
అమెరికా, చైనాకు ఒకరంటే ఒకరికి పడదు.. కానీ పాకిస్థాన్ విషయానికి వస్తే ఈ రెండు దేశాలు భారతకు వ్యతిరేకంగా పనిచేస్తాయని చాలా సార్లు రుజువైంది. ఇప్పుడు అంతర్జాతీయ మీడియా సైతం చైనా చెప్పుచేతల్లో పనిచేస్తోందని.. భారత్ కు వ్యతిరేకంగా వార్తలు వండి వారుస్తోందని ఆధారాలు లభిస్తున్నాయి. ఇటీవల ఆపరేషన్ సిందూర్ తర్వాత .. అంతర్జాతీయ మీడియా ప్రసారం చేసిన ఓ తప్పుడు కథనం ఇప్పుడు.. చైనా, పాక్ అబద్ధాలను బయటపెడుతోంది.. ఇంతకీ అది ఏంటి..? పాక్, చైనా ఆడిన ఫేక్ గేమ్ ఎందుకు ఫెయిల్ అయ్యింది..? అసలు అంతర్జాతీయ మీడియా చైనాకు ఎందుకు సపోర్ట్ చేస్తోంది..?
ఆపరేషన్ సిందూర్ లో భాగంగా పాకిస్థాన్ లోని సైనిక స్థవరాలను భారత్ ధ్వంసం చేసిందనడానికి అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. కాని వాటిని పట్టించకోని అంతర్జాతీయ మీడియా.. పాకిస్థాన్ చెప్పే అబద్ధపు మాటలను మాత్రం హైలెట్ చూస్తూ వార్తలను ప్రసారం చేస్తోంది. ముఖ్యంగా భారత్, పాకిస్థాన్ ఉద్రిక్తతల సమయంలో పాక్ పైచేయి సాధించినట్టు వార్తలు రాస్తున్నారు. దీనికి నోటీ సాయం పాకిస్థాన్ చేస్తుంటే .. నోటు సాయం చైనా చేస్తోంది. అసలు అంతర్జాతీయ మీడియా సంస్థలకు అబద్ధం చెప్పాల్సిన పని ఏంటి..? భారతలో సైనిక స్థావరాలను, మన దేశ ఫైటర్ జెట్లను కూల్చేశామని పాకిస్థాన్ చెబుతుంటే.. ఆధారాలు కూడా లేకుండా అంతర్జాతీయ మీడియా .. ఆ మాటల నిజమంటూ ఎలా వార్తలు రాస్తుంది..? దీని వెనుక చైనా కుట్ర ఏంటి..?
ఇటీవల భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని ప్రార్థనా స్థలాలపై దాడులు చేసిందంటూ అంతర్జాతీయ మీడియా సంస్థలు దుష్ప్రచారం చేశాయి. లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలు మదర్సాల పేరుతో ఉగ్రవాద కార్యకలాపాలు నడుపుతున్న సంగతి తెలిసినా, కొన్ని అంతర్జాతీయా మీడియా సంస్థలు భారత్‌ను టార్గెట్ చేస్తూ తప్పుడు కథనాలు ప్రచారం చేశాయి. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, బీబీసీ, సీఎన్‌ఎన్ వంటి ప్రముఖ సంస్థలు చైనా నుంచి భారీగా నిధులు పొందాయని.. అందుకే అలాంటి తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయని అంటున్నారు. ఈ దుష్ప్రచారం వెనుక భారత్ బలపడటం పాశ్చాత్య దేశాలకు, చైనాకు ఇష్టం లేకపోవడమే కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. భారత్ ను ఎలాగైనా తక్కువ చేసేందుకు.. నమ్మశక్యం కాని కథలు చెబుతున్నారు.
మే 7న భారత వైమానిక దళానికి చెందిన ఐదు యుద్ధ విమానాలను తమ ఎయిర్ ఫోర్స్ కూల్చివేసిందని పాకిస్తాన్ ప్రకటించింది. ఈ ఐదు విమానాల్లో మూడు రాఫెల్, ఒక ఎస్‌యూ-30ఎంకేఐ, ఒక మిరేజ్ 2000 ఉన్నాయని, వీటిని చైనా తయారీ జె-10సీ, జేఎఫ్-17 యుద్ధ విమానాలు కూల్చాయని పాకిస్తాన్ చెప్పింది. అంతేకాదు ఈ విమానాలు భారత భూభాగంలోనే కూలిపోయాయని, అందుకే తమ వద్ద ఆధారాలు లేవని పాకిస్థాన్ వాదించింది. అయితే ఈ కథనం చైనా, పాకిస్తాన్‌లు కలిసి అల్లిన సైన్స్ ఫిక్షన్ కథలా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఈ దుష్ప్రచారం వెనుక చైనా తన జె-10సీ, జేఎఫ్-17 యుద్ధ విమానాలను ప్రపంచ మార్కెట్లో ప్రమోట్ చేయాలనే ఉద్దేశ్యం ఉందని ఆరోపణలు ఉన్నాయి. పాకిస్తాన్ చెప్పిన కథనం ప్రకారం, చైనా తయారీ జెడ్‌డీకే-03 అవాక్స్ విమానం, జె-10సీ, జేఎఫ్-17 యుద్ధ విమానాలు, PL-15E లాంగ్ రేంజ్ ఎయిర్-టు-ఎయిర్ మిసైళ్లతో కలిసి ఈ దాడిని నిర్వహించాయి. అవాక్స్ విమానం అంటే ఆకాశంలో ఎగురుతూ శత్రు విమానాలను, మిసైళ్లను 300-400 కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించి, తమ దేశ యుద్ధ విమానాలకు సమాచారం అందించే కమాండ్ సిస్టమ్. ఇది శత్రు విమానాల రాడార్‌లను, కమ్యూనికేషన్‌లను జామ్ చేయగలదు. చైనా కథనం ప్రకారం, భారత విమానాలు రన్‌వే నుంచి టేకాఫ్ అయిన వెంటనే పాకిస్థాన్ అవాక్స్ వాటిని గుర్తించింది. ఆ సమాచారంతో జె-10సీ, జేఎఫ్-17 విమానాలు పీఎల్-15 మిసైళ్లను ప్రయోగించి భారత విమానాలను కూల్చాయని చెప్పింది. ఈ వ్యవస్థను డేటా లింక్ అంటారు, అంటే అవాక్స్, యుద్ధ విమానాలు, మిసైళ్లు, ఉపగ్రహాలు కలిసి ఒక నెట్‌వర్క్‌గా పనిచేయడం అన్నమాట.
ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. చైనా, పాకిస్తాన్ తప్పుడు కథనంలో పెద్ద బొక్కుంది. రాఫెల్ యుద్ధ విమానంలో స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ అనే ప్రత్యేక సిస్టమ్ ఉంది. ఇది శత్రు రాడార్‌లను, మిసైళ్లను జామ్ చేస్తుంది. స్పెక్ట్రా ప్రతి సెకనుకు వేర్వేరు ఫ్రీక్వెన్సీలతో సిగ్నల్స్ పంపి శత్రు విమానాలను, మిసైళ్లను గందరగోళానికి గురిచేస్తుంది. పీఎల్-15 మిసైల్‌లో రాడార్ ఉంటుంది. కానీ రాఫెల్ స్పెక్ట్రా ఆ రాడార్ సిగ్నల్స్‌ను జామ్ చేస్తుంది. ఇక చైనా కథనం ప్రకారం చూస్తే.. జె-10సీ రాడార్‌ను ఆఫ్ చేసి, అవాక్స్ సహాయంతో పీఎల్-15ను రాఫెల్ వైపు పంపింది. ఆ తర్వాత మిసైల్ రాడార్‌ను ఆన్ చేసి రాఫెల్‌ను కూల్చింది. కానీ ఇది సాంకేతికంగా అసాధ్యం. పీఎల్-15 మిసైల్ 250 కిలోమీటర్ల దూరం నుంచి శబ్ద వేగానికి నాలుగు రెట్ల వేగంతో ప్రయాణిస్తే, రాఫెల్‌ను చేరడానికి 15 సెకన్లు పడుతుంది. ఈ 15 సెకన్లలో రాఫెల్ లోని స్పెక్ట్రా సిస్టమ్ మిసైల్ రాడార్‌ను జామ్ చేసి, దాన్ని టార్గెట్‌ను కోల్పోయేలా చేస్తుంది. అంతేకాదు, రాఫెల్ రాడార్ కూడా జె-10సీని గుర్తిస్తుంది. దాని సిగ్నల్స్‌ను జామ్ చేస్తుంది. కాబట్టి, ఈ కథ సాంకేతికంగా నమ్మశక్యంగా లేదు. చైనా, పాకిస్తాన్ కథనంలో మరో లోపం ఏంటంటే, భారత విమానాలు తమ భూభాగంలోనే కూలిపోయాయని చెప్పడం. అలాంటప్పుడు భారత్‌కు ఆధారాలు దొరకాలి, కానీ అవి లేవని పాకిస్తాన్ చెప్పింది. ఆశ్చర్యకరంగా, రెండు పీఎల్-15 మిసైళ్లు భారత భూభాగంలో దొరికాయి. అవి ఇంధనం అయిపోయి భూమిపై పడిపోయినట్టు కనిపించాయి. ఇది చైనా కథనం ఒట్టి కట్టుకథ అని రుజువు చేస్తోంది. అంతేకాదు, భారత వైమానిక దళం పాకిస్తాన్ గగనతలంలోకి చొచ్చుకెళ్లి 11 ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసింది. చైనా, పాకిస్తాన్ చెప్పినట్లు వారి వ్యూహం అంత పక్కాగా ఉంటే, భారత విమానాలను పాకిస్థాన్ లోనే ఎందుకు అడ్డుకోలేదు? ఇది వారి దుష్ప్రచారంలోని మరో పెద్ద లోపం.
ఇలా చైనా, పాకిస్థాన్ చెప్పే అబద్ధాలను అంతర్జాతీయ మీడియా సంస్థలు నిజమన్నట్టుగా ప్రసారం చేస్తున్నాయి. అంతర్జాతీయ మీడియా సంస్థలు ఈ దుష్ప్రచారంలో పాల్గొనడం వెనుక చైనా నుంచి వచ్చే నిధులు ఒక కారణమని ఆరోపణలు ఉన్నాయి. చైనా తన జె-10సీ, జేఎఫ్-17 యుద్ధ విమానాలను అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకోవడానికి ఇలా ఫేక్ వార్తలను ప్రచారం చేసుకుంటోందని అంటున్నారు. అంతేకాదు, భారత్ బలపడటం పాశ్చాత్య దేశాలకు, చైనాకు ఇష్టం లేకపోవడం కూడా ఒక కారణం. 1947 నుంచి 2014 వరకు భారత్‌ను బలహీనంగా చూపించే ప్రయత్నాలు జరిగాయని, ఇప్పుడు కూడా అదే ధోరణి కొనసాగుతోందని విశ్లేషకులు అంటున్నారు. మీడియా సంస్థలు నిధుల కోసం ఎవరి పక్షానైనా వార్తలు ప్రచారం చేస్తాయని, ఇది భారత్‌కు వ్యతిరేకంగా జరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి.