బీజేపీ జాతీయ అధ్యక్ష పీఠంపై మహిళ?

BJP national president: కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం దక్కించుకోవడంతోపాటు దేశంలో సగానికిపైగా రాష్ట్రాల్లో అధికారం చేలాయిస్తున్న బీజేపీ పార్టీని మరింతగా విస్తరించేందుకు సిద్ధమవుతున్నది. మరోసారి ఢీల్లీ పీఠాన్ని దక్కించుకోవడం, విపక్షాల ఏలుబడిలో ఉన్న ఆ ఐదారు రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకోవడానికి కాషాయ దళం ప్రణాళికలు రచిస్తున్నది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరు అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే మారింది. ఎప్పుడెప్పుడు జాతీయ అధ్యక్షుడి పేరును ప్రకటిస్తారా అనేదానిపై పార్టీ కార్యకర్తలు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా దీనికి సంబంధించి ఓ కీలక అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. బీజేపీ హైకమాండ్‌ జాతీయ అధ్యక్ష పదవిని మహిళా నేతకు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణాది రాష్ట్రాల్లో తమ బలం పెంచుకునేందుకు ఇక్కడి మహిళా నేతనే ఎన్నుకోనున్నట్లు తెలుస్తోంది. ఇంతకు ఆ ముగ్గురు మహిళా నేతలు ఎవరో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ నౌ.

వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారాన్నికైవసం చేసుకోవడమే కాకుండా, దేశంలోని సగానికిపైగా రాష్ట్రాల్లో సొంత పాలనను కొనసాగిస్తున్న భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఇప్పుడు తన సంఘటనా నిర్మాణంను మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది.మళ్ళీ ఢిల్లీ పీఠాన్ని సంపాదించడమే కాక, ప్రస్తుతం విపక్షాల చేతిలో ఉన్న ఐదు నుండి ఆరు రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకోవాలనే వ్యూహంతో పార్టీ ముందుకు సాగుతోంది.గత ఎన్నికల విజయాల్లో మహిళల పాత్ర ఎంతో కీలకమని గుర్తించిన కమలం పార్టీ,వారి మద్దతును గట్టిగా నిలుపుకోవాలన్న ఆలోచనతో పలు చర్యలు ప్రారంభించింది.ఇందులో భాగంగా పార్టీ జాతీయ అధ్యక్ష పీఠాన్ని ఓ మహిళకు కట్టబెట్టాలన్న ఆలోచనపై బీజేపీ లోనుఆలోచనలు నడుస్తున్నాయి.

ఈ ప్రతిపాదనకు ఆర్‌ఎస్‌ఎస్ కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం.
ఇక ఈ రేసులో ముగ్గురు ప్రధానంగా పోటీలో ఉన్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఏపీ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నిర్మలా సీతారామన్, కోయంబత్తూరు సౌత్ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన తమిళ నేత వనతి శ్రీనివాసన్ పేర్లు వినిపిస్తున్నాయి. పురందేశ్వరికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఆమెకు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మళయాళీ, ఇంగ్లీష్ భాషలు వచ్చు. అలాగే తమిళనాడులో మంచి పరిచయాలు ఉన్నాయి. ఇక నిర్మలా సీతారామన్ ఇంగ్లీష్, హిందీ, తమిళం, మలయాళం భాషలు వచ్చు. ఆమెకు దేశ వ్యాప్తంగా ఓ వర్గంలో బలమైన ఫాలోయింగ్ ఉంది. మొదటి నుంచీ సంఘ్ పరివార్ బ్యాకప్ ఉన్న నేత. అలాగే కేంద్ర మంత్రిగా అన్ని రాష్ట్రాల్లో పరిచయాలు ఉన్నాయి. ఇక వనతి శ్రీనివాసన్ పేరు చాల మందికీ తెలియదు. కానీ ఆమెకున్న రాజకీయ అనుభవం తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే పక్కా సంఘ్ పరివార్ కుటుంబం నుంచి వచ్చిన వనతి భర్త తమిళనాడు హైకోర్ట్ అడ్వకేట్. విశ్వహిందూ పరిషత్ లీగల్ సెల్ విభాగంలో జాతీయ హోదాలో ఉన్న వ్యక్తి. అలాగే దేశ వ్యాప్తంగా పరిచయాలు ఉన్నాయి. BJP national president.

కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ , తమిళనాడు ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్‌, ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ మాజీ అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్లను పార్టీ అగ్రనాయకత్వం పరిశీలిస్తున్నది.వీరిలో ఒకరికి అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశాలు గణనీయంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఇది జరిగితే, బీజేపీ చరిత్రలో మొదటిసారిగా ఓ మహిళ పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన ఘనత పొందనున్నారు.అయితే, ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో కీలక పాత్ర పోషిస్తున్న నిర్మలా సీతారామన్‌కు ఈ పోటీలో ఆధిక్యం ఉందని పార్టీ వర్గాల అభిప్రాయం.

