కేరళలో ఐసిస్ రిక్రూట్‌మెంట్ నెట్‌వర్క్..!

Kerala ISIS recruitment hub: కేరళ…. పచ్చదనంతో కూడిన ఎంతో ప్రశాంతమైన రాష్ట్రం. అయితే ఇది ఒక్కప్పటి మాట.. ఇప్పుడు జీహాదీ నెటవర్క్, ర్యాడికల్ గ్రూపులకు స్థావరంగా మారిందనే అనుమానం వ్యక్తమవుతోంది. దళితులను, ఆర్థికంగా ఎదగాలనుకనే వారికి బ్రైన్ వాష్ చేసి.. వారిని ఇతర దేశాల్లో ఉగ్రవాదులుగా మార్చడంలో ఈ గ్రూపులు యాక్టివ్ గా పనిచేస్తున్నాయని నిఘా వర్గాలకు సమాచారం అందింది. అంతేకాదు ఉన్నత విద్య చదువుకున్న వారిని సైతం మాయమాటలతో నమ్మించి దేశాలు దాటిస్తున్నారు. అసలు కేరళలో ఈ గ్రూపులు ఎలా పనిచేస్తున్నాయి..? వీటి వలలో యువత ఎలా పడుతోంది..? వీటిపై సీబీఐ, ఎన్ఐఏ ఎలాంటి నిఘా పెట్టాయి..?

కేరళ, ఒకప్పుడు శాంతి, సామాజిక చైతన్యానికి పేరుగాంచిన రాష్ట్రం. ఇప్పుడు ఐసిస్-ఖొరాసాన్ కు రిక్రూట్‌మెంట్ హబ్‌గా మారింది. ఐసిస్-ఖొరాసాన్ అనేది ఐసిస్ సలాఫీ జిహాదీ సంస్థ ప్రాంతీయ శాఖ. ఇది ప్రధానంగా ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ వంటి మధ్య, దక్షిణ ఆసియా దేశాలలో యాక్టివ్ గా ఉంది. ఈ నెట్‌వర్క్ రాడికల్ గ్రూపులు, ముఖ్యంగా నిషేధిత సంస్థలైన పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా, సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నడిపిస్తున్నాయని గుర్తించారు. దలిత మైనర్లు, ఆర్థికంగా వెనుకబడిన యువతను టార్గెట్ చేసుకుని, గౌరవం, ఆర్థిక స్థిరత్వం, మంచి జీవితాన్ని అందిస్తామని చెప్పి.. వారిని ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్నారు. గల్ఫ్ ఫండింగ్‌తో నడిచే సలాఫీ సంస్థలు వీరి రిక్రూట్‌మెంట్‌కు సహకరిస్తున్నాయి. ఉచిత విద్య, ఆశ్రయం, స్టైపెండ్‌లు అంటూ మొదలు పెట్టి ఆ తర్వాత వారిని దారిలోకి తెచ్చుకుంటున్నారు. ఈ జిహాదీ గ్రూపుల రిక్రూట్‌మెంట్ ప్రక్రియ చాలా వ్యవస్థీకృతంగా జరుగుతోందని నిఘా వర్గాలు గుర్తించాయి. మొదట వారు లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తులను గుర్తించి, 3 నుంచి 6 నెలల పాటు తీవ్రమైన ఐడియాలజికల్ ప్రభావానికి గురిచేస్తారు. సలాఫీ, వహాబీ టెక్స్ట్‌ల ద్వారా హిందూ కులవ్యవస్థను అణచివేయాలంటే జిహాద్‌ ఒక్కటే మార్గంగా చూపిస్తారు. అలా వారి ప్రభావానికి లోనైనా వారికి అరబిక్ పేర్లు పెట్టి, ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లు, క్రిప్టో ట్రాన్సాక్షన్‌లు, ఆయుధాలపై శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత కొచ్చి, తిరువనంతపురం విమానాశ్రయాల నుంచి నకిలీ డాక్యుమెంట్లతో దుబాయ్, ఇస్తాంబుల్ మీదుగా ఆఫ్ఘనిస్థాన్‌ పంపిస్తారు. 2016 కాసర్‌గోడ్ నుంచి 21 మంది ఇలానే అప్ఘనిస్థాన్ వెళ్లినట్టు గుర్తించారు. Kerala ISIS recruitment hub.

