ఢిల్లీలో పాత వాహనాల నిషేధం..!

Delhi Vehicles Ban: ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు పాత వాహనాలపై కఠిన నిబంధనలు అమలు చేస్తామని ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం, ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. అయితే 10 ఏళ్లకు మించిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లకు మించిన పెట్రోల్ వాహనాలపై నిషేధం రాజకీయ వివాదానికి దారితీసింది. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం తన నిర్ణయంపై ఎందుకు వెనక్కు తగ్గింది? మరి ఢిల్లీలోని పాతవాహనాలను ఏం చేస్తారు? ఢిల్లీ నుంచి పాత వాహనాలు ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరలకు ఎలా అమ్ముడవుతున్నాయి? ఢిల్లీలో కార్లు ఎందుకు ఛీప్ ?

ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర సమస్యగా మారిన నేపథ్యంలో, జులై 1 నుంచి పాత వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. 10 ఏళ్లకు మించిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లకు మించిన పెట్రోల్ వాహనాలను ఎండ్ ఆఫ్ లైఫ్ వాహనాలుగా పరిగణించి, వీటికి ఇంధనం నిరాకరించడం, స్వాధీనం చేసుకుని స్క్రాప్ చేస్తామని నిబంధనలు విధించింది. ఈ చర్యల కోసం ఢిల్లీలోని పెట్రోల్ బంకుల్లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ లెక్కల ప్రకారం, ఢిల్లీలో ఉన్న 80 లక్షల రిజిస్టర్డ్ వాహనాల్లో సుమారు 62 లక్షల వాహనాలు ఎండ్ ఆఫ్ లైఫ్ కిందకు వస్తాయని అంచనా. ఈ చర్యలు అమలులోకి వచ్చిన తొలి రోజు, 80 వాహనాలను స్వాధీనం చేసుకోగా, 98 మందికి నోటీసులు జారీ చేశారు. ఢిల్లీలో వాహనాల నుంచి వెలువడే కాలుష్యాన్ని ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది.

జులై 1 నుంచి అమలులోకి వచ్చిన వాహనాల నిషేధం ఢిల్లీలో తీవ్ర వివాదాన్ని రేకెత్తించింది. సామాన్య ప్రజలు, ముఖ్యంగా మధ్యతరగతి, పేదవర్గాలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. కొందరు తమ లగ్జరీ కార్లను తక్కువ ధరకు అమ్ముకోవలసి వచ్చింది. ఈ నిషేధాన్ని వ్యతిరేకిస్తూ, ఎలక్ట్రిక్ వాహనాలపై 30% సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇది వాహన తయారీ సంస్థలకు లబ్ధి చేకూర్చే కుట్రగా అభివర్ణించారు ఆప్ నాయకులు విమర్శించారు. ఇది బీజేపీ తుగ్లక్ నిర్ణయంగా అభివర్ణించారు. 62 లక్షల వాహనాలను స్క్రాప్ చేయడం ద్వారా సామాన్యులను ఇబ్బంది పెడుతూ, కొత్త వాహనాల కొనుగోలును ప్రోత్సహిస్తున్నారు మండిపడ్డారు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు. ఈ నిషేధాన్ని లీగలైజ్డ్ రాబరీ అని సోషల్ మీడియాలో విమర్శలొచ్చాయి. ఈ తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం ఈ నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. Delhi Vehicles Ban.

ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ ఒకటి. శీతాకాలం వచ్చిందంటే చాలు ఢిల్లీలో గాలి నాణ్యత పడిపోతుంది. దీంతో ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. గతంలో సరిబేసి విధానాన్ని తీసుకొచ్చి వాహన కాలుష్యం తగ్గించేందుకు చర్యలు తీసుకున్నారు. అది పెద్దగా ఫలితాన్ని చూపించలేకపోయింది. అలాగే ఢిల్లీ చుట్టపక్కల ప్రాంతాల్లో పంట వ్యర్థాలను తగులవేయడకుండా నిషేధం విధించినా అది పెద్దగా ఫలితం చూపించలేదు. దీంతో ఎప్పటికప్పుడు ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. దీనిలో భాగంగానే పాత వాహనాల నిషేధం విధానాన్ని తీసుకొచ్చింది. అయితే కొత్త వాహనాలు కొనుగోలు చేయడం ఆర్థికంగా భారమని, ఈ నిషేధం తమ జీవనోపాధిని దెబ్బతీస్తుందని ఢిల్లీ వాసులు నిరసనలు తెలిపారు. ఢిల్లీలో గాలి కాలుష్యానికి వాహనాలు 51% కారణమని నివేదికలు చెప్పినప్పటికీ, ఈ నిషేధం NCR ప్రాంతం మొత్తానికి వర్తించకపోవడం వల్ల దీని ప్రభావం పరిమితమని చెబుతున్నారు. ఒక్కసారిగా పాత వాహనాలు నిషేధం అంటే వాటిని ఏం చేయాలని కూడా చాలా మంది ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ నిషేధం అమలు చేయడానికి ఏర్పాటు చేసిన 350 టీమ్‌లు.. ప్రజల నిరసనలు, రాజకీయ ఒత్తిడి కారణంగా వెనక్కు తగ్గాయి.

