
ఎన్నో ఏళ్లుగా భారత్ లో దాడులు, కుట్రలు, కుంత్రాలకు ప్లాన్ చేసిన పాకిస్థాన్ ఉగ్రవాదులకు మూడింది. ఆపరేషన సిందూర్ పేరుతో భారత్ చేసిన దాడుల్లో.. ఒకరో ఇద్దరో కాదు.. ఇప్పటి వరకు భారత్ లో దాడుల మీద దాడులు.. దారుణాల మీద దారుణాలు చేసిన ఉగ్రవాదుల లిస్ట్ తీసుకుని.. మరీ ప్రతికారం తీర్చుకుంది భారత్ ఆర్మీ. ఇందులో 1999 విమానం హైజాక్ ఉగ్రవాదులతో పాటు.. పహల్గామ్ ఉగ్రదాడి సూత్రదారులు కూడా ఉన్నారు. అసలు భారత్ వీరిని ఎలా మట్టుపెట్టింది. నూరు తప్పులు చేసే వరకు కృష్ణుడు ఆగినట్టు.. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల తప్పులను ఇప్పటి వరకు లెక్కించిన భారత్.. ఇప్పుడు సరైనా సమాధానం చెప్పిందా..? అసలు భారత్ పై గతంలో దాడి చేసిన అత్యంత కీరాతకులైన ఉగ్రవాదులను భారత్ ఎలా చావు దెబ్బతీసింది…?
ఏరి ఏరి వేటడం అంటే ఇదేనేమో.. పాకిస్థాన్ ఇప్పటి వరకు పెంచి పోషించిన ఉగ్రవాదులను భారత్ ఏరి మరి వేటాడింది. ఇప్పటి వరకు సహనంతో ఉన్న భారత్.. తన సత్తా ఏంటో చూపించింది. సైలెంట్ గా ఉంటే సింహం ముందు కూడా కక్కలు మొరుగుతాయి. కాని సింహం ఒకసారి పంజా విసిరితే ఏ మవుతోందా తర్వాత తెలుస్తోంది. ఇప్పుడు భారత్ తన పంజాను పాకిస్థాన్ వైపు విసిరింది. ఉగ్రమూకలను తుదముట్టించింది. ఆపరేషన్ సిందూర్‌లో భారత్ చిరకాల ప్రతీకారం కూడా తీరింది. 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఐసీ-814 హైజాక్‌కు మాస్టర్‌మైండ్, జైషే ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అజహర్ కూడా హతమయ్యాడు. బహావల్‌పుర్‌లోని మర్కజ్ సుబాన్ కాంప్లెక్స్‌పై భారత్ విరుచుకుపడింది. ఈ దాడిలో జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబ సభ్యులు, సన్నిహితులు కలిపి 14 మంది మరణించారు. వీరిలో రవూఫ్ అజహర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
రవూఫ్ అజహర్ పలు ఉగ్రదాడుల్లో నిందితుడు. వాల్‌స్ట్రీట్ జర్నల్ పత్రిక జర్నలిస్టు డేనియల్ పెర్ల్ హత్యలో ఇతడు కూడా ఉన్నాడు. ఐసీ814 విమాన హైజాక్‌లో రవూఫ్ కీలకంగా వ్యవహరించాడు.. ఐదుగురు పాక్ ఉగ్రవాదులు నేపాల్‌లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి కాందహార్‌కు చేర్చారు. అక్కడి నుంచి భారత ప్రభుత్వంతో చర్చలు జరిపి.. భారత జైళ్లలో ఉన్న మసూద్ అజహర్, అహ్మద్ ఒమర్ సయీద్ షేక్, ముస్తాక్ అహ్మద్ జర్గర్ అనే ఉగ్రవాదులను విడిపించుకొని తీసుకెళ్లారు. ఆ తర్వాతే మసూద్ అజహర్ జైషే ఉగ్రవాద సంస్థను స్థాపించాడు. ఇక 2001లో జరిగిన పార్లమెంట్‌పై దాడి, 2016లో పఠాన్ కోట్ దాడి, 2019లో పుల్వామా బాంబింగ్ వంటి ఉగ్ర ఘటనల్లో రవూఫ్ ప్రమేయం ఉంది. ప్రస్తుతం జైషే మొహమ్మద్ కీలక కమాండర్‌గా వ్యవహరిస్తున్నాడు.
