
NIA: PFI carried hit list: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 977 మంది పేర్లతో ఒక రహస్య జాబితా… ఈ జాబితాలో న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, కార్యకర్తల పేర్లు. కాస్త ఆలస్యం అయితే ఆ లిస్టులోని వారిని లేపేసే వారు. కాని అది ఎన్ఐఏ చేతికి చిక్కింది. అసలు ఏమిటీ లిస్ట్.. దీనిని రూపొందించింది ఎవరు? ఈ లిస్ట్ వెనక వెనుక కథ ఏమిటి? నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ లిస్టును ఎలా సాధించింది..? కేరళలోని ఓ ఉగ్రకుట్రను ఎన్ఐఏ ఎలా బయటపెట్టింది? కేరళలో బయటకు కనిపించని పెద్ద కుట్ర ఏదో జరుగుతోందా..? ఇది భారత దేశానికి ప్రమాదామా..?
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ లో ఉగ్రవాదుల కదలికలపై నిఘా పెరిగింది. ఉగ్రవాదులు, స్లీపర్ సెల్స్ కోసం ఎన్ఐఏ రాష్ట్రాలను జల్లెడ పడుతోంది. అనుమానం వచ్చిన వారిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో కేరళలో కొందమంది కదలికలు అనుమానం కలిగించాయి. వారిని ప్రశ్నించడంతో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఎన్ఐఏ దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపట్డాయి. ముఖ్యంగా కేరళలో నిషేధిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఒక హిట్‌లిస్ట్‌ను సిద్ధం చేసిందని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దర్యాప్తులో తేలింది. ఈ జాబితాలో న్యాయమూర్తులు, కీలక రాజకీయ నాయకులు, కార్యకర్తల పేర్లు ఉన్నాయి. ఎన్‌ఐఏ స్పెషల్ కోర్టు విచారణ సందర్భంగా దర్యాప్తు అధికారులు ఈ వివరాలను బయటపట్టారు. శ్రీనివాసన్ అనే ఆర్ఎస్ఎస్ నేత హత్య కేసులో ఇద్దరు నిందితులు బెయిల్ కోసం పిటిషన్ వేసినప్పుడు.. ఎన్‌ఐఏ ఈ బెయిల్‌ను తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ ఇద్దరిని ప్రశ్నిస్తున్న సమయంలో కొన్ని హిట్‌లిస్టులు బయటపడ్డాయి. ఫీఎఫ్‌ఐ సభ్యుడైన ఓ నిందితుడి ఇంట్లో 240 మంది పేర్లతో ఒక హిట్‌లిస్ట్, మరో నిందితుడు ఇంట్లో 500 మంది పేర్లతో మరో లిస్ట్ బయటపడింది. ఈ లిస్టుల్లో ఉన్న వారిని వీరు టార్గెట్ చేయాలని భావిస్తున్నట్టు తేలింది. లిస్టుల్లో చిరునామాలు, రాజకీయ నేపథ్యం, సామాజిక కార్యకలాపాలు, వారు ఏ సమయంలో ఎక్కడెక్కడికి వెళ్తారు అనే అన్ని వివరాలు ఉన్నాయి. NIA: PFI carried hit list.
అయితే ఈ లిస్టులను తయారు చేసిన పీఎఫ్‌ఐ సభ్యులు ఏదో పెద్ద కుట్ర పన్నుతున్నారనే అనుమానం వ్యక్తమవుతోంది. ఈ హిట్‌లిస్ట్ ను కేవలం ఒక జాబితాగా కొట్టిపాడేయలం అని అంటున్నారు. దేశ వ్యతిరేక కార్యక్రమాలు, ఉగ్రవాద సంబంధాల నేపథ్యంలో కేరళలో పీఎఫ్‌ఐ బ్యాన్ చేశారు. అయితే దీని సభ్యులు ఇంకా యాక్టివ్ గానే ఉన్నారని తెలుస్తోంది. పీఎఫ్‌ఐ తమ రిపోర్టర్ వింగ్ ద్వారా లక్ష్యంగా చేసుకున్న వ్యక్తుల గురించి రహస్య సమాచారం సేకరించింది. ఈ వింగ్ ఒక గూఢచార విభాగంలా పనిచేసింది. వారు న్యాయమూర్తులు, రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తల వివరాలను వారి రోజువారీ కార్యకలాపాలు, చిరునామాలు, ఫోన్ నంబర్లు సేకరించారు. ఈ సమాచారం ఆధారంగా హిట్‌లిస్ట్‌లు తయారయ్యాయి. ఈ వ్యక్తులపై దాడులు చేయడం.. సమాజంలో భయాందోళనలు సృష్టించడానికి పీఎఫ్‌ఐ ప్లాన్ చేసినట్టు ఎన్ఐఏ గుర్తించింది. అలాగే కేరళలోని పెరియార్ వ్యాలీ క్యాంపస్‌లో ఫీఎఫ్‌ఐ సభ్యులకు ఆయుధాలు ఎలా ఉపయోగించాలో, దాడులు ఎలా చేయాలో శిక్షణ ఇచ్చారని గతంలోనే తేల్చింది. ఈ క్యాంపస్ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రంగా ఉందని సీజ్ చేశారు. ఆ సమయంలో ఎన్‌ఐఏ సోదాల్లో డిజిటల్ డివైస్‌లు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు, వీటిలో పీఎఫ్‌ఐ అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి. ఈ డాక్యుమెంట్లలో పీఎఫ్‌ఐ, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా-SDPI మధ్య సంబంధాలను బయటపెట్టే సమాచారం కూడా ఉంది. పీఎఫ్‌ఐ తమ రాజకీయ ముసుగుగా SDPI ఉపయోగించుకుందని ఎన్‌ఐఏ ఆరోపిస్తోంది.
