గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన ఇంటర్నెట్ వినియోగం..!

Digital India Internet in Rural Areas: భారతదేశంలో డిజిటల్ విప్లవానికి నాంది పలికిన డిజిటల్ ఇండియా కార్యక్రమం 10 ఏళ్లు పూర్తి చేసుకుంది. 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు, ఇది కేవలం ప్రభుత్వ పథకంగా కాకుండా, దేశవ్యాప్తంగా 140 కోట్ల భారతీయుల జీవితాలను మార్చే ఒక ప్రజా ఉద్యమంగా మారుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ ఇండియా దేశాన్ని ఎలా మార్చింది.? ఇంటర్నెట్ వినియోగం భారత ప్రజలను ప్రపంచానికి చేరువ చేసింది..? 2014కు .. ఇప్పటికీ ఇంటర్నెట్ స్పీడ్ లో మార్పులు చూస్తే.. ఏం అర్థమవుతోంది..?

2014లో 4GB ఉన్న ఒక హెచ్డీ సినిమా డౌన్‌లోడ్ చేయడానికి 74 గంటలు సమయం పట్టేంది.. కాని ఇప్పుడు , 5 నిమిషాలు చాలు. ఇది ఈ పదేళ్లలో డిజిటల్ రంగంలో భారత్ సాధించిన ప్రగతి. దీనికి కేంద్రం తీసుకొచ్చిన డిజిటల్ ఇండియా కార్యక్రమం ఎంతో ఉపయోగడపిందనే చెప్పాలి.. ఈ కార్యక్రమం 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ప్రధాని నరేంద్ర మోడీ లింక్డ్‌ఇన్‌లో ఒక బ్లాగ్ పోస్ట్ ద్వారా తన ఆలోచనలను పంచుకున్నారు. డిజిటల్ ఇండియా ఒక సాధారణ ప్రభుత్వ పథకం కాదు, ఇది ఒక ప్రజా ఉద్యమంగా మారింది అని ఆయన అన్నారు. 2014లో ఇంటర్నెట్ యాక్సెస్ పరిమితంగా ఉండగా, భారతీయులు అసలు టెక్నాలజీని ఉపయోగించగలరా అనే సందేహాలు ఉన్నాయని, కానీ తమ ప్రభుత్వం ఈ సందేహాలను తొలగించి, టెక్నాలజీని అందరికీ అందుబాటులోకి తెచ్చిందని మోడీ చెప్పారు. 2014లో ఇంటర్నెట్ కనెక్షన్లు కేవలం 25 కోట్లు ఉండగా, ఇప్పుడు అవి 97 కోట్లకు చేరాయని… గల్వాన్, సియాచిన్, లడఖ్ వంటి సరిహద్దు ప్రాంతాలకు కూడా హై-స్పీడ్ ఇంటర్నెట్ అందుతోందని ఆయన తెలిపారు. ఇండియా స్టాక్, UPI వంటి ప్లాట్‌ఫామ్‌లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని, ఇవి భారతదేశాన్ని డిజిటల్ గవర్నెన్స్‌లో అగ్రగామిగా నిలిపాయని మోడీ పేర్కొన్నారు. రాబోయే దశాబ్దంలో భారతదేశం డిజిటల్ గవర్నెన్స్ నుంచి గ్లోబల్ డిజిటల్ లీడర్‌షిప్‌కు మారుతుందని, ఇండియా-ఫస్ట్ నుంచి ఇండియా-ఫర్-ది-వరల్డ్ దిశగా పయనిస్తుందని మోదీ ఆకాంక్షించారు.

డిజిటల్ ఇండియా కార్యక్రమం 2015 జూలై 1న ప్రారంభమై, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆన్‌లైన్ గవర్నెన్స్, పౌరుల సాధికారతపై దృష్టి సారించింది. ఈ కార్యక్రమం కింద ఆధార్, UPI, డిజిలాకర్, కోవిన్, ఫాస్టాగ్, ఒన్ నేషన్ ఒన్ సబ్‌స్క్రిప్షన్ వంటి ఇనిషియేటివ్‌లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. UPI ద్వారా సంవత్సరానికి 100 బిలియన్ రియల్-టైమ్ లావాదేవీలు జరుగుతున్నాయి. ఇది ప్రపంచంలోని సగం డిజిటల్ లావాదేవీలకు సమానం. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా 44 లక్షల కోట్ల రూపాయలు నేరుగా పౌరులకు బదిలీ అయ్యాయి. దీనివల్ల 3.48 లక్షల కోట్ల రూపాయల పక్కదారి పట్టకుండా ఆపగలిగారు. ONDCలో 200 మిలియన్ లావాదేవీలను దాటాయి. చివరి 100 మిలియన్ లావాదేవీలు కేవలం ఈ ఆరు నెలల్లో జరిగాయి. గవర్నమెంట్ ఈ-మార్కెట్‌ప్లేస్ 50 రోజుల్లో 1 లక్ష కోట్ల రూపాయల గ్రాస్ మర్చండైజ్ వాల్యూ దాటింది. ఇందులో 22 లక్షల మంది సెల్లర్లు, 1.8 లక్షల మంది మహిళా-నేతృత్వంలోని MSMEలు 46,000 కోట్ల రూపాయల ఆర్డర్లను పూర్తి చేశారు. డిజిలాకర్‌లో 54 కోట్ల మంది యూజర్లు, 775 కోట్ల డాక్యుమెంట్లు ఉన్నాయి, CoWIN 220 కోట్ల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను జారీ చేసింది. ఇలా ఎన్నో ఆన్ లైన్ సేవలు డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారానే సాధ్యమయ్యాయి. Digital India Internet in Rural Areas.