అలాగే గల్ఫ్ దేశాల నుంచి వచ్చే ఫండింగ్ ద్వారా కేరళలో కొన్ని రాడికల్ మసీదులు, మదరసాలు నడుస్తున్నాయని గుర్తించారు. ఇవి సలాఫీ-వహాబీ ఐడియాలజీని ప్రచారం చేస్తున్నాయని తేల్చారు. ఈ ఐడియాలజీలో సాంప్రదాయ ఇస్లామ్‌ను వ్యతిరేకిస్తూ, జిహాద్‌ను గౌరవప్రదంగా చూపిస్తారు. కతార్‌లోని షేక్ అబ్దుల్ రజాక్ వంటి వారు మలయాళంలో ఛానెల్స్ నడుపుతూ, సలాఫీ ఐడియాలజీని వ్యాప్తి చేస్తున్నారని గుర్తించారు. అలాగే PFI, SDPI వంటి సంస్థలు ఈ ఫండింగ్‌ను ఉపయోగించి, కేరళలో సేఫ్ హౌస్‌లను నడుపుతాయని కూడా తేల్చారు. ఇక్కడ యువతపై రాడికలైజ్ భావలను రుద్దుతున్నట్టు గుర్తించారు. ఈ సంస్థలు కుల వివక్ష, ఆర్థిక కష్టాలను చూపించి, దళిత యువతను టార్గెట్ చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఇటీవల కొంతమందిని అరెస్ట్‌ చేయగా.. కొన్ని కీలక విషయాలను బయటపట్టాయి. కేరళ నుంచి 50 మంది దళిత మైనర్లను విదేశాలకు తరలిస్తుండగా వారు పట్టుబడ్డారు. అప్పుడు రాడికల్ గ్రూపుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

కేరళాకు చెందిన నిమిషా ఫాతిమా, సోనియా సెబాస్టియన్ అనే ఇద్దరు మహిళలు ఈ నెట్‌వర్క్‌లో చిక్కుకుని ఐసిస్‌లో చేరారు. నిమిషా, పాలక్కాడ్‌కు చెందిన హిందూ మహిళ. డెంటల్ కాలేజీలో చదువుతోంది. ఆమె బెక్సన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని, ఇస్లామ్‌లోకి మారి, ఫాతిమా అనే పేరు పెట్టుకుంది. 2016లో ఆమె తన భర్తతో కలిసి ఆఫ్ఘనిస్థాన్‌కు వెళ్లింది. అయితే ఆమె భర్త 2017లో యుఎస్ ఎయిర్‌స్ట్రైక్‌లో చనిపోయాడు, కానీ నిమిషా, ఆమె కూతురు ఆఫ్ఘనిస్థాన్‌లోనే ఉండిపోయారు. నిమిషా కూతురు ఇప్పుడు ఐసిస్ శిబిరాల్లో శిక్షణ పొందుతోందని చెబుతున్నారు. ఇక సోనియా సెబాస్టియన్ కథ కూడా ఇలాంటిదే.. ఎర్నాకులం నుంచి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన ఈమె… 2011లో అబ్దుల్ రషీద్ అనే వ్యక్తిని వివాహం చేసుకుని, ఇస్లామ్‌లోకి మారింది. ఆ తర్వాత ఆయిషా అనే పేరు పెట్టుకుంది. ఆ తర్వాత PFI సేఫ్ హౌస్‌లో రాడికలైజ్ అయింది. 2016లో భర్తతో కలిసి ఆఫ్ఘనిస్థాన్‌కు వెళ్లింది. 2015 రంజాన్‌లో వీళ్లు కాసర్‌గోడ్, పడన్నాలో రహస్యంగా జిహాద్ క్లాసులు నిర్వహించారని సమాచారం. 2019లో యుఎస్ డ్రోన్ స్ట్రైక్‌లో సోనియా చనిపోయింది. ఈ ఇద్దరూ కాసర్‌గోడ్ మాడ్యూల్‌లో భాగమని గుర్తించారు.

కేరళ-ఆఫ్ఘనిస్థాన్ జిహాదీ లింకులు భారత్‌కు తీవ్రమైన భద్రతా ముప్పుగా మారే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు. అందుకే సీబీఐ, ఎన్‌ఐఏ లాంటి ఏజెన్సీలు రాడికల్ నెట్‌వర్క్‌లపై నిఘా పెంచాయి. గల్ఫ్ నుంచి వచ్చే ఫండింగ్‌ను అడ్డుకోవడానికి అంతర్జాతీయ సహకారం తీసుకుంటుంటున్నాయి. అయితే ఎన్‌క్రిప్టెడ్ యాప్‌లు, క్రిప్టో ట్రాన్సాక్షన్‌లను ట్రాక్ చేయడానికి సైబర్ ఫోరెన్సిక్ సామర్థ్యం అవసరం. ఇక సలాఫీ మదరసాలు, సంస్థలపై నిఘా కూడా పెరగాలి. 2022లో PFIను నిషేధించినప్పటికీ, SDPI ఇంకా స్వేచ్ఛగా పనిచేస్తోంది. ఈ సంస్థలను కఠినంగా నియంత్రించాలి. దళితులు, ఆర్థికంగా వెనుకబడిన యువతకు విద్య, ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం ద్వారా రాడికలైజేషన్‌ను తగ్గించవచ్చు. అవగాహన కార్యక్రమాలు, సైబర్‌దోస్త్ వంటి పోర్టల్‌ల ద్వారా ప్రజలను చైతన్యం చేయాలి. ఈ చర్యలు లేకపోతే, ఈ నెట్‌వర్క్ మరింత విస్తరించి, భారత యువత విదేశాల్లో జీహాదీలుగా మారే అవకాశం ఉంది.

Also Read: https://www.mega9tv.com/national/indian-bullet-train-corridor-from-ahmadabad-to-delhi-and-mumbai/