత, పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే దానితో డాకింగ్ అయ్యేందుకు రెండు మూడు గంటల సమయం పడుతుంది. డాకింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయినా క్యాప్సూల్, ISS తలుపులు వెంటనే తెరుచుకోవు. రెండింటిలో ఎయిర్ ప్రెజర్ ఈక్వెల్ లెవెల్ కి వచ్చాక, గాలి బయటకు వెళ్లకుండా ఎయిర్ టైట్ సీల్ చేసిన తర్వాతే రెండింటి మధ్య ఉన్న తలుపులు తెరుచుకుంటాయి. అప్పుడు క్యాప్సూల్‌లోని వ్యోమగాములు ISSలోకి ఎంటరవ్వడంతో డాకింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది.

అమెరికాకు చెందిన యాక్సియం స్పేస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మిషన్ తో భారత్‌కు ఏం ప్రయోజనమంటే..ఈ మిషన్ ద్వారా శుభాంశు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 14 రోజుల పాటు అనేక శాస్త్రీయ ప్రయోగాలు చేస్తారు. మైక్రోగ్రావిటీలో కండరాల నష్టం, పంటల సాగు, వాటర్ బేర్స్ జీవన విధానం, కంప్యూటర్ స్క్రీన్‌ల ప్రభావం వంటి అంశాలపై శుభాంశు ప్రయోగాలు నిర్వహిస్తారు. ఇవి ఆరోగ్యం, వ్యవసాయం, జీవశాస్త్ర రంగాల్లో కొత్త అవగాహనను తీసుకువస్తాయని నిపుణులు అంటున్నారు. అంతే కాదు ఈ మిషన్ ద్వారా భారత గగన్‌యాన్ మిషన్‌కు అవసరమైన అనుభవాన్ని పొందవచ్చంటున్నారు. నాసా, యాక్సియం స్పేస్ వంటి ఇంటర్నేషనల్ కంపెనీలతో కలిసి పనిచేయడం వల్ల ఇస్రోకు ప్రాముఖ్యత పెరుగుతుంది. ఇది భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుంది.

1984లో రాకేశ్ శర్మ తర్వాత అంటే 41 ఏళ్ల తర్వాత మళ్లీ ఒక భారతీయుడు అంతరిక్షంలోకి వెళ్లడం భారత యువతలో శాస్త్రవేత్తల పట్ల ఆసక్తిని పెంచుతుంది. ఇది దేశంలో స్పేస్ సైన్స్‌కు బలమైన ప్రోత్సాహం అవుతుంది.కోట్లాది మంది భారతీయుల ఆకాంక్షలను మోసుకుంటూ రోదసిలోకి శుభాంశు శుక్లాకు అందరూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.యాక్సియం మిషన్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నారు.

Also Read: https://www.mega9tv.com/national/50-years-for-emergency-indian-democracy-1975-crisis/