
ఇండియన్ ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా స్పేస్‌లోకి వెళ్ళడానికి రెడీ, కానీ ఈ యాక్సియం-4 మిషన్ ఎందుకు డిలే మీద డిలే అవుతోంది? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి శుక్లా ఎందుకు వెళ్తున్నాడు? ఇస్రో శుక్లానే స్పేస్ కు ఎందుకు పంపిస్తోంది? శుక్లా బ్యాగ్రౌండ్ ఏంటి ? ఇండియా ఫ్యూచర్ స్పేస్ ప్లాన్స్‌లో శుక్లా ఎలా గేమ్‌ఛేంజర్ కానున్నాడు? రాకేశ్ శర్మ తర్వాత ఐఎస్ఎస్‌కి వెళ్ళే ఫస్ట్ ఇండియన్‌గా శుక్లా హిస్టరీ క్రియేట్ చేయబోతున్నాడా?
శుభాంశు శుక్లా యాక్సియం-4 మిషన్‌తో ఐఎస్ఎస్‌కి వెళ్ళాలని ప్లాన్, కానీ ఈ ట్రిప్ నాలుగు సార్లు డిలే అయ్యింది. మొదట మే 29కి సెట్ చేసిన ఈ మిషన్, స్పేస్ స్టేషన్ షెడ్యూల్ అడ్జస్ట్‌మెంట్స్ వల్ల జూన్ 8కి మారింది. ఆ తర్వాత వెదర్ ఇష్యూస్ వల్ల జూన్ 10కి, మళ్ళీ జూన్ 11కి పోస్ట్‌పోన్ అయ్యింది. ఇప్పుడు లేటెస్ట్‌గా, జూన్ 11న కూడా లాంచ్ క్యాన్సిల్ చేశారు. ఫాల్కన్ 9 రాకెట్‌లో లిక్విడ్ ఆక్సిజన్ లీకేజ్ ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఈ ఇష్యూ బూస్టర్ స్టేజ్ టెస్ట్‌లో బయటపడింది. స్పేస్‌ఎక్స్, యాక్సియం స్పేస్ టీమ్స్ లీక్‌ని ఫిక్స్ చేసి, వాలిడేషన్ టెస్ట్స్ పూర్తి చేసిన తర్వాత కొత్త లాంచ్ డేట్ అనౌన్స్ చేస్తాయి. శుక్లా ఐఎస్ఎస్‌లో 14 రోజులు ఉండి.., 60 సైంటిఫిక్ ఎక్స్‌పెరిమెంట్స్, ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్, కమర్షియల్ యాక్టివిటీస్ చేయనున్నాడు. ఇండియా నుంచి ఏడు ఎక్స్‌పెరిమెంట్స్ చేయనున్నాడు శుక్లా. మైక్రోగ్రావిటీలో ఫెనుగ్రీక్, ముంగ్ దాల్ గ్రో చేయడం, టార్డిగ్రేడ్‌ల స్టడీ, హ్యూమన్-కంప్యూటర్ ఇంటరాక్షన్ రీసెర్చ్ మొదలైని అంతరిక్ష కేంద్రంలో శుక్లా చేస్తాడు. ఇవి ఫ్యూచర్ భారత స్పేస్ మిషన్స్‌కి సెల్ఫ్-సస్టైనబుల్ లైఫ్ సిస్టమ్స్ డెవలప్ చేయడానికి యూస్ అవుతాయి. శుక్లా యోగా డెమోలు, ఇండియన్ కల్చరల్ ఐటెమ్స్ తీసుకెళ్ళి ఇండియా వైబ్‌ని స్పేస్‌లో షోకేస్ చేస్తాడు. ఈ మిషన్ ఇండియాకి గ్లోబల్ స్పేస్ కోఆపరేషన్‌లో బిగ్ డీల్ అని చెప్పాలి. రాకేశ్ శర్మ 1984 సోయుజ్ ట్రిప్ తర్వాత 41 ఇయర్స్‌లో ఐఎస్ఎస్‌కి వెళ్ళే ఫస్ట్ ఇండియన్ శుక్లానే.
అసలు యాక్సియం-4 మిషన్ అంటే ఏంటి..?
యాక్సియం-4 అనేది అనేది ఓ ప్రైవేట్ స్పేస్ మిషన్. అమెరికన్ కు చెందిన కంపెనీ యాక్సియం స్పేస్ దీనిని నిర్వహిస్తోంది. నాసా, ఇస్రో, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సపోర్ట్‌తో ఈ ప్రయోగం చేయనున్నారు. ఈ మిషన్ ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్‌పై క్రూ డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌లో లాంచ్ అవుతుంది. కానీ కొత్త డేట్ ఇంకా అనౌన్స్ కాలేదు. ఈ మిషన్‌లో నలుగురు ఆస్ట్రోనాట్స్ ఉంటారు. ఇండియా నుంచి పైలట్ గా శుభాంశు శుక్లా వెళ్తుండగా అమెరికా, పోలాండ్, హంగరీ నుంచి మరో ముగ్గురు వ్యోమగాములు ఐఎస్ఎస్ కు వెళ్లనున్నారు. వీళ్ళు ఐఎస్ఎస్‌లో 14 రోజులు స్టే చేసి, 31 కంట్రీస్ నుంచి తీసుకొచ్చిన 60 సైంటిఫిక్ ఎక్స్‌పెరిమెంట్స్ రన్ చేస్తారు. అందులో ఇండియా నుంచి ఏడు ఉన్నాయి. యాక్సియం స్పేస్ గతంలో 2022లో ఆక్స్-1, 2023లో ఆక్స్-2, 2024లో ఆక్స్-3 మిషన్స్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసింది. ఇప్పుడు ఆక్స్-4తో స్పేస్ రీసెర్చ్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తోంది. ఈ మిషన్ ఇండియా, పోలాండ్, హంగరీకి 40 ఏళ్ల తర్వాత గవర్నమెంట్-స్పాన్సర్డ్ స్పేస్ ట్రిప్ ఛాన్స్ ఇస్తోంది. శుక్లా పైలట్‌గా, లాంచ్, డాకింగ్, రీ-ఎంట్రీ టైంలో కమాండర్‌కి సపోర్ట్ చేస్తాడు.