తమిళనాడుకు చెందిన వనతి శ్రీనివాసన్‌ కూడా అధ్యక్ష పీఠానికి ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లలో ఒకటి.న్యాయవాది వృత్తి నుంచి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి, ఆమె కోయంబత్తూర్ సౌత్‌ నియోజకవర్గం నుంచి శాసనసభ్యురాలిగా పనిచేస్తున్నారు.1993లో బీజేపీలో చేరిన వానతి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షురాలిగా అనేక పదవులను చేపట్టారు. 2020లో ఆమెను బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలిగా నియమించారు. 2022లో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీలో సభ్యురాలిగా ఎంపికయ్యారు. తమిళనాడు నుంచి ఈ స్థాయికి చేరిన మొదటి మహిళ ఆమె కావడం విశేషం.

బహుభాషా కోవిధురాలైన రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ మాజీ ప్రెసిడెంట్‌ పురందేశ్వరి కూడా పార్టీ జాతీయ అధ్యక్ష రేసులో నిలిచారు. కేంద్రమంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న ఆమె నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ పుంజుకున్నది. ఆపరేషన్ సిందూర్‌పై వివిధ దేశాల్లో పర్యటించిన ప్రజాప్రతినిధుల బృందంలో పురందేశ్వరి కూడా ఉన్నారు.

బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా పదవీకాలం రెండేండ్ల క్రితమే (2023, జనవరి) ముగిసింది.కానీ లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఆయన పదవీకాలాన్ని 2024 జూన్ వరకు పొడిగించారు. అయితే ఇప్పటికీ కొత్త అధ్యక్షుడిని నియమించలేదు. నడ్డా త్వరలో కేంద్ర కేబినెట్‌లో చేరబోతున్న నేపథ్యంలో పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాల్సిన అవసరం నెలకొంది. దీనికోసం పార్టీలో తీవ్రంగా చర్చలు, సమీక్షలు జరుగుతున్నాయి.

మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని మహిళా నేతకు అప్పగించేందుకు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాల్లో మహిళా ఓటర్లు కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ నుంచి ఎక్కువగా ఓట్లు వచ్చాయి. అందుకే ఆర్‌ఎస్‌ఎస్‌ మహిళా నేతకు జాతీయ అధ్యక్ష పదవిని అప్పగించేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఒకవేళ బీజేపీ మహిళా నేతకు ఈ పదవి అప్పగిస్తే.. ఆ పార్టీ చరిత్రలో మొదటిసారిగా ఆ అత్యున్నత పదవి పొందిన నేతగా వారు నిలవనున్నారు.

ముఖ్యంగా జనతాపార్టీ నుంచి బీజేపీగా మారిన కాషాయ పార్టీకి ఇప్పటి దాకా ఒక్క మహిళ కూడా జాతీయ అధ్యక్ష పదవి చేపట్టలేదు. అందుకే ఈసారి మహిళను ఎంపిక చేయాలని అధిష్టానం చూస్తోందట. అంతేకాదు, మహిళలకు 33 శాతం అవకాశం ఇచ్చే మహిళా బిల్లును రాబీయే పార్లమెంట్ సెషన్సులో కేంద్రం ప్రవేశ పెట్టనుంది. అంటే, ఈ సెషన్స్ ముందే ఓ మహిళను జాతీయ అధ్యక్ష పదవిలో ఉంచితే మహిళా బిల్లుకు జస్టిఫై చేసినట్లు అవుతుందనేది బీజేపీ పెద్దల ఆలోచనగా తెలుస్తోంది. ఇదే జరిగితే బీజేపీ మరో చరిత్ర క్రియేట్ చేసినట్లు అవుతుంది. ఒకవేళ పురందేశ్వరి కనుక బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి ఎంపికైతే, తెలుగు రాష్ట్రాల్లో మరో రికార్డ్ నమోదు అవ్వడం ఖాయం. ఎందుకంటే, ఇప్పటి దాకా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి చేపట్టిన వారిలో, ముగ్గురు తెలుగు వారే ఉన్నారు. బంగారు లక్ష్మణ్, వెంకయ్య నాయుడు గతంలో బీజేపీ జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు. ఇప్పుడు పురందేశ్వరి ఆ పదవికి ఎంపికైతే, బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టిన నాలుగో వ్యక్తిగా ఆమె నిలుస్తారు.