మరోవైపు భారత్ క్షిపణి దాడిలో తన కుటుంబానికి చెందిన 10 మంది మృతి చెందారని ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ అధినేత మౌలానా మసూద్ అజార్ ధ్రువీకరించాడు. బహావల్‌పుర్‌లో గల జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాన్ని క్షిపణి దాడితో భారత్ ధ్వంసం చేసింది. ఈ క్రమంలో మసూద్ సోదరి-ఆమె భర్త, మేనల్లుడు-అతడి భార్య, మేనకోడలు, ఐదుగురు చిన్నారులు మరణించారని మసూద్ వెల్లడించాడు. అలాగే మసూద్‌కు అత్యంత సన్నిహితుడు, అతని తల్లి, మరో ఇద్దరు సన్నిహితులూ క్షిపణి దాడిలో మృతి చెందారని ఆ ప్రకటనలో వివరించారు. మసూద్ అజార్‌ను 2019, మేలో అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
ఏప్రిల్ 2019 నుంచి అజార్ బయట ప్రపంచానికి కనిపించకుండా బహవల్‌పుర్‌లోని ఓ రహస్య స్థావరంలో దాక్కున్నాడని భావిస్తున్నారు. భారత పార్లమెంటుపై ఉగ్రదాడి, జమ్మూకశ్మీర్ శాసనసభపై దాడి, పఠాన్‌కోట్‌లో ఐఏఎఫ్ స్థావరంపై దాడి, పుల్వామాలో ఆత్మాహుతి దాడి వంటి ఘటనల్లో జైషే మహ్మద్ ముఖ్యపాత్ర పోషించింది. 1999లో ఐసీ-814 విమానాన్ని హైజాక్ చేసిన ఘటనలో ప్రయాణికులను సురక్షితంగా విడిచిపెట్టేందుకు ఉగ్రవాది మసూద్ అజార్‌ను భారత్ జైలు నుంచి విడుదల చేసింది. అప్పటి నుంచి బహావల్‌పుర్ జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు ప్రధాన కేంద్రంగా మారిపోయింది. బహావల్‌పుర్‌లోని మర్కజ్ సుబాన్‌ను మసూద్ తన ఇంటిగా కూడా వినియోగిస్తాడు.
ప్రధాని భారత్ 9 ప్రాంతాల్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. సుమారు 100 మంది ఉగ్రవాదులు చనిపోయారు. ఈ స్థావారాల నుంచి ఉగ్రవాదులు భారత్ లో గతంలో దాడులకు ప్లాన్ చేశారు. బహవల్‌పూర్‌లోని మర్కజ్ సుబాన్. ఇది సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. జైషే మహ్మద్‌కు చెందిన ప్రధాన కార్యాలయంగా చెబుతారు. దీనిని భారత్ ధ్వంసం చేసింది. మురిద్కేలోని మర్కాజ్ తోయిబా.. సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలోని లష్కరే క్యాంపు కార్యాలయం ఇది. ఇక్కడే ముంబై దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు తలదాచుకున్నారని సమాచారం.
భారత్ దాడుల్లో ఉగ్రవాదులు కొంద మంది చనిపోయారు. సియల్‌కోట్‌లోని మెహ్‌మూనా జోయా.. అంతర్జాతీయ సరిహద్దుకు 15 కి.మీ దూరంలో ఉన్న ఇది హిజ్బుల్ ముజాహిద్దీన్ శిబిరం. కోట్లిలోని మర్కాజ్ అబ్బాస్ ఉగ్ర స్థావరం.. నియంత్రణ రేఖకు 35 కి.మీ. దూరంలో ఈ క్యాంప్ ఉంది. 20 ఏప్రిల్ 2023న పూంచ్‌లో జరిగిన దాడులకు, జూన్ 24న బస్సులో ప్రయాణిస్తున్న అమాయక యాత్రికులపై దాడికి ఇక్కడి ఉగ్రవాదులే కారణం అని సమాచారం.
కోట్లిలోని మస్కర్ రహీల్ షహీద్.. పీఓకేలో హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన స్థావరం ఇది. కొండల ప్రాంతంలో ఉండే ఈ క్యాంప్‌లో నాలుగు గదులు, బరాక్‌లు ఉన్నాయి. వీటిలో పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉన్నట్లు సమాచారం. ముజఫరాబాద్‌లోని షవాయ్ నల్లాహ్.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తంగ్ధర్ సెక్టార్‌లో సరిహద్దుకు 30 కిలోమీటర్ల పరిధిలో షవాయ్ లష్కరే క్యాంప్ ఉంది. ఈ ముఠాకు కీలకమైన క్యాంప్ ఇది. ఇక్కడే లష్కరే కేడర్ నియామకాలు, శిక్షణ వంటివి చేపడుతున్నారు. 2000 నుంచి ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నారు. బర్నాలలోని మర్కాజ్ అహ్లే హదిత్ ఉగ్ర స్థావరం..
ఇది లష్కరే తోయిబా ఉగ్ర క్యాంప్. పూంఛ్-రాజౌరి-రియాసీ సెక్టార్‌లోకి లష్కరే ఉగ్రవాదులు, ఆయుధాలను పంపించేందుకు దీన్ని వినియోగిస్తున్నట్లు సమాచారం. ముజఫరాబాద్‌లోని సైద్నా బిలాల్ ఉగ్ర స్థావరం.. పీఓకేలోని జైషే ప్రధాన కేంద్రాల్లో ఇది ఒకటి. ముజఫరాబాద్ రెడ్‌ఫోర్ట్‌కు ఎదురుగా ఉంటుంది. జమ్మూకశ్మీర్‌లోకి ఉగ్రవాదులను తరలించేందుకు వీలుగా దీన్ని రవాణా క్యాంప్‌గా నిర్వహిస్తున్నారు. తెహ్రా కలాన్‌లోని సర్జల్.. జైషే మహ్మద్ ఉగ్ర స్థావరం ఇది. దీన్ని కూడా జమ్మూకశ్మీర్‌లోకి ఉగ్రవాదులను పంపించేందుకు ఉపయోగిస్తున్నారు. మరోవైపు ఉగ్రవాదుల అంత్యక్రియల్లో పాకిస్థాన్ పెద్ద ఆశ్చర్యపోయే విషయంగా అనుకోవడం లేదు. ఎందుకంటే పాకిస్థాన్ ముందు నుంచి ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.