పీఎఫ్‌ఐ హిట్‌లిస్ట్ కేసులో SDPI పేరు కూడా తెరపైకి రావడం సంచలనంగా మారింది. పీఎఫ్‌ఐ రాజకీయ విభాగామే SDPI. పీఎఫ్‌ఐ తమ అక్రమ కార్యకలాపాలను దాచడానికి ఎస్‌డీపీఐని ఒక ముసుగుగా ఉపయోగించిందని ఆరోపణలు ఉన్నాయి. ఎస్‌డీపీఐ నేషనల్ ప్రెసిడెంట్ ఎంకే ఫైజీ ఈ కుట్రలో కీలక పాత్ర పోషించారని ఈడీ తెలిపింది. ఫైజీ ద్వారా ఫీఎఫ్‌ఐ దేశీయంగా, అంతర్జాతీయంగా నిధులు సేకరించింది. ఈ నిధులు హవాలా, బ్యాంకింగ్, డొనేషన్ల రూపంలో వచ్చాయి. ఈ డబ్బును ఉగ్రవాద కార్యకలాపాలు, హింసాత్మక రాజకీయ కార్యక్రమాలకు ఉపయోగించారని ఎన్‌ఐఏ ఆరోపిస్తోంది. ఎస్‌డీపీఐ రాజకీయ కార్యక్రమాలు, ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, క్యాడర్ సమీకరణ ఇవన్నీ ఫీఎఫ్‌ఐ నియంత్రణలో జరిగాయని ఎన్‌ఐఏ డాక్యుమెంట్లు వెల్లడిస్తున్నాయి. కేరళలోని ఫీఎఫ్‌ఐ హెడ్‌క్వార్టర్స్‌లో స్వాధీనం చేసుకున్న ఒక డాక్యుమెంట్లో కీలక విషయాలు బయటపడ్డాయి. కాన్సెప్టువల్ క్లారిటీ అబౌట్ ఆర్గనైజేషన్ అండ్ పార్టీ అనే టైటిల్‌తో భారతదేశంలో ఇస్లామిక్ ఉద్యమాన్ని ప్రోత్సహించడమే పీఎఫ్‌ఐ లక్ష్యంగా చెబుతోంది. ఈ డాక్యుమెంట్‌లో ఎస్‌డీపీఐ ఎలా పిఎఫ్‌ఐ ఆదేశాలను అమలు చేస్తుందో వివరంగా ఉంది. .
2022 సెప్టెంబర్‌లో కేంద్ర ప్రభుత్వం పిఎఫ్‌ఐని ఐదేళ్లపాటు నిషేధించింది. ఈ నిషేధం వచ్చిన కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా పిఎఫ్‌ఐ నాయకులు, కార్యకర్తలపై ఎన్‌ఐఏ, ఇడి, రాష్ట్ర పోలీసులు భారీ దాడులు చేశాయి. 11 రాష్ట్రాల్లో 100 మందికి పైగా అరెస్టయ్యారు. ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, డిజిటల్ డివైస్‌లు ఫీఎఫ్‌ఐ ఉగ్రవాద కార్యకలాపాలను, వారి నిధుల మూలాలను బయటపెట్టాయి. కేరళలోని మలప్పురం, ఎర్నాకులం, వయనాడ్ లాంటి ప్రాంతాల్లో దాడులు జరిగాయి. ఎన్‌ఐఏ ఈ కేసులో నిందితులపై చార్జ్‌షీట్ దాఖలు చేసింది. పీఎఫ్‌ఐ 2047 నాటికి భారతదేశంలో ఇస్లామిక్ పాలన స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుందని ఎన్‌ఐఏ ఆరోపిస్తోంది.