ఇస్రో శుక్లాను ఎందుకు పంపిస్తోంది?
ఇస్రో శుభాంశు శుక్లాను ఐఎస్ఎస్‌కి పంపడం వెనక పెద్ద ప్లానే ఉంది. భారత్ 2026లో గగన్‌యాన్ మిషన్‌కి రెడీ అవుతోంది. ఈ మిషన్ కోసం ఇస్రో 550 కోట్లు ఖర్చు చేసి, శుక్లాకి సీట్, ట్రైనింగ్ సెట్ చేసింది. ఐఎస్ఎస్‌లో శుక్లాకు వచ్చే ఎక్స్‌పీరియన్స్, మైక్రోగ్రావిటీలో వర్క్ చేయడం, స్పేస్‌క్రాఫ్ట్ ఆపరేషన్స్, ఎమర్జెన్సీ పరిస్థితులు హ్యాండిల్ చేయడం, గగన్‌యాన్ మిషన్‌కి సూపర్ బూస్ట్ ఇస్తుంది. శుక్లా ఇండియన్ స్టూడెంట్స్‌తో ఇంటరాక్ట్ చేసి, స్పేస్ సైన్స్‌పై ఇంట్రెస్ట్ పెంచే ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తాడు. ఈ మిషన్ ఇండియా గ్లోబల్ స్పేస్ కోఆపరేషన్‌కి బలం చేకూరుస్తూ.. నాసా, ఈఎస్ఏ లాంటి టాప్ స్పేస్ ఏజెన్సీస్‌తో బాండ్‌ని బిల్డ్ చేస్తుంది. ఇండియాని స్పేస్ రంగంలో గ్లోబల్ బాస్‌గా సెట్ చేస్తుంది.
శుక్లా బ్యాగ్రౌండ్ ఏంటి.. ప్రస్తుతం ఏం చేస్తున్నాడు?
శుభాంశు శుక్లా, అక్టోబర్ 10, 1985న లక్నోలో పుట్టాడు. లక్నో సిటీ మాంటిస్సోరి స్కూల్‌లో చదివి, 1999 కార్గిల్ వార్ ఇన్‌స్పిరేషన్‌తో యూపీఎస్సీ ఎన్‌డీఏ ఎగ్జామ్ క్లియర్ చేశాడు. 2005లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ తీసుకున్నాడు. 2006లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఫైటర్ పైలట్‌గా జాయిన్ అయ్యాడు. సుఖోయ్-30 ఎంకేఐ, మిగ్-21, మిగ్-29, జాగ్వార్, హాక్, డోర్నియర్, ఏఎన్-32 వంటి ఫైటర్ జెట్స్‌లో 2,000 గంటల ఫ్లైట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న టెస్ట్ పైలట్, కంబాట్ లీడర్. 2019లో ఇస్రో ఆయన్ని ఆస్ట్రోనాట్‌గా సెలెక్ట్ చేసింది. రష్యాలో యూరీ గగారిన్ కాస్మోనాట్ ట్రైనింగ్ సెంటర్‌లో ఏడాది ట్రైన్ అయ్యాడు. బెంగళూరులో ఇస్రో ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీ, నాసా జాన్సన్ స్పేస్ సెంటర్, స్పేస్‌ఎక్స్ హెడ్‌క్వార్టర్స్‌లో కూడా ట్రైనింగ్ తీసుకున్నాడు. 2024లో గ్రూప్ కెప్టెన్‌గా ప్రమోట్ అయ్యాడు. గగన్‌యాన్ మిషన్‌కి ప్రైమ్ ఆస్ట్రోనాట్ శుక్లానే.
శుక్లా ఫ్యూచర్‌లో ఏం చేయనున్నాడు?
శుభాంశు శుక్లా యాక్సియం-4 ఎక్స్‌పీరియన్స్ ఇండియా స్పేస్ ప్లాన్స్‌కి గేమ్‌ఛేంజర్. 2026లో గగన్‌యాన్, ఇండియా ఫస్ట్ స్వదేశీ హ్యూమన్ స్పేస్ మిషన్, శుక్లా ఐఎస్ఎస్ స్కిల్స్‌పై ఆధారపడనుంది. మైక్రోగ్రావిటీ ఆపరేషన్స్, సైంటిఫిక్ ఎక్స్‌పెరిమెంట్స్, ఎమర్జెన్సీ హ్యాండ్లింగ్ లాంటి స్కిల్స్ గగన్‌యాన్ టీమ్‌కి ట్రైనింగ్ ఇవ్వడానికి యూస్ అవుతాయి. ఇస్రో 2035 నాటికి ఇండియన్ స్పేస్ స్టేషన్ బిల్డ్ చేయాలని ప్లాన్ చేస్తోంది, శుక్లా ఎక్స్‌పీరియన్స్ సెల్ఫ్-సస్టైనబుల్ లైఫ్ సిస్టమ్స్ డెవలప్ చేయడానికి ఎంతో కీలకం కానుంది.