వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్..!

Government Announces fastag Annual Pass: హైవేలపై ప్రయాణం చేసే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఫాస్టాగ్ ఆధారంగా కొత్త యాన్యువల్ పాస్‌ను తీసుకొస్తోంది. కేవలం 3 వేలు చెల్లిస్తే ఏడాది పొడవునా జాతీయ రహదారులపై అపరిమిత ప్రయాణం చేయొచ్చు. ఈ పథకం ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానుంది. అయితే ఇప్పటివరకూ టోల్ గేట్ల వద్ద ఫాస్టాగ్ విధానం ఎలా పనిచేస్తోంది? కొత్త పాస్ వల్ల వాహనదారులకు ఎలాంటి లాభాలు ఉన్నాయి? ఫాస్టాగ్ పాసులపై ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తోంది?

కేంద్ర ప్రభుత్వం హైవే ప్రయాణాలను మరింత సులభతరం చేసేందుకు ఫాస్టాగ్ యాన్యువల్ పాస్‌ను ప్రవేశపెడుతోంది. రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన ఈ పథకం ప్రకారం, కేవలం 3 వేల రూపాయలు ఒక్కసారి చెల్లిస్తే ఏడాది పొడవునా జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రెస్‌వేలు, రాష్ట్ర రహదారులపై 200 ట్రిప్పుల వరకు ప్రయాణించవచ్చు. ఈ పాస్ కార్లు, జీపులు, వ్యాన్‌ల వంటి నాన్-కమర్షియల్ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. ఆగస్టు 15 నుంచి ఈ పథకం అమల్లోకి రానుంది. రాజ్‌మార్గ్ యాత్ర యాప్, NHAI వంటి వెబ్‌సైట్లలో ఈ పాస్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ పథకం రోజూ హైవేలపై ప్రయాణించే వాహనదారులకు, ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని ప్రభుత్వం చెప్తోంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 750కి పైగా టోల్ ప్లాజాల్లో ఫాస్టాగ్ విధానం అమలవుతోంది. ఫాస్టాగ్ అనేది రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీతో పనిచేసే ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్. వాహనం విండ్‌షీల్డ్‌పై అతికించిన ఫాస్టాగ్ ట్యాగ్‌ను టోల్ ప్లాజాలోని స్కానర్లు చదివి, లింక్ చేసిన బ్యాంక్ అకౌంట్ నుంచి టోల్ ఛార్జీలను ఆటోమేటిక్‌గా కట్ చేస్తాయి. 2014లో పైలట్ ప్రాజెక్ట్‌గా మొదలైన ఫాస్టాగ్, 2021 ఫిబ్రవరి 15 నుంచి అన్ని వాహనాలకు తప్పనిసరి అయింది. దీని వల్ల టోల్ ప్లాజాల వద్ద క్యూలు తగ్గి, టైం, ఇంధనం ఆదా అవుతున్నాయి. 90%కి పైగా వాహనాలు ఫాస్టాగ్‌ను అడాప్ట్ చేశాయి. 20% కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలు తగ్గాయని NHAI చెప్తోంది. ఫాస్టాగ్ ధర గరిష్టంగా రూ.100, అదనంగా రూ.200 సెక్యూరిటీ డిపాజిట్, రూ.200 ఫస్ట్ రీఛార్జ్ ఉంటాయి.

కొత్త ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ వల్ల వాహనదారులకు ఎన్నో లాభాలు ఉన్నాయి. ఒక్కసారి రూ.3,000 చెల్లిస్తే ఏడాది పొడవునా టోల్ ఛార్జీల గురించి ఆలోచించాల్సిన పనిలేదు. ప్రస్తుతం నెలవారీ పాస్ రూ.340, సంవత్సరానికి రూ.4,080 ఖర్చవుతుంది. కానీ, యాన్యువల్ పాస్‌తో దాదాపు 50% టోల్ ఛార్జీలు ఆదా అవుతాయి. రోజూ హైవేలపై ప్రయాణించే వాళ్లకు, ట్రాన్స్‌పోర్టర్లకు ఇది భారీ రిలీఫ్. అదనపు డాక్యుమెంటేషన్ అవసరం లేదు, ప్రస్తుత ఫాస్టాగ్ అకౌంట్‌తోనే పాస్ యాక్టివేట్ చేసుకోవచ్చు. బారియర్-ఫ్రీ టోలింగ్ సిస్టమ్‌తో టోల్ ప్లాజాల వద్ద ఆగాల్సిన పనిలేదు, ట్రాఫిక్ జామ్‌లు తగ్గుతాయి. ANPR కెమెరాలు, GPS టెక్నాలజీతో టోల్ ఛార్జీలు ఆటోమేటిక్‌గా డిడక్ట్ అవుతాయి.

అయితే ఈ కొత్త పథకంపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. చాలామంది ఈ పథకాన్ని స్వాగతిస్తున్నారు. రూ.3,000తో ఏడాది పొడవునా టోల్ ఫ్రీ ప్రయాణం సూపర్ ఐడియా అని కొందరు అంటున్నారు. ఈ పాస్ అన్ని టోల్ ప్లాజాలకు వర్తిస్తుందా లేక పరిమిత రూట్లకు మాత్రమేనా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మొదటి దశలో ఢిల్లీ-జైపూర్ రూట్‌లో ట్రయల్ రన్ జరుగుతుందని, ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరిస్తామని NHAI చెప్తోంది. కొందరు వాహనదారులు, GPS ఆధారిత టోల్ సిస్టమ్‌తో డేటా ప్రైవసీ సమస్యల గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం టోల్ ఛార్జీల కోసం మినిమల్ డేటా మాత్రమే వాడతాం, అది సురక్షితంగా ఉంటుంది అని స్పష్టం చేసింది.

ఈ పథకం విజయవంతమైతే, భారత్‌లో హైవే ప్రయాణం మరింత సులభం, ఆర్థికంగా లాభదాయకం అవుతుంది. ప్రస్తుత ఫాస్టాగ్ విధానం టోల్ కలెక్షన్‌ను డిజిటలైజ్ చేసి, ట్రాఫిక్ జామ్‌లను తగ్గించినట్టు, కొత్త యాన్యువల్ పాస్ దీర్ఘకాలిక ప్రయాణికులకు ఆర్థిక రిలీఫ్ ఇస్తుంది. గతంలో ప్రతిపాదించిన రూ.30 వేల లైఫ్‌టైమ్ పాస్‌ను ప్రభుత్వం రద్దు చేసి, రూ.3 వేల యాన్యువల్ పాస్‌పై ఫోకస్ చేసింది. Government Announces fastag Annual Pass అయితే, టోల్ ఆపరేటర్ల ఆదాయం తగ్గే అవకాశం ఉందని, వారికి డిజిటల్ డేటా ఆధారంగా కాంపెన్సేషన్ ఇస్తామని చెప్తోంది. ఈ మార్పులు భారత రహదారులను మరింత అధునాతనంగా, పర్యావరణ హితంగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నాయి.

Also Read: https://www.mega9tv.com/national/people-are-getting-aerophobia-after-the-air-india-plane-crash/