2014లో భారతదేశంలో ఇంటర్నెట్ కనెక్షన్లు కేవలం 25 కోట్లు ఉండగా, 2025 నాటికి ఇవి 97 కోట్లకు పైగా పెరిగాయి. ఈ పదేళ్లలో దాదాపు నాలుగు రెట్ల వృద్ధిని సాధించాం. భారత్‌నెట్ ప్రాజెక్ట్, 42 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్ ఫైబర్ కేబుల్ వేయడం, 5G టవర్స్ ఈ పురోగతిలో కీలకంగా వ్యవరించాయి. భారత్‌నెట్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో హై-స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. 2024 నాటికి 398.35 మిలియన్ల మంది గ్ర సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. భారత్ 5G సేవలు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనవిగా గుర్తింపు పొందాయి. కేవలం రెండేళ్లలో 4.81 లక్షల టవర్లు ఏర్పాటు చేశారు. ఇంటర్నెట్ ధరలు కూడా గణనీయంగా తగ్గాయి, ఇప్పుడు 1GB డేటా కేవలం 10 రూపాయలకు అందుబాటులో ఉంది, దీనివల్ల భారత్ ప్రపంచంలోనే అత్యంత సరసమైన ధరలకు ఇంటర్నెట్ అందిస్తున్న దేశంగా మారింది. గల్వాన్, సియాచిన్ వంటి సరిహద్దు ప్రాంతాలకు కూడా హై-స్పీడ్ కనెక్టివిటీ అందుబాటులోకి వచ్చింది. ఈ-గవర్నెన్స్, ఈ-కామర్స్, ఈ-ఎడ్యుకేషన్ వంటి సేవలు దేశవ్యాప్తంగా విస్తరించాయి.

2014లో భారతదేశంలో ఇంటర్నెట్ స్పీడ్, వినియోగం చాలా పరిమితంగా ఉండేది. ఆ కాలంలో సగటు మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ 2 నుంచి 3 Mbps మాత్రమే ఉండేది, బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌లు 10 Mbps దాటేవి కాదు. ఇంటర్నెట్ యాక్సెస్ ప్రధానంగా పట్టణ ప్రాంతాలకే పరిమితమై ఉండేది, గ్రామీణ ప్రాంతాల్లో కేవలం 10 నుంచి 15 శాతం మందికి మాత్రమే ఇంటర్నెట్ అందుబాటులో ఉండేది. డిజిటల్ అంటే ఏమిటో కూడా తెలిసేది కాదు. చాలా మంది ఆన్‌లైన్ లావాదేవీలు లేదా ఈ-గవర్నెన్స్ సేవల గురించి తెలియకపోవడం వల్ల వినియోగించేవారు కాదు. 2014లో UPI వంటి సిస్టమ్ లేదు. ఆన్‌లైన్ చెల్లింపులు ఎక్కువగా క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల ద్వారా, అదీకాకపోతే నెట్ బ్యాంకింగ్ ద్వారా జరిగేవి, ఇవి సామాన్యులకు అందుబాటులో ఉండేవి కాదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకపోవడం వల్ల ప్రపంచంతో సంబంధాలు చాలా తక్కువగా ఉండేవి. ఈ పరిస్థితి డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా పూర్తిగా మారిపోయింది.

2025 నాటికి భారతదేశంలో ఇంటర్నెట్ స్పీడ్, వినియోగం గణనీయంగా మెరుగుపడింది. 5Gవల్ల సగటు మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ 100-300 Mbpsకు చేరింది, బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌లు 1 Gbps వరకు అందుబాటులో ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ యాక్సెస్ 40%కి పైగా పెరిగింది, 398.35 మిలియన్ గ్రామీణ సబ్‌స్క్రైబర్లతో డిజిటల్ డివైడ్ గణనీయంగా తగ్గింది. UPI ద్వారా రోజువారీ లావాదేవీలు సామాన్యుల జీవితంలో భాగమయ్యాయి, సంవత్సరానికి 100 బిలియన్ లావాదేవీలతో భారతదేశం ప్రపంచ రియల్-టైమ్ డిజిటల్ పేమెంట్స్‌లో సగం వాటాను కలిగి ఉంది. డిజిలాకర్ 54 కోట్ల మంది యూజర్లతో, 775 కోట్ల డాక్యుమెంట్లను హోస్ట్ చేస్తోంది, ఇది ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల వంటి డాక్యుమెంట్లను డిజిటల్‌గా స్టోర్ చేయడానికి సహాయపడుతోంది. ఈ-కామర్స్, ఈ-ఎడ్యుకేషన్, మరియు ఈ-హెల్త్ సేవలు గ్రామీణ ప్రాంతాల్లో కూడా విస్తరించాయి, బనారస్ చేనేతకారులు, నాగాలాండ్ బాంబూ ఆర్టిసాన్లు ONDC ద్వారా దేశవ్యాప్తంగా కస్టమర్లను చేరుకుంటున్నారు.

Also Read: https://www.mega9tv.com/national/kerala-once-a-state-known-for-peace-now-it-has-become-a-recruitment-hub-for-isis-and-jihadist-organisation/