ఢిల్లీలో పాత వాహనాలపై నిషేధం ప్రకటన తర్వాత, ఈ వాహనాలు ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరలకు అమ్ముడవుతున్నాయి. ఢిల్లీ వాసులు తమ పాత వాహనాలను స్క్రాప్ చేయడం, ప్రభుత్వం స్వాధీనం చేసుకోకముందే, వాటిని హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ వంటి పొరుగు రాష్ట్రాల్లో అమ్ముకుంటున్నారు. ఒక ఢిల్లీ వాసి 2018లో 55 లక్షలకు కొనుగోలు చేసిన తన రేంజ్ రోవర ని దాదాపు సగం ధరకు అమ్ముకోవడం అక్కడి పరిస్థితికి అర్థపడుతుంది. ఈ వాహనాలు ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరలకు అమ్ముడవడం వల్ల స్థానిక డీలర్లు, స్క్రాప్ వ్యాపారులు లాభపడుతున్నారు. ఢిల్లీలో రిజిస్టర్డ్ వాహనాలు ఇతర రాష్ట్రాల్లో రీ-రిజిస్టర్ చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో రీసైక్లింగ్ కోసం స్క్రాప్ యార్డ్‌లకు చేరుతున్నాయి. వాటి పార్టులను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. చివరికి దక్షిణాదిలో సైతం ఢిల్లీ వాహనాల సంఖ్య పెరిగింది. చాలా మంది ఢిల్లీకి వెళ్లి పాత వాహనాలు తక్కువ ధరకు కొనుగోలు చేసుకుని తెచ్చుకుంటున్నారు. వాటిని ఇక్కడకు తెచ్చుకుని .. మళ్లీ రిజిస్టర్ చేయించుకుంటున్నారు.

ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు పాత వాహనాలపై నిషేధం ఒక పరిష్కార మార్గంగా భావించినప్పటికీ, దాని అమలులో వచ్చిన సవాళ్లు, ప్రజల నిరసనల మధ్య అది నిలిచిపోయింది. ఢిల్లీ ప్రభుత్వం ఈ నిషేధాన్ని తాత్కాలికంగా నిలిపివేసినప్పటికీ, కాలుష్య నియంత్రణ కోసం ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడం, సబ్సిడీలను పెంచడం, పాత వాహనాల స్క్రాప్‌కు ఆర్థిక ప్రోత్సాహకాలు అందించడం వంటి చర్యలపై చర్చ జరుగుతోంది. ఢిల్లీ పంచాయత్ సంఘ్ సూచన మేరకు, ఎలక్ట్రిక్ వాహనాలపై 30% సబ్సిడీ, పాత వాహనాల స్థానంలో కొత్త వాహనాల కొనుగోలుకు సులభ రుణ సౌకర్యాలు అందించాలని నిపుణులు అంటున్నారు. అయితే, ఈ నిషేధం NCR ప్రాంతం మొత్తానికి విస్తరించకపోతే, ఢిల్లీలో కాలుష్య సమస్య పరిష్కారం కాదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ వివాదం రాజకీయంగా BJP, AAP మధ్య మాటల యుద్ధానికి దారితీసినప్పటికీ, సామాన్య ప్రజల ఆందోళనలను పరిగణనలోకి తీసుకుని, మరింత సమగ్రమైన, సామాజికంగా ఆమోదయోగ్యమైన విధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

Also Read: https://www.mega9tv.com/the-interesting-incident-took-place-in-gujarat-a-senior-lawyer-was-seen-drinking-beer-while-arguing-on-behalf-of-a-client/